iDreamPost
android-app
ios-app

పెదకాపుకు కూడా ప్రభాసే కావాలంట! మరి ఏం జరుగుతుందో?

  • Author ajaykrishna Published - 11:25 AM, Thu - 28 September 23
  • Author ajaykrishna Published - 11:25 AM, Thu - 28 September 23
పెదకాపుకు కూడా ప్రభాసే కావాలంట! మరి ఏం జరుగుతుందో?

ఇండస్ట్రీలో పబ్లిక్ గా మాట్లాడకుండా మొహమాటపడే హీరోలు ఉన్నారు. అలాంటి వారిలో ఫస్ట్ వినిపించే పేరు డార్లింగ్ ప్రభాస్. సినిమాల్లోకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతున్నా ఇంకా మొహమాటం వదల్లేదు. పాన్ ఇండియా స్టార్డమ్.. వరల్డ్ వైడ్ క్రేజ్ ఏర్పడినా ఆ బిడియం మాత్రం పోలేదు. సినిమాలలో క్యారెక్టర్ పరంగా ఎంత మాట్లాడినా.. బయట పర్సనల్ లైఫ్ లో ఇంట్రోవర్ట్ లు చాలామంది ఉంటారు. అయితే.. ప్రస్తుతం డార్లింగ్ పేరు కొత్తగా రిలీజ్ కి సిద్ధమైన పెదకాపు సినిమా విషయంలోను గట్టిగా వినిపిస్తుంది. అందుకు కారణం లేకపోలేదు.. పెదకాపు మూవీతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అవుతున్నాడు విరాట్ కర్ణ. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమాని సెప్టెంబర్ 29న రిలీజ్ అవుతోంది.

అఖండ ఫేమ్ మిర్యాల రవీందర్ రెడ్డి.. ఈ పెదకాపు సినిమాని నిర్మించారు. కాగా.. ఇప్పటికే పాటలు, ట్రైలర్ లతో ప్రేక్షకులలో మినిమమ్ అంచనాలు పెంచేసిన ఈ సినిమా.. ప్రమోషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ లతో పెదకాపుని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో విరాట్.. డార్లింగ్ ప్రభాస్ గురించి మాట్లాడిన మాటలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి. ముందుగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి మాట్లాడుతూ.. మొదట నా ఫస్ట్ మూవీకి శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్ అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. నేను కొంచం ఇంట్రోవర్ట్ ని. అంత త్వరగా కలవలేను. ఏది బయటికి చెప్పలేను. స్టార్టింగ్ లో ఇబ్బంది పడినా.. ఆ తర్వాత క్లోజ్ అయ్యాక ఫ్రెండ్లీగా దగ్గరయ్యానని అన్నాడు.

అనంతరం ప్రభాస్ గురించి మాట్లాడిన విరాట్.. “ప్రభాస్ గారికి నేను డై హార్డ్ ఫ్యాన్. చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ప్రభాస్ గురించి చాలాసార్లు నా అభిమానాన్ని బయట పెట్టేసాను. సత్యానంద్ గారు, ప్రభాస్ మాట్లాడుకుంటే దూరం నుండే చూసేవాడ్ని. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సత్యానంద్ గారు ప్రభాస్ తో మాట్లాడినట్లు ముందు తెలియదు. బట్.. ఆ విషయాన్నీ డైరెక్ట్ స్టేజ్ పై చెప్పేసరికి హ్యాపీగా అనిపించింది. ఆయన ప్రభాస్ తో పోల్చడం అభిమానిగా ఫుల్ ఖుషి. మరి మా సినిమా రిలీజ్ తర్వాత ప్రభాస్ నుండి ఏదైనా స్పందన వస్తే మాత్రం.. ఆ ఫీలింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది.” అని చెప్పుకొచ్చాడు. డార్లింగ్ ప్రభాస్ ఎవరి సినిమా రిలీజ్ అయినా విష్ చేయడంలో ముందుంటాడు. పెదకాపు టీమ్ కూడా ప్రభాస్ స్పందన కోసం వెయిట్ చేస్తుంది. కాబట్టి రియాక్ట్ అవుతాడేమో చూడాలి!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom