iDreamPost
android-app
ios-app

Orry Sucess Story: సెలబ్రిటీలకే సెలబ్రిటీ.. ఎవరీ అరహాన్ అవత్రామణి?

  • Published Jan 25, 2024 | 8:43 PM Updated Updated Jan 25, 2024 | 8:43 PM

లైఫ్ లో సక్సెస్ అవ్వాలని అందరికీ ఉంటుంది. కానీ, అందుకు సరైన మార్గమే తోచదు. కానీ, ఇతను మాత్రం తననే ఒక బ్రాండ్ గా మార్చుకుని దూసుకుపోతున్నాడు.

లైఫ్ లో సక్సెస్ అవ్వాలని అందరికీ ఉంటుంది. కానీ, అందుకు సరైన మార్గమే తోచదు. కానీ, ఇతను మాత్రం తననే ఒక బ్రాండ్ గా మార్చుకుని దూసుకుపోతున్నాడు.

  • Published Jan 25, 2024 | 8:43 PMUpdated Jan 25, 2024 | 8:43 PM
Orry Sucess Story: సెలబ్రిటీలకే సెలబ్రిటీ.. ఎవరీ అరహాన్ అవత్రామణి?

సెలబ్రిటీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వాళ్లను కలవాలని, వారితో కలిసి సెల్ఫీలు తీసుకోవాలని, వారితో ఒక్కసారి అయినా మాట కలపాలి అని అందరికీ ఉంటుంది. తమ అభిమాన తారలను అయితే లైఫ్ లో ఒక్కసారి అయినా కలవాలి అని గోల్ గా పెట్టుకుంటారు. ప్రేక్షకులు అంతగా అభిమానించే సెలబ్రిటీలు సైతం అభిమానించే వ్యక్తులు ఉండే ఉంటారు. వాళ్లు కూడా ఒక సెల్ఫీ కోసం అడిగిన సందర్భాలు ఉండే ఉంటాయి. అలాంటి ఒక వ్యక్తి గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అతను మరెవరో కాదు.. అరహాన్ అవత్రామణి అలియాస్ ఆర్రీ. మరి.. ఈ ఆర్రీ కథ ఏంటో చూద్దాం.

అరహాన్ అలియాస్ ఆర్రీ గురించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతని ఫొటోలు సోషల్ మీడియాలో అంతగా వైరల్ అవుతూ ఉంటాయి. ఏదోక సెలబ్రిటీతోనో.. స్టార్ కిడ్ తోనే ఆర్రీ ఫొటోలకు ఫోజిలిస్తూ కనిపిస్తాడు. ఇంక స్టార్స్ పార్టీ ఉందంటే అక్కడ ఆర్రీ ఉండాల్సిందే. ఇక్కడ ఇంకో వింత ఏంటంటే.. సెలబ్రిటీలతో కలిసి ఫొటోలకు ఫోజులు ఇవ్వడానికి ఆర్రీ రెమ్యూనరేషన్ వసూలు చేస్తాడు. అది కూడా వందలు, వేలు కాదండోయ్.. ఒక స్టార్స్ నైట్ పార్టీకి ఏకంగా రూ.20 లక్షల వరకు ఛార్జ్ చేస్తాడట. సాధారణంగా ఒక వస్తువుని తయారు చేసి.. దానిని ప్రచారం చేసి మార్కెట్ లో దానిని ఒక బ్రాండ్ గా బిల్డ్ చేసి.. దానికి డిమాండ్ ని క్రియేట్ చేస్తారు. కానీ, ఆర్రీ మాత్రం తననే ఒక బ్రాండ్ గా మార్చుకున్నాడు. అంతేకాకుండా తనకు విపరీతమైన డిమాండ్ క్రియేట్ అయ్యేలా చేశాడు. అక్కడితో ఆగకుండా తనకు ఉన్న డిమాండ్ క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నాడు. తనని తాను ఒక హ్యూమన్ స్టార్టప్ గా చెప్పుకుంటాడు.

ఇంత సక్సెస్ సాధించిన ఆర్రీ జీవితంలో కష్టాలు లేవా అంటే.. కావాల్సినన్ని ఉన్నాయి. ఆర్థికంగా స్థిర పడటానికి చాలానే ఇబ్బందులు పడినట్లు చెప్తుంటాడు. తాను చేయని జాబ్ లేదట. ఇంక ఆర్రీ టాలెంట్స్ విషయానికి వస్తే.. సింగర్, సాంగ్ రైటర్, ఫ్యాషన్ డిజైనర్, క్రియేటివ్ డైరెక్టర్, స్టైలిస్ట్, ఎక్జిగ్యూటివ్ అసిస్టెంట్ ఇలా చాలానే చెప్తాడు. లైఫ్ అనేది కోరుకున్న కలలను సాకారం చేసుకుంటేనే సంతోషంగా ఉంటుందని ఆర్రీ చెబుతూ ఉంటాడు. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఆర్రీ తన లైఫ్, చేసే పనులకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అలాగే తనపై వచ్చే ట్రోలింగ్ గురించి కూడా క్రేజీ కామెంట్స్ చేశాడు. ఆర్రీ పిక్చర్స్ నెట్టింట ప్రత్యక్షం కాగానే అసలు ఎవరితను? వీడితో ఫొటోలు దిగుతున్నారు ఏంటి? వీడికి అంత సీన్ ఉందా? అంటూ నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తుంటారు.

 

View this post on Instagram

 

A post shared by Orhan Awatramani (@orry1)

తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ కూడా అతను ఎంతో స్పోర్టివ్ గా తీసుకుంటూ ఉంటాడు. నేను ఎవరో తెలియకపోయినా నా గురించి మాట్లాడుతున్నారు అంటే.. వాళ్లు నాకు డబ్బులు తెచ్చి పెడుతున్నారు. అక్కడే నేను సక్సెస్ అయ్యాను అంటూ గర్వంగా చెబుతూ ఉంటాడు. ఆర్రీ గురించి తెలిసిన వాళ్లు తనకి యాటిట్యూడ్ ఉంది, తలపొగరు అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి కామెంట్స్ కి సంబంధించి ఓపెన్ గానే రియాక్ట్ అయ్యాడు. తనకి నిజంగానే యాటిట్యూడ్ ఉందని, తనది తలపొగరే అంటూ స్ట్రైట్ అవే ఒప్పుకున్నాడు. అయితే అది తన సక్సెస్ నుంచి వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తనకు సంబంధించి ఒక పెద్ద టీమే పని చేస్తూ ఉంటుంది. ఆ టీమ్ లో ఇద్దరు సోషల్ మీడియా మేనేజర్లు, ఒక పీఆర్ మేనేజర్, ఒక ఓవరాల్ బ్రాండ్ మేనేజర్, ఒక ఫుడ్ మేనేజర్ ఉంటారు. ఇలా మొత్తం ఐదుగురు మేనేజర్స్ ని ఆర్రీ మెయిన్ టైన్ చేస్తూ ఉంటాడు.

 

View this post on Instagram

 

A post shared by Orhan Awatramani (@orry1)

అంతేకాకుండా ఆర్రీ ఆఫీస్ లో ఒక రిలవెన్స్ రూమ్ అని ఒకటి ఉంటుంది. అక్కడ వీళ్లు స్టోరీ ఐడియాస్ ని డిస్కస్ చేయడం, కంటెంట్ క్రియేట్ చేయడం చేస్తూ ఉంటారు. అలాగే అందులో ఆర్రీ 2, ఆర్రీ 4, ఆర్రీ 5, ఆర్రీ 6 అని ఉంటారు. వీళ్లంతా అచ్చం ఆర్రీ లాగానే మాట్లాడతారు, డ్రెస్ చేసుకుంటారు, అతని లాగానే ఆలోచిస్తారు కూడా. ఆర్రీ ఎంత బిజీ అంటే ఒకేరోజులో రెండు, మూడు పార్టీలకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పార్టీలకు అసలైన ఆర్రీ కంటే ముందు ఇతని డోప్లర్స్ వెళ్తారు. వాళ్లు అచ్చం ఆర్రీలాగే ఉంటారు. వాళ్లే ఫొటోలకు ఫోజులు ఇస్తూ ఉంటారు. అక్కడున్న వారిని ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే ఆర్రీ వస్తాడో అప్పుడు వాళ్లు సైలెంట్ గా పక్కకు వెళ్లిపోతారు. అంటే అతని డిమాండ్ ఆ రేంజ్ లో ఉంది. అయితే ఎంత వేగంగా ఎదుగుతారో.. అంతే వేగంగా డౌన్ ఫాల్ ని కూడా చూస్తారనే విషయాన్ని ఇతను బలంగా విశ్వసిస్తున్నాడు. అందుకే అతి త్వరలో తన పతనానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత ఏం చేయాలి అనే విషయం గురించి ఆలోచిస్తానంటూ చెప్పుకొచ్చాడు. మరి.. సెలబ్రిటీలకే సెలబ్రిటీగా మారిన ఈ అరహాన్ అవత్రామణి అలియాస్ ఆర్రీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Orhan Awatramani (@orry1)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom