iDreamPost
android-app
ios-app

పాయల్ రాజ్ పుత్ తల్లికి సర్జరీ.. ప్రార్థించండంటూ వేడుకున్న నటి!

  • Published Feb 23, 2024 | 6:39 PM Updated Updated Feb 23, 2024 | 6:39 PM

తన తల్లి గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది పాయల్ రాజ్ పుత్. అభిమానులందరూ తన తల్లి కోసం ప్రార్థించాలంటూ వేడుకుంది. అసలేం జరిగిందంటే?

తన తల్లి గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది పాయల్ రాజ్ పుత్. అభిమానులందరూ తన తల్లి కోసం ప్రార్థించాలంటూ వేడుకుంది. అసలేం జరిగిందంటే?

  • Published Feb 23, 2024 | 6:39 PMUpdated Feb 23, 2024 | 6:39 PM
పాయల్ రాజ్ పుత్ తల్లికి సర్జరీ.. ప్రార్థించండంటూ వేడుకున్న నటి!

పాయల్ రాజ్ పుత్.. RX 100 మూవీతో టాలీవుడ్ మెుత్తాన్ని తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటీ. ఈ చిత్రం ఊహించని విజయం సొంతం చేసుకోవడం, అందులోనా పాయల్ నటనకు ప్రేక్షకులు ఫిదా కావడంతో.. టాలీవుడ్ లో ఒక్కసారిగా పాయల్ పేరు మారుమ్రోగింది. ఇక ఇటీవలే మంగళవారం మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది హాట్ బ్యూటీ. ఇదిలా ఉండగా.. తాజాగా తన తల్లి గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన తల్లి కోసం ప్రార్థించండి అంటూ అభిమానులను వేడుకుంది. ఇంతకీ అసలేం జరిగిందంటే?

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఆమె తన తల్లికి సర్జరీ చేయించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.”మా అమ్మ మోకాలికి సర్జరీ జరిగింది. ఈ ఆపరేషన్ చాలా నొప్పిగా ఉన్నప్పటికీ.. సక్సెస్ ఫుల్ అయ్యింది. ప్రస్తుతం అమ్మ నడుస్తోంది. అభిమానులందరూ కూడా మమ్మీ గురించి ప్రార్థించండి” అంటూ ఇన్ స్టా స్టోరీలో షార్ట్ వీడియోను షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ వైరల్ కావడంతో.. అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా.. మంగళవారం తర్వాత ఆమె ఏ చిత్రాలకు సైన్ చేసినట్లు కనిపించడం లేదు. మంచి కథలు దొరికే వరకూ చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే పాయల్ కు సరైన అవకాశాలు రావటం లేదన్నది కొందరి వాదన. అందం, అభినయం ఉన్నప్పటికీ.. ఆమెకు ఛాన్స్ ఇవ్వడం లేదు డైరెక్టర్స్. అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లో మెరుస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో మాత్రం బిజీగా మారడం లేదు. కెరీర్ ఆరంభంలో బాలీవుడ్ లో సీరియల్స్ చేసుకుంటూ ఉండేది. పంజాబ్ మూవీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసినా.. ఆమెకు క్రేజ్ వచ్చింది మాత్రం ఆర్ఎక్స్ 100తోనే. డైరెక్టర్ అజయ్ భూపతి పాయల్ కు స్టార్ డమ్ ను ఇచ్చాడు. ఇటీవలే మంగళవారం మూవీతో మరోసారి బ్రేక్ ఇచ్చాడు ఈ దర్శకుడు.

Payal s emotional post

ఇదికూడా చదవండి: పోలీస్ vs పోలీస్.. OTTలో ఒక్కో సీన్‌కి గూస్ బంప్స్ రావాల్సిందే!

Jojobet Girişİmajbetultrabetjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibomgrandpashabet