iDreamPost
android-app
ios-app

క్రేజీ కాంబినేషన్.. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్!

  • Author Soma Sekhar Published - 07:33 PM, Fri - 1 September 23
  • Author Soma Sekhar Published - 07:33 PM, Fri - 1 September 23
క్రేజీ కాంబినేషన్.. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్!

ఇండస్ట్రీలో కాంబినేషన్ లకు ఉన్న క్రేజే వేరు. ఫలానా డైరెక్టర్ తో మా హీరో ఒక్క మూవీ చేస్తే.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అని ప్రతీ ఒక్క హీరో అభిమానులు అనుకోవడం సాధారణంమే. ఇక పరిశ్రమలో కొన్ని అనుకోని కాంబినేషన్లు సెట్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి క్రేజీ కాంబినేషనే రాబోతోంది. టాలీవుడ్ లో స్టైలిష్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న సురేందర్ రెడ్డి లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మూవీ తీస్తున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన అప్డేట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకి శ్రీకారం చుట్టిన యూనిట్ కొత్త ఆఫీస్ ను ఓపెన్ చేసి, పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. పవన్ నుంచి ఇక సినిమాలు రావడం కష్టం అని అభిమాలు అనుకుంటున్న వేళ.. మరో సినిమా అప్డేట్ ఇచ్చాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను సెట్స్ పైకి తీసుకొచ్చి.. శరవేగంగా షూటింగ్ చేస్తున్నాడు పవన్. ఈ మూవీలు సెట్స్ పై ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు పవర్ స్టార్. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. కథను స్టార్ రైటర్ వక్కంతం వంశీ అందించినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ మూవీని ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా.. తాజాగా ఈ మూవీకి శ్రీకారం చుట్టారు చిత్ర యూనిట్. ఆఫీస్ లో పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే ‘ఏజెంట్’ సినిమాతో నిరాశలో ఉన్న సురేందర్ రెడ్డి.. పవర్ స్టార్ సినిమాతో తన ఆకలిని తీర్చుకోవాలని చూస్తున్నాడు. సినిమాలను స్టైలిష్ గా తెరకెక్కించడంలో.. సిద్దహస్తుడు సురేందర్ రెడ్డి. కానీ ఎక్కడో తేడా కొట్టడం వల్ల గత కొంతకాలంగా సరైన సినిమా అతడి నుంచి రాలేదనే చెప్పాలి. మరి ఈ క్రేజీ కాంబినేషన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap