iDreamPost
android-app
ios-app

దర్శన్‌పై 200కు పైగా ఆధారాలు సేకరించాం: పోలీసులు

Renukaswamy Case: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తిని బెంగళూరులో ఓ షెడ్ లో బంధించి దారుణంగా హింసి హత్య చేయించిన ఆరోపణలో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఆయన ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Renukaswamy Case: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తిని బెంగళూరులో ఓ షెడ్ లో బంధించి దారుణంగా హింసి హత్య చేయించిన ఆరోపణలో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఆయన ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

దర్శన్‌పై 200కు పైగా ఆధారాలు సేకరించాం: పోలీసులు

గత నెల జూన్ 8న తన అభిమాని హత్య కేసుకు సంబంధించిన కన్నడ ఛాలెంజింగ్ స్టార్ హీరో దర్శన్ తో పాటు అతని ప్రియురాలు పవిత్ర గౌడ ను పోలీసులు అరెస్ట్ చేయడం ఇండస్ట్రీలో సంచలనం రేపింది. పవిత్ర్ గౌడకు అసభ్య మెసేజ్ లు పంపుతున్నాడన్న కోపంతో హీరో దర్శన్ కొంతమందికి సుపారీ ఇచ్చి చంపించాడని.. ఆ సమయంలో ఆయనతో పాటు నటి పవిత్ర గౌడ కూడా ఉన్నట్లు పోలీసులు ఆపిస్తున్నారు. ఇప్పటికే వీరి ఫింగర్ ప్రింట్ రిపోర్టు‌లు కూడా మ్యాచ్ అయినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసు దర్యాప్తులో ఎవరికీ సాఫ్ట్ కార్నర్ చూపే ప్రసక్తి లేదని కర్ణాటక హూం శాఖ మంత్రి గంగాధరయ్య పరమేశ్వర దర్యాప్తు వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరులో రేణుకా స్వామి అనే వ్యక్తి దారుణ హత్య జరిగింది. అతని స్వగ్రామం చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి బెంగుళూరుకు తీసుకువచ్చి ఒక షెడ్డులో ఉంచి చిత్ర హింసలకు గురి చేసి చంపారు. హత్య అనంతరం అతని మృతదేహాన్ని కాలువలో పడేశారు. దగ్గరలోని ఓ సెక్యూర్టీ గార్డు మృతదేహం గురించి పోలీసులకు తెలపగా మొదట మాములు కేసుగా భావించినా.. తర్వాత ఈ కేసు అనూహ్యంగా మలుపులు తిరింది. నలుగురు నిందితులు రేణుకా స్వామిని హత్య చేసింది తామే అని.. హత్య చేయించింది ప్రముఖ నటుడు దర్శన్ అతని ప్రియురాలు పవిత్ర గౌడ అని పోలీసులకు చెప్పారు. పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్ లు పంపుతున్నాడన్న కారణంగా నిందితులు రేణుకాస్వామిని దారుణంగా నరికి చంపినట్లు తేలింది.ఈ క్రమంలోనే హీరో దర్శన్,పవిత్ర గౌడ తో పాటు 13 మంది నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిన తర్వాత పరప్పన అగ్రహార జైలులో తరలించారు.

ఇదిలా ఉంటే రేణుకా స్వామి హత్య కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందని, ఎవరి ఒత్తిడి లేదని కర్ణాటక హూంమత్రి జి పరమేశ్వర అన్నారు. మరోవైపు రేణుకా స్వామి హత్య కేసులో ఇప్పటికే 200 కి పైగా భౌతిక, సాంకేతిక ఆధారాలు సేకరించామని సినియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.ఇటీవల వివిధ వస్తువులపై ఉన్న వేలి ముద్రలు దర్శన్, పవిత్ర గౌడ తో పాటు 10 మంది నిందితుల వేలి ముద్రలు సరిపోలుతున్నాయని అధికారి తెలిపారు. ఈ కేసులో మరిన్ని ఆధారలు సేకరించిన తర్వాత దర్శన్ తూగుదీప, పవిత్ర గౌడలపై చార్జి షీట్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. నేరం చేసింద ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు అని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి