iDreamPost
android-app
ios-app

వీడియో: కాసేపట్లో వివాహం.. వరుడి ముందే వధువు కిడ్నాప్!

వీడియో: కాసేపట్లో వివాహం.. వరుడి ముందే వధువు కిడ్నాప్!

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకంటే అమ్మాయి, అబ్బాయిని వెతకడం వెళ్లి చూసుకోవడం, సంబంధాలు కుదుర్చుకోవడం ఆ తర్వాత పెళ్లి తంతు ఇదంతా అంత తేలిక కాదు. కానీ, ఈరోజుల్లో పెళ్లిళ్లు అంటే పెద్దలు కుదర్చడం, పిల్లల్ని వెతకడం లాంటివి చాలా తగ్గిపోయాయి. యువత అంతా కాలేజీలు, ఆఫీసుల్లో ఒకరిని ఒకరు ఇష్టపడటం, ప్రేమ వివాహాలు చేసుకోవడం చేస్తున్నారు. పెద్దలు కూడా పిల్లల ఆనందం కోసం వారి పంతాలను పక్కన పెట్టి పెళ్లిళ్లు చేస్తున్నారు.

అయితే ఇప్పటికీ ప్రేమ వివాహం అనగానే అడ్డుపడే పెద్దలు లేకపోలేదు. అందరి ప్రేమలు వివాహాల దాకా వెళ్లడం లేదు. ఇప్పటికీ పరువుకోసం ప్రాణాలు తీయడం చేస్తూనే ఉన్నారు. ఇంకొందరు అయితే వధువుని బలవంతంగా తీసుకెళ్లడం చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ లో ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని సిద్ధమైంది. అకస్మాత్తుగా వధువు తరఫు బంధువులు వచ్చి ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. బికనీర్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

రాంపురకు చెందిన ఓ యువతి ముకేష్ అనే యువకుడిని ప్రేమించింది. కొన్నేళ్లు ప్రేమించుకున్న తర్వాత వారు వివాహం కూడా చేసుకోవాలి అనుకున్నారు. కానీ, పెద్దలు అందుకు అంగీకరించలేదు. చేసేది లేక రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. తీరా పెళ్లి చేసుకునేందుకు రిజిస్ట్రార్ ఆఫీస్ కు వెళ్తున్న సమయంలో అమ్మాయి తరఫువాళ్లు మార్గం మధ్యలో కారుని ఆపి వారిని అడ్డుకున్నారు. యువతిని బలవంతంగా లాక్కుని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Jojobet GirişMadridbetMariobetmeritbetcasibom girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetcasibom girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş