iDreamPost
android-app
ios-app

రూ.6 లక్షల బడ్జెట్‌.. 800 కోట్ల కలెక్షన్స్‌.. RRR మించి ఆ హారర్ మూవీ..

  • Published Mar 01, 2024 | 9:35 AM Updated Updated Mar 01, 2024 | 9:35 AM

కేవలం ఆరు లక్షల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఓ సినిమా 800 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ సాధించి.. సినీ చరిత్రలో అత్యధిల లాభాలు సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. ఇంతకు ఆ సినిమా ఏదంటే..

కేవలం ఆరు లక్షల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఓ సినిమా 800 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ సాధించి.. సినీ చరిత్రలో అత్యధిల లాభాలు సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. ఇంతకు ఆ సినిమా ఏదంటే..

  • Published Mar 01, 2024 | 9:35 AMUpdated Mar 01, 2024 | 9:35 AM
రూ.6 లక్షల బడ్జెట్‌.. 800 కోట్ల కలెక్షన్స్‌.. RRR మించి ఆ హారర్ మూవీ..

నేటి కాలంలో సినిమా బడ్జెట్‌ అనేది ఎంతలా పెరిగిపోతుందో చూస్తూనే ఉన్నాం. ఓ సినిమా బయటకు రావాలంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ట్రిపుల్‌ ఆర్‌, జవాన్‌, పఠాన్‌ వంటి సినిమాలు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. అయితే భారీ బడ్జెట్‌ చిత్రాలన్ని ఇదే విధంగా విజయం సాధిస్తున్నాయా అంటే.. లేదు. చాలా వరకు బాక్సాఫీస్‌ వద్ద చతికిలబడుతున్నాయి. ఇదే సమయంలో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రాలు అనూహ్యంగా భారీ విజయం సాధిస్తున్నా. ఈ కోవకు చెందినదే హనుమాన్‌ సినిమా. అతి తక్కువ బడ్టెత్‌ తెరకెక్కిన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల కలెక్షన్స్‌ సాధించింది. ఈ క్రమంలో ఓ హారర్‌ మూవీకి సంబంధించిన విశేషాలు ఆసక్తికరంగా మారాయి. కేవలం 6 లక్షల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా 800 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంతకు ఆ సినిమా ఏదంటే..

జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చి ఏకంగా 133,000 శాతం లాభాన్ని అందుకున్న సినిమా ఒకటి ఉంది. అదే.. పారానార్మల్‌ యాక్టివిటీ అనే హారర్‌ సినిమా. 2007లో మొదటిసారి డైరెక్టర్ ఓరెన్ పెలి ఈ హాలీవుడ్‌ హారర్ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాకు ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ ద్వారా ప్రాచుర్యం పొందిన ఫౌండ్-ఫుటేజ్ శైలీని ఉపయోగించారు. అంటే, సీసీటీవీ కెమెరాలు, హ్యాండ్‌హెల్డ్ కెమెరాలు మాత్రమే ఉపయోగించి ఈ మూవీని షూట్‌ చేశారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం, చిత్రీకరణ, నిర్మించడం, ఎడిటింగ్ ఇలా అన్నీ ఎరెన్ పెలి స్వయంగా చూసుకున్నాడు.

6 లక్షలతో తీస్తే.. 800 కోట్ల కలెక్షన్స్

నివేదికల ప్రకారం, పారానార్మల్ యాక్టివిటీ సినిమా 15 వేల డాలర్ల (అప్పట్లో ఇండియా కరెన్సీ ప్రకారం చూసుకుంటే.. రూ. 6 లక్షలు) బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇది స్టూడియోలకు విక్రయించిన తర్వాత పోస్ట్-ప్రొడక్షన్, మార్కెటింగ్‌తో కలిపి మొత్తంగా 2 లక్షల డాలర్స్ (రూ. 85 లక్షలు) అదనంగా ఖర్చు అయింది. కానీ విడుదలైన తర్వాత ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. పారానార్మల్‌ యాక్టవిటీ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 194 మిలియన్ డాలర్స్ అంటే అప్పట్లోనే రూ. 800 కోట్లు వసూలు చేసింది.

సినీ చరిత్రలోనే అత్యధిక లాభాలు అందుకున్న మూవీ..

ఇది సుమారుగా 133,000 శాతం లాభం. సినీ చరిత్రంలో ఇప్పటివరకు ఇంతలా లాభాలు పొందిన సినిమా లేదు. పారానార్మల్ యాక్టివిటీ సినిమానే అత్యంత లాభదాయకమైన చిత్రం. అనంతరం ఈ సినిమాకు సీక్వెల్స్‌ చాలానే వచ్చాయి. ఈ పారానార్మల్ యాక్టివిటీ ఫ్రాంఛైజీలో ఇప్పటివరకు మొత్తంగా 7 సినిమాలు వచ్చాయి. ఈ పారానార్మల్ యాక్టివిటీ చిత్రాలు అన్ని కలిసి ప్రపంచవ్యాప్తంగా 890 మిలియన్ డాలర్స్ వసూలు చేశాయి. అంటే, రూ. 4600 కోట్లకు వసూలు చేశాయన్నమాట.

థియేటర్‌తో పాటు అదనంగా, డిజిటల్ హక్కులు, టెలివిజన్ రైట్స్ ఇలా అన్ని కలిపి ఈ ఫ్రాంచైజీకి దాదాపుగా రూ. 5000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు డీఎన్ఏ ఇండియా మీడియా తెలిపింది. కేవలం రూ.6 లక్షల బడ్జెట్‌తో (పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత రూ. 1 కోటి లోపు ఖర్చు) తీసినప్పటికీ పారానార్మల్ యాక్టివిటీ సినిమా అతి భారీ విజయాన్ని అందుకుంది. మరి మీరు కూడా ఈ వీకెండ్‌లో ఈ సినిమా చూసేయండి.