Dharani
Pekamedalu Movie-Ticket For Rs 50: సినిమా టికెట్ ధరలు భారీగా పెరుగుతున్న వేళ.. ఓ మూవీ టీమ్ బంపరాఫర్ ప్రకటించింది. టికెట్ ధరను 50 రూపాయలుగా ప్రకటించింది. ఆ వివరాలు..
Pekamedalu Movie-Ticket For Rs 50: సినిమా టికెట్ ధరలు భారీగా పెరుగుతున్న వేళ.. ఓ మూవీ టీమ్ బంపరాఫర్ ప్రకటించింది. టికెట్ ధరను 50 రూపాయలుగా ప్రకటించింది. ఆ వివరాలు..
Dharani
సినిమా అనేది మనిషికి వినోదం పంచే ప్రధాన సాధనం. ఏళ్లుగా మూవీలు ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నాయి. ఆ తర్వాత టీవీలు రావడంతో సినిమాలు మనిషికి మరింత చేరువయ్యాయి. కరోనా ముందు వరకు కూడా మన దగ్గర థియేటర్లు ఓ వెలుగు వెలిగాయి. ప్రతి శుక్రవారం నాడు థియేటర్ దగ్గర పండగ వాతావరణం కనిపించేది. ఇక స్టార్ హీరో సినిమా అయితే ఆ హాడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భారీ కటౌట్‌లు, పాలాభిషేకాలు, పూల దండలు, టపాసుల మోత.. పండగ వాతావరణాన్ని తలపించేది. అయితే కరోనా తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చాలా వరకు థియేటర్లు మూతపడ్డాయి.
దీనికి తోడు ఓటీటీలకు క్రేజ్ పెరుగుతుండటంతో.. థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అందుకు ప్రధాన కారణం భారీగా పెరిగిన సినిమా టికెట్ రేట్లు. కుటుంబం మొత్తం కాదు ఒక్కరు సినిమా చూడాలన్నా.. కనీసం 500 రూపాయలు ఖర్చు చేయాలి. అదే ఫ్యామిలీ మొత్తం అంటే.. వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. టికెట్ రేట్లు భారీగా పెరిగిన ఈ కాలంలో.. ఓ బంపరాఫర్ ప్రేక్షకులను టెంప్ట్ చేస్తుంది. కేవలం 50 రూపాయలకే సినిమా టికెట్ అనే ఆఫర్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో అయినా సరే సినిమా చూడాలంటే.. మినిమం 300 రూపాయల వరకైనా ఖర్చు చేయాల్సిందే. అదే మల్టీప్లేక్స్ అయితే.. 500-600 రూపాలు ఖర్చు చేయాలి. టికెట్ ధరనే భారీగా ఉంటుంది. ఈ క్రమంలో త్వరలోనే విడుదలకు రెడీ అవుతున్న పేక మేడలు సినిమా బృందం బంపరాఫర్ ప్రకటించింది. అదే 50 రూపాయలకు మూవీ టికెట్. అయితే అన్నింటికి ఈ రేటు వర్తించదు. కేవలం పెయిడ్ ప్రీమియర్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ వినూత్న ఆఫర్ ప్రకటించింది పేకమేడలు టీమ్. పెయిడ్ ప్రీమియర్ టికెట్‌ను రూ.50కే అందించేందుకు రెడీ అయ్యింది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లలో పెయిడ్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు. వాటి కోసం ఈ 50 రూపాయల ఆఫర్ ప్రకకటించింది.
ఇక పేకమేడలు సినిమా విషయానికి వస్తే.. నటుడు రాకేశ్ వర్రే నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ చిత్రంలో వినోద్ కిషన్, అనూష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. జూలై 19న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. కామెడీతో పాటు మద్యతరగతి ఫ్యామిలీ ఎమోషన్స్‌ని హైలెట్ చేసినట్లుగా తెలుస్తోంది. నీలగిరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక సినిమాలో హీరోగా నటించిన వినోద్ కిషోన్.. గతంలో నా పేరు శివ, అంధగారం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో నటించాడు. పేకమేడలు చిత్రంతో హీరోగా మారాడు. రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో.. సినిమా టీమ్ ప్రమోషన్స్ వేగం పెంచింది.