iDreamPost
android-app
ios-app

యూట్యూబర్, ఫోక్ సింగర్ మల్లిక్‌ తేజ్‌ పై అత్యాచార కేసు..!

  • Published Sep 29, 2024 | 12:00 PM Updated Updated Sep 29, 2024 | 12:00 PM

Folk Singer Mallik Tej: ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు, యూట్యూబర్లు లైంగిక ఆరోపణల కేసుల్లో కటకటాల పాలవుతున్నారు. తాజాగా వీరి లీస్టులో ప్రముఖ యూట్యూబర్, ఫోక్ సింగర్ చేరారు.

Folk Singer Mallik Tej: ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు, యూట్యూబర్లు లైంగిక ఆరోపణల కేసుల్లో కటకటాల పాలవుతున్నారు. తాజాగా వీరి లీస్టులో ప్రముఖ యూట్యూబర్, ఫోక్ సింగర్ చేరారు.

  • Published Sep 29, 2024 | 12:00 PMUpdated Sep 29, 2024 | 12:00 PM
యూట్యూబర్, ఫోక్ సింగర్ మల్లిక్‌ తేజ్‌ పై అత్యాచార కేసు..!

సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ రావడం అనేది గొప్ప అదృష్టం. అందుకే ప్రతిరోజూ ఎంతోమంది యువత స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఒక్క ఛాన్స కోసం ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వాళ్లను కొంతమంది దళారులు నిలువునా మోసం చేస్తున్నారన్న విషయం తెలిసినా తమ ప్రయత్నాలు మాత్రమం ఆపుకోవడం లేదు. ముఖ్యంగా అమ్మాల విషయంలో ఎన్నో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలు సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి వారిపై లైంగిక దాడి చేసి కోరిక తీరిన తర్వాత ముఖం చాటేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెళ్లి చేసుకొని మోసం చేశాడని హీరో  రాజ్ తరుణ్ కేసు సంచలనం రేపింది. ఆ తర్వాత వరుసగా లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై కేసులు నమోదు అయ్యాయి. తాజాగా మరో యూట్యూబర్ పై అత్యాచార కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే..

జగిత్యాల జిల్లాలో మరో జానీ మాస్టర్ తయారయ్యాడు.. లేడీ సింగర్ ను కొంత కాలంగా బెదిరింపులు, లైంగిక వేధింపులకు గురి చేసినట్లు సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలంగాణలో ఫోక్ సాంగ్స్ రైటర్ సుద్దాల మల్లిక్ తేజ ఎన్నో హిట్ సాంగ్స్ ని రచించి మంచి పేరు తెచ్చుకున్నారు. తన రచనల ద్వారా లోకల్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ జిగిత్యాల లోని మామిడి మౌనిక అనే యువతికి సింగర్ గా అవకాశం ఇచ్చాడు. వీరి కాంబోలో వచ్చిన ఎన్నో ఫోక్స్ సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. దుబాయ్ వంటి ఇతర దేశాల్లో ఎన్నో ఈవెంట్స్ నిర్వహించారు. ఇదిలా ఉంటే.. సుద్దాల మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదు చేశారు జగిత్యాల పోలీసులు.

అవకాశాలు ఇప్పిస్తానని లైంగిగ వేధింపులకు గురి చేశాడని మల్లిక్ తేజ్ పై సింగర్ మామిడి మౌనిక ఫిర్యాదు చేసింది. తన యూట్యూబ్ ఛానల్ ఇంస్టాగ్రామ్ ఐడీలు పాస్ వర్డ్స్ లు మార్చి, తనపై బెదిరింపులకు పాల్పపడుతూ మానసికంగా వేధిస్తున్నాడని జగిత్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అంతేకాదు స్టూడియలో తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది మౌనిక. తరుచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని, తన కుటుంబ సభ్యులను కూడా దుర్బాషలాడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మల్లిక్ తేజ్ పై కేసు నమోదు చేసిన జగిత్యాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.