iDreamPost
android-app
ios-app

ఫోటోలో పిల్లాడు ఎవరో తెలిసిందా? కొన్నేళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్నాడు..

  • Author ajaykrishna Published - 06:13 PM, Sat - 8 July 23
  • Author ajaykrishna Published - 06:13 PM, Sat - 8 July 23
ఫోటోలో పిల్లాడు ఎవరో తెలిసిందా? కొన్నేళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్నాడు..

పాన్ ఇండియా స్టార్స్ నుండి అప్ కమింగ్ స్టార్స్ వరకు ఎవరి గురించి అయినా.. ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనే ఆసక్తి ఫ్యాన్స్ లో ఎల్లప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు పైన చూస్తున్న పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా..? చూస్తే ఈజీగా కనిపెట్టొచ్చు అనిపిస్తుంది కదా! కానీ.. అతనెవరో కనిపెట్టడం అంత ఈజీ కాదు.. అలాగని అంత కష్టం కూడా కాదు. ఎందుకంటే.. మీరు పిక్ లో చూస్తున్న పిల్లాడు ఇప్పుడు మామూలోడు కాదు. ఒక దర్శకుడు కన్న కల.. ఆ దర్శకుడు తీసిన సినిమా.. ఒక్కసారిగా దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. ఈ కుర్రాడి బ్లాక్ బస్టర్ హిట్, పాన్ ఇండియా ఫేమ్ వచ్చేసాయి.

ఏంటి ఇలా క్లూ ఇచ్చేశాను అనుకుంటున్నారా.. ముందే చెప్పా కదా.. కొంచం గమనిస్తే ఫోటోలో కుర్రాడిని గుర్తించడం అంత కష్టమేమి కాదు. ఎస్.. కనిపెట్టేశారా మరి. ఆల్రెడీ పాన్ ఇండియా హీరో అని చెప్పేశాగా.. అయినా గుర్తు రాలేదా! తెలిసినవాడే అనిపించినా ఎక్కడో చిన్న డౌట్ కదా! నేను చెప్తాగా.. ఫోటోలో కుర్రాడు ఇండస్ట్రీలో తన పెదనాన్న క్రియేట్ చేసుకున్న లెగసిని జాగ్రత్తగా కంటిన్యూ చేస్తున్నాడు. అతని పెదనాన్న బిరుదే ఇతనికి దక్కింది. ఎస్.. అతనెవరో కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజుకు నటవారసుడుగా ప్రభాస్ ఇండస్ట్రీని ఏలుతున్నాడు. బాహుబలి, సాహో, రాధేశ్యామ్, రీసెంట్ గా ఆదిపురుష్.. ఇలా వరుస పాన్ ఇండియా మూవీస్ తో ఎదుగుతున్నాడు.

అందరూ స్టార్డమ్ వచ్చాక ప్రభాస్ ని గుర్తు పెట్టుకొని ఉంటారు. కానీ.. చాలామందికి అతను చిన్నప్పుడు ఎలా ఉండేవాడో తెలియకపోవచ్చు. ఎందుకంటే.. ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా ప్రభాస్ కి సంబంధించి పర్సనల్ విషయాలు, ఫోటోలు పెద్దగా బయట పడలేదు. కానీ.. ఈ మధ్యే డార్లింగ్ చిన్ననాటి పిక్స్, మెమోరీస్ తన సన్నిహితుల ద్వారా తెలుసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక పైన చూస్తున్న పిక్.. ప్రభాస్ స్కూల్ టైంలో దిగింది. స్కూల్ యూనిఫామ్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ.. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మీరు ఓ లుక్కేయండి. ఇదిలా ఉండగా.. కెరీర్ పరంగా ప్రభాస్ ప్రస్తుతం.. సలార్, ప్రాజెక్ట్ కే, డైరెక్టర్ మారుతీ మూవీస్ రెడీ చేస్తున్నాడు. ఇందులో సెప్టెంబర్ 28న సలార్ పాన్ వరల్డ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి పైన పిక్ లో ఉన్న స్టార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş