sai
Pawan Kalyan OG Movie Release Date: పవన్ కల్యాణ్- సుజీత్ కాంబోలో వస్తున్న ఓజీ మూవీ అధికారిక రిలీజ్ డేట్ వచ్చేసింది.
Pawan Kalyan OG Movie Release Date: పవన్ కల్యాణ్- సుజీత్ కాంబోలో వస్తున్న ఓజీ మూవీ అధికారిక రిలీజ్ డేట్ వచ్చేసింది.
sai
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్ డేట్ రానే వచ్చింది. పవన్ కల్యాణ్- సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న దే కాల్ హిమ్ ఓజీ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ రానే వచ్చింది. ఈ మూవీ రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ లో కొన్ని అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం కూడా లేదు అంటూ చాలానే వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లు మాత్రమే అని క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఓజీ సినిమా టీమ్ అఫీషియల్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది. పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూసిన ఆ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది.
పవన్ కల్యాణ్ ఫ్యాన్ బాయ్ సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఓజీపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ కూడా ఫ్యానే కాబట్టి కచ్చితంగా సినిమా అదిరిపోతుంది అంటూ ముందు నుంచి అనుకుంటున్నారు. అయితే షూటింగ్ విషయంలో ఆలస్యం జరుగుతోందని.. ఈ ఏడాది రిలీజ్ అవ్వడం కష్టం అంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే అవన్నీ పుకార్లేనంటూ సినిమా టీమ్ అధికారిక రీలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా ఓజీ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అంటూ ప్రకటించారు. పవన్ కల్యాణ్ కారు ముందు నిల్చుని ఉన్న ఒక పోస్టర్ తో అఫీషియల్ డేట్ ని అనౌన్స్ చేశారు. మరి.. ఓజీ రిలీజ్ డేట్ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The #OG will arrive on 27th September 2024. #TheyCallHimOG #OGonSept27th pic.twitter.com/4PZTUZe2db
— DVV Entertainment (@DVVMovies) February 6, 2024