iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం..ఆస్కార్ అవార్డు విన్నర్ కన్నుమూత! ఎలా అనేది మిస్టరీ!

Robert Towne: ప్రముఖల మరణాలు వారి కుటుంబంతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోతారు. ఇదే సమయంలో కొందరు సెలబ్రిటీల మరణం మిస్టరీగా ఉంటుంది. తాజాగా ఆస్కార్ అవార్డు విన్నర్ మృతి చెందారు.

Robert Towne: ప్రముఖల మరణాలు వారి కుటుంబంతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోతారు. ఇదే సమయంలో కొందరు సెలబ్రిటీల మరణం మిస్టరీగా ఉంటుంది. తాజాగా ఆస్కార్ అవార్డు విన్నర్ మృతి చెందారు.

ఇండస్ట్రీలో విషాదం..ఆస్కార్ అవార్డు విన్నర్ కన్నుమూత! ఎలా అనేది మిస్టరీ!

ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖులు వివిధ కారణాలతో కన్నుమూస్తున్నారు. రోడ్డు ప్రమాదం, ఆత్మహత్య, అనారోగ్య సమస్యలు, వృద్దాప్యం వంటి పలు కారణాలతో మరణిస్తుంటారు. ఇలా ప్రముఖల మరణంతో వారి కుటుంబంతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోతారు. ఇదే సమయంలో కొందరు సెలబ్రిటీల మరణం మిస్టరీగా ఉంటుంది. ఇప్పటికే అనేక మిస్టరీ డెత్ లు మనం చూడగా..తాజాగా మరొక సెలబ్రిటీ విషయంలో అదే జరిగింది. ఆస్కార్ అవార్డు విన్నర్ రాబర్డ్ టౌన్ మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత, మూవీ డైరెక్టర్ రాబర్డ్ టౌన్(89) మరణించారు. ఈయన ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. సోమవారం ఆయన తుది శ్వాస విడిచారు. రాబర్డ్ మృతిపై ఆయన మేనేజర్ క్యారీ మెక్ క్లూర్ బుధవారం మీడియాకు వెల్లడించారు. అయితే ఆయన మరణానికి కారణాలు ఏంటనేది మాత్రం వారు వెల్లడించలేదు. అనారోగ్య సమస్య, వృద్దాప్యామా లేక మరేదైనా కారణం అనే విషయాలు వెల్లడికాలేదు. ఇక మరో ట్విస్టు ఏమింటే.. ఆయన చనిపోయిన రెండు రోజుల తరువాత ఈ విషయాన్నివెల్లడించారు. అలా చనిపోయి రెండ్రోజులు గడిచే వరకూ ఎందుకు దాచిపెట్టారనేది మిస్టరీగా మారింది.

ఇక రాబర్ట్ టౌన్ విషయానికి వస్తే.. ఆయన 1934 నవంబర్ 23న అమెరికాలో జన్మించారు. అంతేకాక స్క్రీన్ రైటర్ గా  ఫేమస్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే..హలీవుడ్ లో గ్రేట్ రచయితల్లో ఆయనొకరు. 1960లో విడుదలైన ‘లాస్ట్ ఉమెన్ ఆన్ ఎర్త్’ స్క్రిప్ట్‌తో రాబర్ట్ తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తరువాత అనేక సూపర్ డూపర్ సినిమాకు స్క్రీన్ రైటర్ గా పని చేశారు. ఈ క్రమంలోనే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను రాబర్ట్ సొంతం చేసుకున్నారు. 1970లలో 14 నెలల వ్యవధిలో ‘ది లాస్ట్ డిటెయిల్’, ‘చైనాటౌన్’, ‘షాంపూ’ అనే మూడు విమర్శనాత్మక సినిమాలను ఆయన తెరకెక్కించారు.

ఈ మూడు మూవీస్ స్క్రిప్ట్‌లు ఆస్కార్‌కు నామినేషన్ కి ఎంపికయ్యాయి. వీటిలో ‘చైనాటౌన్’ మూవీకి రాబర్ట్‌కు ఆస్కార్ లభించింది. ఈ సినిమాకు బెస్ట్ మూవీ అవార్డును సొంతం చేసుకుంది. దానితో పాటు సహా 11 అకాడమీ అవార్డులకు నామినేట్ చేయబడింది. ఆ తరువాత 1997లో ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’ చిత్రానికిగానూ ఆయనను ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డును పొందారు. ఆయన కంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొత్తంగా ఆయన మరణం హాలీవుడ్ లో విషాదం నింపింది.  రాబర్ట్ టౌన్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు  సంతాపం వ్యక్తం చేశారు. మీ సంతాపాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.