iDreamPost
android-app
ios-app

పేకమేడలు మూవీకి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు: నిర్మాత రాకేష్ వర్రే

చిన్న సినిమాగా వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న చిత్రం పేకమేడలు. జులై 19న విడుదలైన ఈ కామెడీ డ్రామా మూవీ పాజిటివ్ రివ్యూస్, రేటింగ్ తో హిట్ గా నిలిచింది. దీంతో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.

చిన్న సినిమాగా వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న చిత్రం పేకమేడలు. జులై 19న విడుదలైన ఈ కామెడీ డ్రామా మూవీ పాజిటివ్ రివ్యూస్, రేటింగ్ తో హిట్ గా నిలిచింది. దీంతో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.

పేకమేడలు మూవీకి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు: నిర్మాత రాకేష్ వర్రే

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో చిన్న చిత్రాలు సత్తా చాటుతున్నాయి. కథను నమ్మి సినిమాలు చేస్తున్నారు యంగ్ అండ్ న్యూ డైరెక్టర్స్. కొత్త వాళ్లతో మూవీ తెరకెక్కించేందుకు డేరింగ్ స్టెప్ వేస్తున్నారు. ఇలాంటి సినిమాలు ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి హవా కొనసాగిస్తున్నాయి. తాజాగా విడుదలైన పేకమేడలు ఈ కోవ కిందకే వస్తుంది. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలైంది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ సంస్థ బ్యానర్ పై నటుడు రాకేష్ వర్రే నిర్మించాడు. ఈ సినిమాని తెలుగులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మెగిలినేని రిలీజ్ చేశారు. తమిళ నటుడు వినోద్ కిషన్, కన్నడ హీరోయిన్ అనూష కృష్ణన్ హీరో హీరోయిన్లుగా నటించగా.. నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించాడు.

సినిమా ప్రమోషన్లు కూడా డిఫరెంట్‌గా చేయడంతో పాటు ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి బజ్ నడిచింది. మహిళా సాధికారత (ఉమన్ ఎంపవర్మంట్)ని బేస్ చేసుకుని వచ్చిందీ మూవీ. ఇదిలా ఉంటే.. ఈ మూవీకి పాజిటివ్ రివ్యూస్, రేటింగ్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా రూ. 100కే రేట్లు ఉండటంతో పాటు మౌత్ పబ్లిసిటీ బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. దర్శకుడు నీలగిరి మాట్లాడుతూ.. ‘సినిమా రిలీజైన దగ్గర నుండి 50కి పైగా కాల్స్ వచ్చాయి, సినిమా చాలా బాగుందంటూ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మహిళలను నుండి భారీ స్పందన వస్తుంది. సినిమా స్టార్టైన దగ్గర నుండి సపోర్ట్ చేసిన నిర్మాత రాకేష్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే ఈ మూవీకి మద్దుతు తెలిపిన మీడియాకు థాంక్యూ’ చెప్పాడు నీలగిరి.

బాహుబలి, ఎవరికీ చెప్పొద్దు చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న హీరో రాకేష్ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. రాకేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డామని, ఈ సక్సెస్ చేస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఉందన్నాడు. ‘ఈ సినిమా సక్సెస్ నాలో కాన్ఫిడెన్స్ పెంచింది. ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీయొచ్చని ధైర్యం నింపింది. చిన్న సినిమాలకు జనాలు రారు అనేది తప్పు.. మంచి కంటెంట్ ఉంటే.. జనాలు థియేటర్లకు వస్తారు. మంచి సినిమా వస్తే ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. పేక మేడలు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్ బన్నీని కలవబోతున్నాము. నా ఈ జర్నీలో నాకు ఎంతో సపోర్టుగా నిలిచిన హీరోయిన్ అనూష, కేతన్, అలాగే మార్కెటింగ్ టీంకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని తెలిపాడు నిర్మాత రాకేష్.