iDreamPost
android-app
ios-app

21 ఏళ్లకే మొదలుపెట్టా.. ఆ నాటి విషయాలను తలుచుకున్న పాయల్ రాజ్‌పుత్

  • Published Feb 04, 2024 | 2:46 PM Updated Updated Feb 04, 2024 | 2:46 PM

తొలి సినిమాతో రిస్క్ చేయాలని ఏ హీరోయిన్ అనుకోదు. కానీ ఈ బ్యూటీ చేసి ప్రశంసలతో పాటు చీవాట్లు తిన్నది. ప్రియుడ్ని మోసం చేసే ప్రియురాలి పాత్రలో మెప్పించింది పాయల్ రాజ్ పుత్. అయితే.. ఆమె ఇన్ స్టా వేదికగా చేసిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది.

తొలి సినిమాతో రిస్క్ చేయాలని ఏ హీరోయిన్ అనుకోదు. కానీ ఈ బ్యూటీ చేసి ప్రశంసలతో పాటు చీవాట్లు తిన్నది. ప్రియుడ్ని మోసం చేసే ప్రియురాలి పాత్రలో మెప్పించింది పాయల్ రాజ్ పుత్. అయితే.. ఆమె ఇన్ స్టా వేదికగా చేసిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది.

  • Published Feb 04, 2024 | 2:46 PMUpdated Feb 04, 2024 | 2:46 PM
21 ఏళ్లకే మొదలుపెట్టా.. ఆ నాటి విషయాలను తలుచుకున్న పాయల్ రాజ్‌పుత్

ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. టెలివిజన్ నుండి పంజాబీ, హిందీ భాషల్లో నటించి.. ఆ తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే ఆమె నటనకు దక్కిన ప్రశంసల కన్నా వ్యక్తిగత విమర్శలే ఎక్కువ. ఇప్పుడు బేబి మూవీకి వైష్ణవి చైతన్యను ఎట్లా అయితే ఆడేసుకున్నారో.. సేమ్ టూ సేమ్ పాయల్ విషయంలో జరిగింది. అయినప్పటికీ తట్టుకుని కెరీర్ పై దృష్టి సారిస్తూ..సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజాలతో ఆమెపై ఉన్న నెగిటివ్ ముద్ర చెరిగిపోయింది. ఇటు తమిళ్, పంజాబీ సినిమాలు చేస్తూ.. అనుకోని అతిధి, త్రీ రోజెస్ వంటి ఓటీటీ మూవీల్లో సందడి చేసింది ఈ బ్యూటీ.

అయినప్పటికీ ఆర్ఎక్స్ 100 మూవీకి వచ్చినంత పాపులారిటీ రాలేదు. దీంతో ఆ మూవీ డైరెక్టర్ అజయ్ భూపతితో మరోసారి జతకట్టింది అమ్మడు. మంగళవారం మూవీ మళ్లీ పాయల్ రాజ్‌పుత్‪ను హిట్ ట్రాక్ ఎక్కించింది.. ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలను చేస్తుంది. హిట్స్, ప్లాపులతో సంబంధం లేకుండా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. అయితే తన తొలి రోజులను గుర్తు చేసుకుంది పాయల్. తన మొదటి ఫోటో షూట్ అనుభవాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది అమ్మడు. ‘21 ఏళ్లకు ఈ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాను. గ్రేహ శోభా అనే ఓ మ్యాగజైన్ కోసం తొలి ఫోటో షూట్ చేయించుకున్నా. ఢిల్లీలో ఫోటో షూట్. ఆ తర్వాత ముంబయికి షిఫ్ట్ అయ్యా. ఆ తర్వాత టీవీ రంగంలో కెరీర్ ప్రారంభించా’ అని ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

payal rajput

అందులో మోడ్రన్ లుక్స్‌లో కట్టిపడేస్తుంది పాయల్. నాజూగ్గా కనిపిస్తోంది లేడీ. అలనాటి సంగతులను నెమరు వేసుకుంది. పలు పిక్స్ షేర్ చేసుకుంది. అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మోడల్ నుండి టీవీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ఢిల్లీ భామ. పలు సీరియల్స్‌లో లీడ్ రోల్స్‌లో నటించింది. 2017లో చన్నా మేరియా అనే పంజాబీ మూవీతో వెండితెరపై వెలిసిన ఈ అందం..బాలీవుడ్ ఇంట అడుగుపెట్టింది. వీర్ కీ వెడ్డింగ్  సినిమాతో ఆమె క్లిక్ అయ్యింది. ఆ తర్వాత తెలుగు నాట అడుగుపెట్టడం.. ఇక్కడ ప్రభంజనం సృష్టించడం చక చకా జరిగిపోయాయి. ఓటీటీ వేదికగా కూడా మూవీస్ చేసింది పాయల్. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom