iDreamPost
android-app
ios-app

పురాణాల్లో రావణాసురుడు.. ఆదిపురుష్‌ లంకేష్‌ ఇద్దరు ఒక్కరేనా..? వేర్వేరా?

  • Published Jun 16, 2023 | 6:36 PM Updated Updated Jun 16, 2023 | 6:36 PM
  • Published Jun 16, 2023 | 6:36 PMUpdated Jun 16, 2023 | 6:36 PM
పురాణాల్లో రావణాసురుడు.. ఆదిపురుష్‌ లంకేష్‌ ఇద్దరు ఒక్కరేనా..? వేర్వేరా?

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురు చూసిన ఆదిపురుష్‌ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో.. ప్రభాస్‌ వంటి పాన్‌ ఇండియా స్టార్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రారంభం నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌, టీజర్‌ విడుదల నుంచే పెద్ద ఎత్తున​ విమర్శలు ఎదుర్కొన్నది. మరీ ముఖ్యంగా రావణుడి గెటప్‌పై పెద్ద ఎత్తన విమర్శలు వచ్చాయి. సీతమ్మ వేషధారణ, వానర సైన్యం.. ఇలా ప్రతీది విమర్శల పాలయ్యింది. దాంతో మరో వంద కోట్ల రూపాయలు కేటాయించి.. సినిమాకు మెరుగులు దిద్ది.. మరీ విడుదల చేశారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మిక్స్డ్‌ టాక్‌ వచ్చింది. ఫస్టాఫ్‌ ఓకే.. సెకండాఫ్‌ మాత్రం పెద్దగా ఆకట్టుకునేలా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వీటి సంగతి కాసేపు పక్కకు పెడితే.. సినిమాలో రావణుడి పాత్ర తెరకెక్కించిన తీరు మీద సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అసలు ఓం రౌత్‌కు రామాయణం పూర్తిగా కాకపోయినా.. కనీసం ఆయా పాత్రల గురించి కాస్త అయినా ఐడియా ఉంది అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా రాముడు అనగానే నీలమేఘ వర్ణంలో కళ్ల ముందు సాక్షాత్కరిస్తాడు. ఆదిపురుష్‌ చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో ఒదిగిపోయాడు.. కనుక ప్రేక్షకులు రంగు గురించి పట్టించుకోలేదు. కానీ రాముడికి మీసాలు ఉండటాన్ని ప్రేక్షకులు మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అలానే సీతమ్మ మేడలో మంగళసూత్రం, పాపిట్లో సింధూరం లేకపోవడాన్ని ట్రైలర్‌ విడుదల నుంచే తప్పు పడుతున్నారు.

ఇక సినిమా ట్రైలర్‌, టీజర్‌ విడుదల నాటి నుంచి ఎక్కువగా విమర్శలు మూట గట్టుకుంది రావణుడి పాత్ర. సినిమాలో ఈ పాత్రను లంకేష్‌గా పరిచయం చేశారు. ఇక సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు కొత్త అనుమానాలు వస్తున్నాయి. సినిమాలో చూపిన లంకేష్‌, మనం పురణాల్లో చదువుకున్న రావణుడు ఇద్దరు ఒక్కరేనా.. లేక ఇద్దరు వేర్వేరు వ్యక్తులా అని ప్రశ్నిస్తున్నారు. వాల్మికీ రామాయణం ప్రకారం రావణుడు బ్రాహ్మణుడు.. నికార్సైన శివ భక్తుడు. రాక్షస రాజు. నిత్యం శివ పూజ చేస్తాడు.. బ్రాహ్మణుడు కావడంతో మెడలో జంధ్యం ధరిస్తాడు.

రావణుడా.. అల్లావుద్దీన్‌ ఖిల్జీనా..?

కానీ ఆదిపురుష్‌ సినిమాలో లంకేష్‌ పాత్రను చూస్తే.. ఏదో హాలీవుడ్‌ చిత్రంలోని విలన్‌ పాత్ర.. తప్ప మనం పురణాల్లో చదువుకున్న, పాత సినిమాలు, సీరియల్స్‌లో చూసిన రావణుడి పాత్ర ఒక్కసారి కూడా గుర్తుకు రాదు. పైగా ఈ సినిమాలో లంకేష్‌ పాత్రకు తలపై నిక్కబొడుచుకున్న జుట్టు, పొడవైన గెడ్డం, కాటుక కళ్ళతో.. సైఫ్ రావణాసురుడి కంటే కూడా అలావుద్దీన్ ఖిల్జీలా కనిపిస్తున్నారని.. ట్రైలర్‌, టీజర్‌ విడుదల సమయంలోనే భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాక రావణుడు ప్రయాణించిన పక్షి కూడా ఏదో భీకారాకారంగా ఉంది తప్పితే.. భారతీయత ఏమాత్రం కనిపించలేదు. వీటన్నింటికి సినిమాలో ఏమైనా జస్టిఫికేషన్‌ ఇస్తారేమో అని చూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురయ్యింది. కేవలం గెటప్‌ పరంగా మాత్రమే కాక.. సినిమాలో రావణుడి చేష్టలతో మరింత దిగజర్చారని మండి పడుతున్నారు.

కనీసం ఆ సినిమాలు చూసినా.. సరిపోయేది కదా..

ఈ చిత్రంలో రావణుడు సీతాదేవి మెడకు కత్తి పెట్టడం, రావణుడు పాత్ర ఓ పెద్ద అనకొండలాంటి పాము చేత మసాజ్ చేయించుకోవటం కూడా బాగోలేదు అంటున్నారు ప్రేక్షకులు. అసలు ఆదిపురుష్‌ చిత్రంలో తెరకెక్కించిన రావణుడు భారతీయుడిలా కనిపించడం లేదు. ఆయన కళ్ళకు నీలం రంగు మేక్‌అప్ వేసి, తోలు జ్యాకెట్‌లను ధరింపచేశారు. ఈ సినిమాలో రామయాణాన్ని పూర్తిగా వక్రీకరించారు. సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రామయాణాన్ని.. ఇలా ఇష్టా రీతిన మార్పులు చేసి.. అవాస్తవాలను చిత్రీకరించడం ఎంత వరకు సమంజసం అని మండి పడుతున్నారు. ఓం రౌత్‌.. ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు.. పాత్రల చిత్రీకరణ కోసం భూకైలాస్‌, లవకుశ, సంపూర్ణ రామాయణం సినిమాలు చూసినా సరిపోయేది. ఓం రౌత్‌ వందల కోట్లు ఖర్చు చేసి ఇలాంటి తప్పుడు గ్రాఫిక్స్‌ చిత్రం తీయడం ఎంత వరకు కరెక్ట్‌ అని ప్రశ్నిస్తున్నారు.