Dharani
Pirates Of The Caribbean: ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. సొర చేప దాడిలో ప్రముఖ నటుడు ఒకరు మృతి చెందారు. ఆ వివరాలు..
Pirates Of The Caribbean: ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. సొర చేప దాడిలో ప్రముఖ నటుడు ఒకరు మృతి చెందారు. ఆ వివరాలు..
Dharani
ఇండస్ట్రీని వరుస విషాదాలు వదలడం లేదు. అలానే వివాదాలు కూడా. ప్రస్తుతం మన దేశంలో కన్నడ సూపర్ స్టార్ దర్శన్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా తన ప్రియురాలిని దూషించాడనే కారణంతో.. రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేయించాడు. ఈ కేసులో దర్శన్‌తో పాటు అతడి ప్రియురాలు పవిత్ర గౌడ కూడా జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సొర చేప దాడిలో అనగా షార్క్ దాడిలో ఓ నటుడు మృతి చెందడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
సర్ఫింగ్ చేస్తుండగా.. షార్క్ దాడి చేయడంతో ఓ నటుడు మృతి చెందాడు. ఈ ఘటన హాలీవుడ్‌లో చోటు చేసుకుంది. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ నటుడు తమయో పెర్రీ.. షార్క్ దాడిలో ప్రాణాలు విడిచాడు. హవాయిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నటుడు తమయో పెర్రీ జూన్ 23, ఆదివారం మధ్యాహ్నం.. హవాయి, గోట్ ఐలాండ్ సమీపంలో సర్ఫింగ్ చేస్తుండగా.. ఘోరమైన షార్క్ దాడికి గురై మరణించాడు. తమయో హవాయిలోని ఓహు సమీపంలో గోల్ ఐలాండ్ సమీపంలో సర్ఫింగ్ చేస్తుండగా.. షార్క్ అతడిపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. తమయోని గమనించిన ఓ వ్యక్తి.. వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించాడు.
విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని.. తమయో పెర్రీని ఒడ్డుకు చేర్చారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు తెలిసింది. తమయో పెర్రీ శరీరంపై అనేక షార్క్ కాటు గుర్తులు ఉన్నాయి అని తెలిపారు. నటుడి మృతి నేపథ్యంలో సముద్ర భద్రతా అధికారులు ఆ ప్రాంతంలో షార్క్ దాడి గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఆ ప్రాంతంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక తమయో పెర్రీ, జూలై 2016లో ఓషన్ సేఫ్టడిపార్ట్‌మెంట్‌లో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ‘ఆన్ స్ట్రేంజర్ టైడ్స్’ అనే పైరేట్స్ సినిమాలో పెనెలోప్ క్రజ్, జియోఫ్రీ రష్, ఇయాన్ మెక్‌షేన్‌లతో కలిసి నటించారు.
49 ఏళ్ల వయసులో.. ‘ది పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్’ స్టార్, లైఫ్‌గార్డ్, సర్ఫింగ్ శిక్షకుడు అయిన తమయో పెర్రీ.. అదే సర్ఫింగ్ చేస్తూ.. మృత్యువాత పడటం సంచలనంగా మారింది. తమయో పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ సినిమాతో పాటు.. ‘బ్లూ క్రష్’, ‘చార్లీస్ ఏంజిల్స్: ఫుల్ థ్రాటిల్’ చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.