Venkateswarlu
కొత్త హీరో విరాట్ కర్ణ ఆయన సరసన ప్రగతి శ్రీవాస్తవ నటించారు. ముఖ్య పాత్రల్లో రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగిడ సాగా, రాజీవ్‌కనకాల...
కొత్త హీరో విరాట్ కర్ణ ఆయన సరసన ప్రగతి శ్రీవాస్తవ నటించారు. ముఖ్య పాత్రల్లో రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగిడ సాగా, రాజీవ్‌కనకాల...
Venkateswarlu
కరోనా కారణంగా ఓటీటీ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఓటీటీ ప్లాట్ వాడకం పెరిగిపోయిన తర్వాత థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడ్డం బాగా తగ్గిపోయింది. సినిమా ప్రేక్షకులు ఇంట్లో కూర్చొనే కొత్త కొత్త సినిమాలు చూసేస్తున్నారు. సినిమా థియేటర్లలోకి వచ్చిన కొన్ని రోజులకే.. ఓటీటీలోకి వస్తుండటం విశేషం. ఇక, అసలు విషయానికి వస్తే.. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్‌లో తెరకెక్కిన ‘పెదకాపు’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా సెప్టెబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లను రాబట్టింది. కొత్త హీరో విరాట్ కర్ణ ఆయన సరసన ప్రగతి శ్రీవాస్తవ నటించారు. ముఖ్య పాత్రల్లో రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగిడ సాగా, రాజీవ్‌కనకాల, అనసూయ తదితరులు నటించారు. ఇక, ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన నెలలోపే ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో శుక్రవారంనుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఇంతకీ సినిమా కథేంటంటే.. ఇది 1980ల నాటి కథ. అధికారానికి అలవాటు పడ్డ ఓ ఇద్దరు వ్యక్తులు సాధారణ జనాల జీవితంతో ఆడుకుంటూ ఉంటారు. ఓ సారి పెద్ద గొడవలు జరుగుతాయి. ఆ గొడవల కారణంగా పెదకాపు కుటుంబం బాగా ఇబ్బందుల్లో పడుతుంది. పెదకాపు అన్న కనిపించకుండా పోతాడు. దీంతో పెదకాపు రంగంలోకి దిగుతాడు. తర్వాత ఏం జరిగిందన్నదే సినిమా కథ. మరి, ‘పెదకాపు’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.