iDreamPost
android-app
ios-app

కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య.. కారణం ఇదే

  • Published May 03, 2024 | 3:58 PM Updated Updated May 03, 2024 | 3:58 PM

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య గురించి అందరికీ తెలిసిందే. తన జానపద పాటలతో ఎంతోమందిని ఆకట్టుకున్న మొగులయ్య తాజాగా కూలీగా మారాడు. అయితే మంచి గుర్తింపు తెచ్చుకున్న మొగులయ్య ఇలా కూలీగా మారడానికి కారణమేమిటంటే..?

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య గురించి అందరికీ తెలిసిందే. తన జానపద పాటలతో ఎంతోమందిని ఆకట్టుకున్న మొగులయ్య తాజాగా కూలీగా మారాడు. అయితే మంచి గుర్తింపు తెచ్చుకున్న మొగులయ్య ఇలా కూలీగా మారడానికి కారణమేమిటంటే..?

  • Published May 03, 2024 | 3:58 PMUpdated May 03, 2024 | 3:58 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య.. కారణం ఇదే

ప్రముఖ జానపద కళాకారుడు కిన్నెర మొగులయ్య గురించి అందరికీ తెలిసిందే. బతుకుదెరువు కోసం జానపద పాటలు పాడుకుంటూ ఊరూరూ తిరిగిన కళాకారుడు ఈ మొగులయ్య. కానీ, అనుకోకుండా ఈయన చిత్ర పరిశ్రమకు పరిచమయ్యాడు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో తన గాత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు మొగులయ్య. దీంతో ఆయన ప్రయాణం వెండితెరపై కొనసాగింది. అంతేకాకుండా.. ఆయన ఇంతక ముందు పాన్ గల్, మియాసాబ్, పండుగ సాయన్న వీరగాథ వంటివి కిన్నెర వాయించి పాడేవాడు. ఇక ఆయన పాడిన పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇక ఈయన ప్రతిభకు గాను పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నాడు. కానీ, తాజాగా ఈయన కూలీగా అవతారం ఎత్తాడు. అయితే పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇలా కూలీగా మారాడానికి గల కారణమేమిటంటే..?

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అలాగే తన జానపద పాటలతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. అయితే తాజాగా మొగులయ్య రోజువారి కూలీగా మారారు. కాగా, హైదరాబాద్ సమీపంలోని తుర్కయమంజాల్ లో ఓ నిర్మాణ స్థలంలో ఆయన పని చేస్తూ కనిపించారు. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ అతనికి అంత కష్టం ఏమొచ్చింది.. ఎందుకు కూలీగా మారాడో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అయితే మొగులయ్యకు తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని.. అందుకే పొట్టకూటి కోసం కూలీపనులకు వెళ్తునట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మొగులయ్య మాట్లాడుతూ.. నా కుమారుల్లో ఒకరు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక నా ఆరోగ్య పరిస్థితి అంతత మాత్రమే. ఇలాటి సమయంలో మందుల కోసం నెలకు కనీసం రూ. 7,000 కావాలి. అయితే సాధారణ వైద్య పరీక్షలు, ఇతర ఖర్చులు కూడా ఉన్నాయి. అలాగే కుటుంబం నా మీదనే ఆధారపడి ఉండటంతో.. నేను కూలీ పనులకు వెళ్తున్నా అని మొగులయ్య చెప్పుకొచ్చారు.

ఇక గత ప్రభుత్వం మంజూర్ చేసిన రూ. 10,000 నెలవారీ గౌరవ వేతనం ఇటీవలే నిలిపివేశారని మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అలా ఎందుకు జరిగిందో తనకు తెలియదని అన్నారు. దీంతో ఇంట్లో పూట గడవటం కోసం తాను పని కోస చాలా చోట్లు ప్రయత్నించానని అన్నారు. ఇక తనపై సానుభూతి చూపించి.. మర్యాదపూర్వకంగా తనకు పని ఇవ్వలేదన్నారు. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వం నాకు రూ. కోటి రూపాయలు గ్రాంట్ గా ఇచ్చింది. అయితే  నేను ఆ డబ్బును నా పిల్లల పెళ్లిళ్ల కోసం ఉపాయోగించాను అలాగే తుర్కయంజాల్ లో కొంత భూమిని కూడా కొని, నిర్మాణం కూడా ప్రారంభిచాను. కానీ, సరిపడా డబ్బులు లేక ఆ నిర్మాణం మధ్యలోనే ఆపేశాను. అయితే రంగారెడ్డి జిల్లాలో 600 చదరపు గజాల స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఇది ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది. అందుకోసం నేను రంగారెడ్డి కలెక్టర్ కార్యలయానికి మూడుసార్లు వెళ్లాను. కానీ, ప్రతిసారి కొత్త కలెక్టర్ వస్తున్నారు. కానీ, అక్కడ నా యోగక్షేమలు అడిగి త్వరలోనే హయత్ నగర్ దగ్గర స్థలం కేటాయిస్తామని చెబుతున్నారు తప్ప ఏం చేయటం లేదు అని అన్నారు.

కాగా, ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కలను మొగులయ్యను కలిశారని, ఇక తన సమస్యలపై వారికి విన్నవించగా.. మంత్రి కొండా సురేఖను సీఎం ఆదేశించారని,  అలాగే త్వరలోనే  సమస్యలను తీరుస్తానని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ఇక ప్రభుత్వ నిర్ణయం కోసం తాను వేచి చూస్తున్నానని మొగులయ్య వెల్లడించారు. మరి, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన మొగులయ్య కూలీ పనులు చేసుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.