iDreamPost
android-app
ios-app

ఒకప్పటి లేడీ కమెడియన్ అనుజ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

విక్టరీ వెంకటేష్, మీనా కాంబోలో వచ్చిన తొలి చిత్రం చంటి. ఈ సినిమాలో వీరి పాత్రలు ఎంతలా మెప్పిస్తాయో.. బ్రహ్మానందం కామెడీ సీన్లు కూడా నవ్వు తెప్పిస్తుంటాయి. ఇందులో బ్రహ్మీకి భార్యగా నటించిన లేడీ కమెడియన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా...?

విక్టరీ వెంకటేష్, మీనా కాంబోలో వచ్చిన తొలి చిత్రం చంటి. ఈ సినిమాలో వీరి పాత్రలు ఎంతలా మెప్పిస్తాయో.. బ్రహ్మానందం కామెడీ సీన్లు కూడా నవ్వు తెప్పిస్తుంటాయి. ఇందులో బ్రహ్మీకి భార్యగా నటించిన లేడీ కమెడియన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా...?

ఒకప్పటి లేడీ కమెడియన్ అనుజ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

తెలుగు ఇండస్ట్రీలో లేడీ కమెడియన్లు చాలా తక్కువ. ఒకప్పుడు గిరిజ, రమాప్రభ తమ నటనతో నవ్వులు పువ్వులు పూయించగా.. ఆ తర్వాత కల్పనారాయ్, శ్రీలక్ష్మి, కోవై సరళ వంటి కమెడియన్లు ఆకట్టుకున్నారు. వీరి తరంలోనే కామెడీతో పాటు బోల్డ్ క్యారెక్టర్ చేశారు కొంత మంది నటీమణులు. జయలలిత, సిల్క్ స్మిత, డిస్కోశాంతి మాత్రమే కాకుండా అనుజ అనే నటి కూడా వ్యాంప్ క్యారెక్టర్స్ చేసి ఫేమస్ అయ్యింది. చాలా మందికి అనుజ తెలియకపోవచ్చు కానీ..ఒకప్పుడు తెలుగులో బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు. 80- 90వ దశకంలో తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో అలరించింది. వెంకటేశ్ చంటి మూవీ చూసిన ప్రతి ఒక్కరికీ ఆమె గుర్తిండిపోతుంది. బ్రహ్మానందం ప్రేయసిగా, భార్యగా నటించింది.

బ్రహ్మనందానికి రేచీకటని తెలియక.. సినిమాకు తీసుకు వెళ్లి అగచాట్లు పడుతుంది. ఈ మూవీ చూసిన వారికి ఆమెను కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. మలయాళీ ఇండస్ట్రీ ద్వారా ఆమె పరిచయం అయ్యింది అనుజ. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో పుట్టింది. ఆమెకు ఇద్దరు అన్నలు, అక్క ఉన్నారు. ఈమె ఇంట్లో చివరి అమ్మాయి. ఆమె మూడేళ్లకే ఆమె కుటుంబం చెన్నైకి వెళ్లింది. అయితే అనుకోకుండా.. ఓ మలయాళ సినిమాలో సెకండ్ హీరోయిన్ అయ్యింది. అక్కడ నుండి ఆమె సినీ పరంపర మొదలైంది. దక్షిణాది ఇండస్ట్రీలో సత్తా చాటింది అనుజ. 12వ తరగతి వరకు చదువుకున్న అనుజ.. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి వచ్చి.. గ్లామర్ పాత్రల్లో మెప్పించింది. హీరోయిన్, కమెడియన్, వ్యాంప్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 200లకు పైగా చిత్రాల్లో నటించింది.

తెలుగులో బ్రహ్మానందం, బాబు మోహన్ వంటి కమెడియన్లతో ఆమె కాంబో సీన్స్ చేసింది. చంటి, కన్నయ్య కిట్టయ్య, సూర్యవంశం, పెళ్లి చేసుకుందాం, వాలు జడ-తోలు బెల్టు వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. అటు తమిళంలో రజనీకాంత్, విజయ్ వంటి వారితో స్పెషల్ సాంగ్స్‌లో ఆడిపాడింది. గౌండ్ మణి, సెంథిల్, వడివేలు వంటి స్టార్ కమెడియన్లతో నటించింది. 2004 వరకు ఇండస్ట్రీలో కొనసాగిన అనుజ.. ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. కెరీర్ బాగున్న సమయంలోనే ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఆమెకు ఓ కొడుకు. ప్రస్తుతం వ్యాపార రంగంలో కొనసాగుతుంది. సోషల్ మీడియాలో ఫ్యామిలీ..తన సినిమాలకు సంబంధించిన చిన్న చిన్న పిక్స్ పెడుతూ అలరిస్తోంది ఒకప్పటి అందాల తార. మళ్లీ మన దర్శకుల కళ్లల్లో పడి.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందేమో చూడాలి.