Swetha
ఒకప్పుడు ఎన్ని సినిమాలు తీసినా కానీ ఓటిటి సంస్థలు ఫ్యాన్సీ రేట్లతో ఆకర్షించేవి. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా సరే ఓటిటి నుంచి మాత్రం పెద్ద మొత్తంలో గ్యారెంటీగా ఓ అమౌంట్ అయితే వచ్చేది. కోవిడ్ టైం లో థియేటర్స్ మూతపడినపుడు ఎంటర్టైన్మెంట్ కు ఓటిటి లే పెద్ద దిక్కు అయ్యాయి
ఒకప్పుడు ఎన్ని సినిమాలు తీసినా కానీ ఓటిటి సంస్థలు ఫ్యాన్సీ రేట్లతో ఆకర్షించేవి. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా సరే ఓటిటి నుంచి మాత్రం పెద్ద మొత్తంలో గ్యారెంటీగా ఓ అమౌంట్ అయితే వచ్చేది. కోవిడ్ టైం లో థియేటర్స్ మూతపడినపుడు ఎంటర్టైన్మెంట్ కు ఓటిటి లే పెద్ద దిక్కు అయ్యాయి
Swetha
ఒకప్పుడు ఎన్ని సినిమాలు తీసినా కానీ ఓటిటి సంస్థలు ఫ్యాన్సీ రేట్లతో ఆకర్షించేవి. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా సరే ఓటిటి నుంచి మాత్రం పెద్ద మొత్తంలో గ్యారెంటీగా ఓ అమౌంట్ అయితే వచ్చేది. కోవిడ్ టైం లో థియేటర్స్ మూతపడినపుడు ఎంటర్టైన్మెంట్ కు ఓటిటి లే పెద్ద దిక్కు అయ్యాయి. ఆ తర్వాత సినిమా రిలీజ్ డేట్స్ ను కూడా శాసించే లెవెల్ కు వచ్చేశాయి. సినిమా ఎలా ఉన్నా సరే ఓటిటి లు కొంటున్నాయిలే అనే ధీమాతో ఎలా పడితే అలా సినిమాలు తీసేసారు కొందరు. కానీ కొంతకాలానికి ఓటిటి లు కూడా కొన్ని సినిమాలను కొనడం మానేశాయి.
ఈ ఎఫెక్ట్ చిన్న సినిమాల మీద పడుతుంది. ఓటిటి లు కొనకపోయిన కనీసం థియేటర్లో అయినా సినిమాలు చూస్తారా అంటే.. రెండు మూడు వారాలకు అవే ఓటిటి లోకి వస్తాయిలే అనే ధీమాతో ఉంటారు ప్రేక్షకులు. ఎందుకంటే ఆల్రెడీ సబ్స్క్రిప్షన్స్ తీసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. పైగా టాక్ సూపర్ గా ఉటనే తప్ప థియేటర్స్ వరకు కదలడం లేదు ప్రేక్షకులు. సో ఇలా కూడా చిన్న సినిమాలకు తిప్పలు తప్పడం లేదు.
దానికి ఉదాహరణ ఈ వారం థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలే. సుందరకాండ సినిమా బాగానే ఉందని టాక్ వచ్చినా సరే థియేటర్లో మాత్రం జనాలు లేరు. అటు అనుపమ పరదా సినిమా పరిస్థితి కూడా ఇదే. ఇంటర్వ్యూలు , ప్రమోషన్స్ లు ఎన్ని చేసినా కానీ ఉపయోగం లేకుండా పోయింది. సో ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించగలిగే కంటెంట్ సినిమాలో ఉందా లేదా అని ముందే చూసుకోగలిగితే బెటర్. లేదంటే అప్పటివరకు చిన్న సినిమాలకు తిప్పలు తప్పవు. ఇక ముందు ముందు ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.