iDreamPost
android-app
ios-app

Pavala Syamala Emotional: వీడియో: నా బతుకు ఇలా అవుతుందనుకోలేదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న పావలా శ్యామల మాటలు!

  • Published Mar 12, 2024 | 10:19 AM Updated Updated Mar 12, 2024 | 10:49 AM

తాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొన్న సీనియర్ నటి పావలా శ్యామల.. తన పరిస్థితి గురించి చెప్పడంతో అక్కడ ఉన్న వారందరూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

తాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొన్న సీనియర్ నటి పావలా శ్యామల.. తన పరిస్థితి గురించి చెప్పడంతో అక్కడ ఉన్న వారందరూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Mar 12, 2024 | 10:19 AMUpdated Mar 12, 2024 | 10:49 AM
Pavala Syamala Emotional: వీడియో: నా బతుకు ఇలా అవుతుందనుకోలేదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న పావలా శ్యామల మాటలు!

సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. కానీ ఈ ప్రపంచంలో పైకి కనిపించేది అంతా నిజం కాదు. ఎంతో మంది అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. వారి జీవితాల్లో కష్టాలు తప్పవు. ఆర్థికంగా చితికిపోతూ, బతుకీడుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటూనే దీనస్థితిలో జీవిస్తోంది సీనియర్ నటి పావలా శ్యామల. చిరంజీవి దగ్గర నుంచి మెుదలుపెట్టుకుంటే.. నాని, గోపీచంద్ లతో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆర్థికంగా మాత్రం చితికిపోయింది. దీంతో అనాథాశ్రమంలో కాలం వెళ్లదీస్తోంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె తన మాటలతో అందరికీ కన్నీళ్లు తెప్పించింది.

పావలా శ్యామల.. స్టేజీపై నాటకాలు వేసే స్థాయి నుంచి వెండితెరపైకి దూసుకొచ్చిన నటి. అద్భుతమైన నటనతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అయితే గత కొన్నాళ్ల నుంచి ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ.. జీవితాన్ని అనాథాశ్రమంలో గడుపుతోంది. శ్యామల దీనస్థితి గురించి తెలుసుకున్న నటుడు కాదంబరి కిరణ్ మనం ఫౌండేషన్ ద్వారా రూ. 25 వేలు సాయం కూడా చేశారు. ప్రస్తుతం వీల్ ఛైర్ కే పరిమితం అయిన ఆమె.. తాజాగా ఓ రియాలిటీ షోకు వచ్చారు. అక్కడి స్టేజ్ పై మాట్లాడిన మాటలకు ప్రతీ ఒక్కరు కన్నీరు పెట్టుకున్నారు.

పావలా శ్యామల మాట్లాడుతూ..”ఇండస్ట్రీలో దాదాపు అందరి హీరోలతో కలిసి నటించాను. నాటక రంగంలో రెండు వేల సార్లు ఉత్తమ నటిగా అవార్డులను అందుకున్నాను. 50 సార్లు నాకు సన్మానం చేశారు. నాటకాలు తగ్గిపోవడంతో ఆస్తులు అమ్ముకుని ఇక్కడి వచ్చాను. కానీ చివరికి నా బ్రతుకు ఇలా అవుతుందనుకోలేదు. నా కష్టాలు చెప్పుకుని మిమ్మల్ని బాధపెట్టాలని ఇక్కడికి రాలేదు. నేను బ్రతికుండి మళ్లీ మిమ్మల్ని చూస్తానో, లేదో? అనే భయంతో మీ అందరికి ఒకసారి కనిపించి వెళ్దామని వచ్చాను” అంటూ భావోద్వేగానికి లోనైయ్యారు శ్యామల. ఆమె మాట్లాడుతున్నంతసేపు అందరూ కన్నీరు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by ᴮⁱᵍᵍᵇᵒˢˢ_ʰᵉᵃʳᵗ (@biggboss_heart)

ఇదికూడా చదవండి: కమల్, రజినీ కాదు.. ఫస్ట్ రూ. కోటి రెమ్యునరేషన్ అందుకున్న హీరో! మీరు ఊహించలేరు..

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss