టీ కొట్టు పెట్టుకుంటా.. కానీ లైఫ్​లో ఆ పని మాత్రం చేయను: స్టార్ హీరోయిన్

Tollywood: క్రేజ్ ఉంది కదా అని ఏది పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకునే నటులు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో ఈ భామ ఒకరు. విలక్షణమైన నటనతో స్టార్ హీరోయిన్​ రేంజ్​కు చేరుకున్న ఆమె కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Tollywood: క్రేజ్ ఉంది కదా అని ఏది పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకునే నటులు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో ఈ భామ ఒకరు. విలక్షణమైన నటనతో స్టార్ హీరోయిన్​ రేంజ్​కు చేరుకున్న ఆమె కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

క్రేజ్ ఉంది కదా అని ఏది పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకునే నటులు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో మలయాళ ముద్దుగుమ్మ పార్వతి తిరువోతు ఒకరు. విలక్షణమైన నటనతో స్టార్ హీరోయిన్​ రేంజ్​కు చేరుకున్నారామె. మలయాళంలో కెరీర్​ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. తమిళం, తెలుగులోనూ యాక్ట్ చేశారు. స్పెషల్ మెన్షన్ నేషనల్ అవార్డుతో పాటు రెండుసార్లు కేరళ ఫిల్మ్ స్టేట్ అవార్డులు అందుకున్నారు. దీన్ని బట్టే ఆమె యాక్టింగ్ టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడమే కాన్సెప్ట్​కు ఆమె చాలా దూరంగా ఉంటారు. జేబు కంటే జాబ్ శాటిస్​ఫాక్షన్ ముఖ్యమని నమ్ముతారు. అందుకే బ్యూటిఫుల్ మెమరీస్​గా నిలిచిపోయే ఫిల్మ్స్​తో నటించగలిగారు.

మూవీ ఆఫర్స్ విషయంలో చాలా పర్టిక్యులర్​గా ఉంటారు పార్వతి. గతేడాది ఆమె టాలీవుడ్​లో మెరిశారు. అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్ ’దూత’లో కీలక పాత్రలో నటించారామె. ఈ సిరీస్​తో తెలుగువారికి దగ్గరైన ఆమె.. త్వరలో ‘తంగలాన్’తో మరోమారు పలకరించనున్నారు. కోలీవుడ్ స్టార్ విక్రమ్ సరసన ‘తంగలాన్​’లో ముఖ్య పాత్రలో నటించారు. పంద్రాగస్టుకు విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను ఆమె అందరితో పంచుకున్నారు. ‘తంగలాన్’లో యాక్టింగ్​కు స్కోప్ ఉన్న రోల్​లో నటించానని తెలిపారు పార్వతి. అయితే తన తొలి తమిళ చిత్రం ‘పూ’లో యాక్ట్ చేసినప్పుడు కాస్త ఇబ్బంది పడ్డానన్నారు. తమిళం తెలియకపోవడంతో డైలాగ్స్​ను ఇతరులతో చదివించుకొని వినేదాన్నని చెప్పారు. ఒకవేళ ఆఫర్లు తగ్గితే టీ కొట్టు పెట్టుకుంటానని.. కానీ మర్యాద లేని చోట ఉండలేనని పేర్కొన్నారు పార్వతి.

సినిమాల్లోకి రాకపోతే టీ షాప్ పెట్టుకునేదాన్నని పార్వతి తిరువోతు అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి ఆ బిజినెస్​ మీద తనకు ఇంట్రెస్ట్ ఉందన్నారు. టీ కొట్టు పెట్టుకోవాలనే ఆశ తనకు ఉండేదన్నారు. ఏ ప్రొఫెషన్​లో ఉన్నా అందులో గౌరవమర్యాదలు ముఖ్యమని.. అది లేని నాడు సినిమాల్లో నుంచి తప్పుకుంటానని ఆమె స్పష్టం చేశారు. అలాంటి రోజు గనుక వస్తే తనకు ఇష్టమైన టీ కొట్టు పెట్టుకుంటానని.. కానీ మర్యాద లేని చోటు ఉండలేనని వ్యాఖ్యానించారు. కోలీవుడ్​లో ఎక్కువ చిత్రాల్లో నటించడం లేదనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. మంచి స్క్రిప్ట్​కు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నానని వివరించారు. మరి.. పార్వతి నటిస్తున్న ‘తంగలాన్’ మూవీ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments