iDreamPost
android-app
ios-app

ప్రేమించిన వాడు కాదన్నాడని పాయల్‌ రాజ్‌పుత్‌ నెలల పాటు..

  • Published Nov 08, 2023 | 4:26 PM Updated Updated Nov 08, 2023 | 4:26 PM

తాజాగా, పాయల్‌ రాజ్‌పుత్‌ తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పారు. తన ప్రియుడు కాదన్న కారణంగా ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వచ్చిందో వివరించారు.

తాజాగా, పాయల్‌ రాజ్‌పుత్‌ తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పారు. తన ప్రియుడు కాదన్న కారణంగా ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వచ్చిందో వివరించారు.

  • Published Nov 08, 2023 | 4:26 PMUpdated Nov 08, 2023 | 4:26 PM
ప్రేమించిన వాడు కాదన్నాడని పాయల్‌ రాజ్‌పుత్‌ నెలల పాటు..

ఈ మధ్య కాలంలో ప్రేమ వ్యవహారాలు చాయ్‌ బిస్కట్‌ వ్యవహారాలు అయిపోయాయి. టీ చల్లారే టైంలో ప్రేమించుకుని, బ్రేకప్‌ చెప్పుకునే జంటలు కూడా కనిపిస్తున్నారు. ఏ రంగానికి చెందిన వారైనా ప్రేమ వ్యవహారాలు కామన్‌ అయిపోయాయి. అయితే, సినిమా రంగానికి చెందిన వారిపై ఎక్కువ ఫోకస్‌ ఉంటుంది కాబట్టి వీరి ప్రేమలే ఎక్కువగా బయటకు వస్తూ ఉంటాయి. దీనికి తోడు సినిమా ఇండస్ట్రీలో స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఎక్కువ కాబట్టి సమాజం గురించి పెద్దగా పట్టించుకోరు. తమకు ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటారు.

తమ పర్సనల్‌ విషయాల గురించి బయట చెప్పడానికి కూడా పెద్దగా ఇబ్బంది పడరు. అది హీరోయిన్లు అయినా సరే ఎలాంటి జంకు గొంకు లేకుండా చెప్పేస్తుంటారు. తాజాగా, ప్రముఖ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ తన ప్రేమ వ్యవహారం గురించి మీడియా ముందు చెప్పుకొచ్చారు. ప్రియుడు కాదన్న కారణంగా నెలల పాటు ఎలా బాధపడ్డారో వివరించారు. ఆమె మాట్లాడుతూ… స్కూల్‌ డేస్‌లో ఓ అబ్బాయిని పిచ్చిగా ప్రేమించానని చెప్పారు. అతడ్ని చూడగానే పాయల్‌లో ఏదో తెలియని ఆనందం కలిగేదని తెలిపారు.

దాన్నే ఆమె ప్రేమగా భావించినట్లు వెల్లడించారు. పదవ తరగతి ముగిసే సమయంలో ఆమె తన ప్రేమను ఆ అబ్బాయికి చెప్పానన్నారు. అయితే, ఆ అబ్బాయి పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రేమను కాదన్నాడని తెలిపారు. తనకు ప్రేమపై ఆసక్తి లేదని తేల్చి చెప్పాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణంతో తాను నెలల తరబడి ఏడ్చినట్లు ఆమె చెప్పారు. చదువుపై కూడా సరిగా శ్రద్ధ చూపలేకపోయినట్లు పేర్కొన్నారు. ఆ ఏడాది పరీక్షల్లో ఫెయిల్‌ కూడా అయ్యానన్నారు. తన ప్రేమ విఫలం విషయాన్ని తల్లికి చెప్పుకుని ఏడ్చానన్నారు. తల్లి తనకు మద్దతుగా నిలిచిందని, మళ్లీ మామూలు మనిషి అవ్వటానికి సాయం చేసిందని తెలిపారు.

కాగా, పాయల్‌ రాజ్‌పుత్‌ 2018లో వచ్చిన ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ సినిమా సంచలన విజయం సాధించటంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. తమిళం, కన్నడ భాషల్లో కూడా ఆమె నటించారు. ఆమె నటించిన తాజా చిత్రాలు ఏంజిల్‌, కిరాతక అనే సినిమాలు ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఆర్‌ఎక్స్‌ 100 దర్శకుడు అజయ్‌ భూపతి తెరకెక్కించిన ‘మంగళవారం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నవంబర్‌17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. సగటు సినీ ప్రేక్షకుడు సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. మరి, పాయల్‌ రాజ్‌పుత్‌ చైల్డ్‌హుడ్‌ లవ్‌ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet