iDreamPost
android-app
ios-app

ఆసుపత్రి బిల్లు కట్టలేక చనిపోయిన స్టార్ నటుడు.. కన్నీరు పెట్టిస్తున్న కథ!

  • Published Apr 05, 2024 | 2:57 PM Updated Updated Apr 05, 2024 | 2:57 PM

Actor Mserable life Story: సినీ ఇండస్ట్రీలో ఓ రంగుల ప్రపంచం అని అందరూ భావిస్తుంటారు. తెరపై ఒక్కసారి కనిపిస్తేచాలు సెలబ్రెటీ హోదా వస్తుందని భావిస్తుంటారు.

Actor Mserable life Story: సినీ ఇండస్ట్రీలో ఓ రంగుల ప్రపంచం అని అందరూ భావిస్తుంటారు. తెరపై ఒక్కసారి కనిపిస్తేచాలు సెలబ్రెటీ హోదా వస్తుందని భావిస్తుంటారు.

ఆసుపత్రి బిల్లు కట్టలేక చనిపోయిన స్టార్ నటుడు.. కన్నీరు పెట్టిస్తున్న కథ!

వెండితెరపై ఒక్కసారి కనిపించాలని ఎంతోమంది కళాకారులు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్సు అంటూ స్టూడియోల చుట్టూ చక్కర్లు కొడుతుంటారు. కొంతమందికి టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసిరాదు. చాలా మంది సినీ ఇండస్ట్రీలో ఉన్నవారు అదృష్టవంతులు.. రాజభోగాలు అనుభవిస్తుంటారని భావిస్తుంటారు. తమ జీవితాల్లో ఎన్నో ఆటుపోట్లు, కష్టాలు, కన్నీళ్లు ఉంటాయని ఎంతోమంది నటీనటులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఒక్క వెలుగు వెలిగి.. చనిపోయే ముందు దుర్భరమైన జీవితాన్ని గడిపిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటీ ఓ నటుడి కన్నీటి కథ గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో ఛాన్స్ దక్కించుకున్నాడు. నటుడిగా మంచి పేరు రావడంతో వరుసగా షూటింగ్ బిజీలో ఉండేవారు. చేతినిండా సంపాదన.. భార్యాపిల్లలతో ఎంతో సంతోషమైన జీవితం. అలాంటి ఆ నటుడి జీవితంలో ఉపద్రవంలా ఊహించని కష్టాలు చుట్టుముట్టాయి. అనారోగ్యం కారణంగా కూడబెట్టిన డబ్బు అంతా ఖర్చయ్యింది. చివరికి మందులు కొనేందుకు కూడా డబ్బులు లేని దీన స్థితిలో మరణించాడు. ఇది సినిమా కథ కాదు.. ఓ నటుడి జీవిత కథ. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సీతారాం పంచల్ తన నటనతో ఎంతోమంది అభిమాను మనసు గెలిచాడు. స్లమ్ డాగ్ మిలియనీర్, పీప్లీ లైవ్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, జాలీ ఎల్‌ఎల్‌బి 2, పాన్ సింగ్ తోమర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు సీతారాం పంచల్.

Actor who died unable to pay hospital bill

అప్పట్లో స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీకి ఆస్కార్ అవార్డు దక్కడానికి ఆయన నటన కూడా ఓ ప్లస్ అనేవారు. వెండితెరపై వరుస సినిమాలతో బీజీ లైఫ్ గడిపిన ఆయన చివరి రోజుల్లో దుర్భరమైన జీవితాన్ని గడిపారు. 2017, ఆగస్టు 10 న ఆయన అతి పేదరికంతో కన్నుమూశారు. నటుడిగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో హఠాత్తుగా అనారోగ్యంపాలయ్యాడు. కిడ్నీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతూ కదల్లేని స్థితికి చేరుకున్నాడు. దీంతో సినిమాల్లో అవకాశాలు లేవు.. ఇంట్లో పరిస్తితి రానురాను దిగజారిపోతూ వచ్చింది. ఆయన కూడబెట్టిన డబ్బు ఆస్పత్రులకే సరిపోయింది. దీంతో సహాయం కోసం చేయి చాచాడు.. అప్పట్లో హర్యాన ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చింది.

సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అతని పరిస్థితి అందరికీ తెలిపి ఆర్థిక సాయం కోరింది. విరాళాలు కేవలం రూ. 1,06,575 మాత్రమే వచ్చాయి. ఈ డబ్బు ఆయనను ఏవిధంగాను కాపాడలేకపోయాయి. ఆయనతో కలిసి నటించిన స్టార్ హీరోలు, దర్శక, నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి మందులు కొనేందుకు కూడా డబ్బులే లేక బక్కచిక్కిపోయి ఎవరూ గుర్తించలేని స్థితికి చేరుకున్నారు. అలా ఆయన కన్నుమూసిన తర్వాత ఆస్పత్రి వర్గాల వారిని బతిలాడి ఆయన పార్థీవదేహాన్ని ఇంటికి తీసుకు వచ్చారు.ఇండస్ట్రీలో మంచి నటుడిగా రాణించినప్పటికీ విధి వక్రించి సీతారాం పంచల్ జీవితం అస్తవ్యస్తం అయ్యింది.