iDreamPost
android-app
ios-app

ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్.. ఇప్పుడేమో ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది

  • Published Nov 28, 2023 | 11:02 AM Updated Updated Nov 28, 2023 | 11:02 AM

ఆమె ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్. వివాహం తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఇలా ఉండగా తాజాగా ఆమె ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిల్లో ఆమె గుర్తు పట్టరానంతగా మారింది. ఇంతకు ఎవరా హీరోయిన్ అంటే..

ఆమె ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్. వివాహం తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఇలా ఉండగా తాజాగా ఆమె ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిల్లో ఆమె గుర్తు పట్టరానంతగా మారింది. ఇంతకు ఎవరా హీరోయిన్ అంటే..

  • Published Nov 28, 2023 | 11:02 AMUpdated Nov 28, 2023 | 11:02 AM
ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్.. ఇప్పుడేమో ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది

సినిమా ఇండస్ట్రీలో మిగతా వారి సంగతి ఎలా ఉన్నా సరే.. హీరో, హీరోయిన్ల విషయానికి వస్తే.. లుక్ చాలా బాగుండాలి. ఏదో కొద్ది మంది మాత్రమే రూపు ఎలా ఉన్నా సరే.. తమలోని ప్రతిభతో రాణిస్తారు. ఇక లుక్ విషయంలో హీరోలకైనా కొన్ని మినహాయింపులు ఉంటాయేమో కానీ.. హీరోయిన్లకు మాత్రం.. అలాంటివి ఏం ఉండవు. కథానాయకి విషయానికి వస్తే శరీరసౌష్టవం నుంచి కలర్ వరకు కొన్ని అంశాలను ఫిక్స్ చేసి ఉంచుతారు. అవన్ని పాటిస్తేనే హీరోయిన్ గా అవకాశాలు వస్తాయి. ఆ తర్వాత కూడా వాటిని అలా కొనసాగిస్తేనే.. కెరీర్ కొన్నాళ్ల పాటైనా ఉంటుంది. అలా కాదని ఏమాత్రం ఒళ్లు చేసినా.. ఇక వారిని పక్కకు పెట్టేస్తారు. అవకాశాల మాట అటుంచితే బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది.

ఇక నటీనటులు మరీ ముఖ్యంగా హీరోయిన్లు తెర మీద కనిపించినన్ని రోజులు.. అందంగా కనిపించడం కోసం ఎంతో కష్టపడతారు. ఇక ఒక్క సారి లైమ్ లైట్ కు దూరమయ్యారంటే.. లుక్స్ గురించి ఏమాత్రం పట్టించుకోరు. ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు టాప్ హీరోయిన్లుగా స్టార్ హీరోల సరసన నటిస్తూ కుర్రాళ్ల కలల రాణులుగా గుర్తింపు తెచ్చుకున్న వారు ఆ తర్వాత గుర్తు పట్టరానంతగా మారిపోతారు. తాజాగా ఓ తెలుగు హీరోయిన్ ను చూసిన వారు కూడా ఇలానే అనుకుంటున్నారు. మరీ ఇంతలా మారి పోయింది ఏంటి అని చర్చించుకుంటున్నారు. ఇంతకు ఎవరా హీరోయిన్ అంటే..

పైన ఫొటోలో ఉన్న ఆమెని చూశారు కదా. ఈమె అచ్చ తెలుగు హీరోయిన్. పుట్టి పెరిగింది అంతా ఉమ్మడి ఆంధ్రాలోనే. పద్దెనిమిదేళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. సుమారు 20 ఏళ్ల పాటు వెండి తెరను ఏలింది. తన కెరీర్లో అనేక హిట్ సినిమాల్లో.. అందునా స్టార్ హీరోల సరసన చేసింది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా సినిమాలు తగ్గించేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. మరి ఇంతకు ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా.. లేదా.. ఆమె పేరు రవళి. ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియని పేరు. ‘పెళ్లి సందడి’ రవళి అంటే మాత్రం చాలామంది గుర్తుపట్టేస్తారు.

వ్యక్తిగత జీవితం..

1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో పుట్టిన ఈమె.. 1990లో ‘జడ్జిమెంట్’ అనే మలయాళ సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత ఏడాదే తెలుగులో ‘జయభేరి’ మూవీలో హీరోయిన్‌గా చేసింది. తొలుత నాలుగేళ్ల పాటు రవళికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఎప్పుడైతే ‘పెళ్లి సందడి’ సినిమా చేసిందో ఆ తర్వాత ఆమె కెరీర్ మలుపు తిరిగింది. 1996లో వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమా.. రవళి కెరీర్‌కి బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా విజయం తర్వాత ఆమెకు వరసపెట్టి అవకాశాలు వచ్చాయి.

రవళి నటించిన చిత్రాల్లో ఒరేయ్ రిక్షా, వినోదం, చిన్నబ్బాయి, ముద్దుల మొగుడు, శుభాకాంక్షలు, మర్ద్(హిందీ) తదితర చిత్రాలు ఈమెకు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక హీరోయిన్ గా ఛాన్సులు తగ్గిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక చిత్రాల్లో నటించింది. 2011లో ‘మాయగాడు’ అనే సినిమాలో చివరగా తెర మీద కనిపించింది రవళి.

ఇక రవళి వ్యక్తిగత విషయానికొస్తే.. 2007లో నీలి కృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రవళికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సీరియల్ నటి హరిత.. రవళికి అక్క అవుతుంది. ఇకపోతే ఎప్పటికప్పుడు తిరుమల దర్శనానికి వచ్చే రవళి.. తాజాగా ఫ్యామిలీతో కలిసి స్వామి వారిని దర్శించుకుంది. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు చూసి తొలుత ఆమెని గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత గుర్తుపట్టి, ఈమె ఆమెనా అని అనుకుంటున్నారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom