iDreamPost
android-app
ios-app

సినిమాకి కథ అవసరం లేదు.. తమన్నా అలా కనిపిస్తే చాలు: స్టార్ డైరెక్టర్!

  • Published Jul 19, 2024 | 1:28 PM Updated Updated Jul 19, 2024 | 1:28 PM

ప్రముఖ దర్శకుడు శంకర్, లోక నాయకుడు కమల హాసన్ నుండి వచ్చిన చిత్రం భారతీయుడు 2 . జులై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. కాగా, ఇదే మూవీకి పోటీగా వచ్చింది టీన్జ్. ఈ మూవీకి పార్తీబన్ దర్శకుడు. సినిమా సక్సెస్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

ప్రముఖ దర్శకుడు శంకర్, లోక నాయకుడు కమల హాసన్ నుండి వచ్చిన చిత్రం భారతీయుడు 2 . జులై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. కాగా, ఇదే మూవీకి పోటీగా వచ్చింది టీన్జ్. ఈ మూవీకి పార్తీబన్ దర్శకుడు. సినిమా సక్సెస్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

  • Published Jul 19, 2024 | 1:28 PMUpdated Jul 19, 2024 | 1:28 PM
సినిమాకి కథ అవసరం లేదు.. తమన్నా అలా కనిపిస్తే చాలు: స్టార్ డైరెక్టర్!

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ బడ్జెట చిత్రం భారతీయుడు 2. 1996లో రిలీజైన బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడుకు సీక్వెల్ ఇది. జులై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. లోకనాయకుడు కమల్ హాసన్, ప్రియ భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, బ్రహ్మానందం వంటి స్టార్స్ నటించారు. లైకా ప్రొడక్సన్స్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ నిర్మించారు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో మేకర్స్ 12 నిమిషాల సినిమా కట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కాగా, భారతీయుడు 2 రిలీజైన రోజే టీన్జ్ అనే మూవీ విడుదలైంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిన్న చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తమిళ ప్రేక్షకులను కూడా ఇండియన్ 2 ఆకట్టుకోకపోవడంతో  టీన్జ్ వైపు మొగ్గు చూపారు.

ఇదిలా ఉంటే.. ఈ మూవీని యాక్టర్ కమ్ డైరెక్టర్ పార్టీబన్ తెరకెక్కించాడు. ఈ సినిమా పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అయితే తాజాగా ఆయన ఇంటర్వ్యూలో పాల్గొని కాంట్రవర్సియల్ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను సైంటిఫిక్‌గా సినిమా తీశామన్న ఆయన.. ఈ రోజుల్లో తమిళం సరిగా రాయకపోయినా పర్వాలేదు కానీ.. సినిమా హిట్ కావాలంటే తమన్నా డ్యాన్స్ సరిపోతుందని, కథ అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేసినట్లు తమిళ మీడియా పేర్కొంటోంది. తమన్నా డ్యాన్స్ చేస్తే చాలు సినిమా హిట్ అవుతుందన్నట్లుగా మాట్లాడాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం పార్తీబన్ ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల తమన్నా.. రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి విదితమే.

జైలర్ మూవీలో ‘నువ్వు కావాలయ్యా’, బాక్ ‘అయ్యో అయ్యో’ సాంగ్స్ చేసింది. ఈ రెండు కూడా పెప్ సాంగ్స్ కావడంతో.. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి విదితమే. అయితే ఈ పేర్లను ప్రస్తావించకుండా పార్తీబన్ కేవలం తమన్నా డ్యాన్సులు ఉంటే చాలు.. సినిమా హిట్ అన్నట్లుగా చెప్పాడు. ఇదిలా ఉంటే.. టీన్జ్ ఇప్పటి వరకు రూ. 90 లక్షల వరకు కలెక్ట్ చేసింది.  ఈ మూవీ విడుదలయ్యాక వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు పార్తీబన్. భారతీయుడు2 కన్నా ఈ మూవీకి పాజిటివ్ రివ్యూస్ రాగా, సోషల్ మీడియాలో కమల్ హాసన్, మూవీపై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. దీన్ని తన సోషల్ మీడియా ఖాతాలో రీపోస్టు జరిగింది. దీంతో నెటిజన్లు పార్తీబన్ పై ఫైర్ అయ్యారు. దీంతో క్లారిటీ ఇచ్చుకున్నాడు దర్శకుడు కమ్ నటుడు. తాను సినిమా ప్రమోషన్లలో ఉన్నానని, తన అసిస్టెంట్ ఈ పోస్టు చేశాడంటూ చెప్పుకొచ్చాడు. తీన్జ్ సినిమాను కొనియాడుతున్న వారందరికీ థాంక్యూ చెప్పమని తెలిపానని, కానీ అతడు ఇండియన్ 2, టీన్జ్ పోలుస్తూ పోస్టుపై స్పందించాడని తెలిపాడు పార్తీబన్.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio