Krishna Kowshik
మలయాళంలో చిన్న సినిమా వచ్చి ప్రభంజనం సృస్టించిన మూవీ మంజుమ్మల్ బాయ్స్. సర్వైవల్ థ్రిల్లర్ గా వచ్చి.. సౌత్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ మూవీగా నిలిచింది. కాగా, ఈ సినిమాలో ఓ సీన్ కోసం బిస్కెట్ వాడాడట దర్శకుడు.
మలయాళంలో చిన్న సినిమా వచ్చి ప్రభంజనం సృస్టించిన మూవీ మంజుమ్మల్ బాయ్స్. సర్వైవల్ థ్రిల్లర్ గా వచ్చి.. సౌత్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ మూవీగా నిలిచింది. కాగా, ఈ సినిమాలో ఓ సీన్ కోసం బిస్కెట్ వాడాడట దర్శకుడు.
Krishna Kowshik
మలయాళ ఇండస్ట్రీ ఇటీవల వరుస హిట్లతో చూపు తనవైపు తిప్పుకుంటుంది. భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలే కాదు.. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చిన్న సినిమాలు సైతం థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపించిన సంగతి విదితమే. అందులో ఒకటి మంజుమ్మల్ బాయ్స్. పరవ ఫిల్మ్స్ బ్యానర్‌పై సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ నిర్మించిన ఈ మూవీకి చిదరంబరం దర్శకుడు. మాలీవుడ్‌లో ఫిబ్రవరి 22న విడుదలైన ఈ మూవీ.. తెలుగులో ఏప్రిల్ 5న రిలీజ్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్. ఇందులో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, దీపక్ పరంబోల్ నటించారు. ఇక ఓటీటీలోకి వచ్చి ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రూ. 20 కోట్ల పెట్టి సినిమా తీస్తే.. రూ. 250 కోట్లను కొల్లగొట్టింది.
2006లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి విదితమే.. కొచ్చిలోని మంజుమ్మల్ గ్రామానికి చెందిన 10 మంది కుర్రాళ్లు.. తమిళనాడులోని కొడైకెనాల్ విహార యాత్రకు వెళతారు. అక్కడ ఎంతో ఫేమస్ అయిన గుణ కేవ్స్‌కు వెళ్లానని అనుకుంటారు. అక్కడికి వెళ్లాక.. నిషేధం అని తెలిసినా కూడా రిస్ట్రిక్టడ్ ఏరియాకు వెళతారు. అక్కడ ఊహించని విధంగా ఫ్రెండ్ గ్రూపులో సుభాష్ అనే వ్యక్తి లోలైన లోయలో పడిపోతాడు. అతడ్ని బయటకు తీసుకువచ్చేందుకు మిగిలిన ఫ్రెండ్ పడిన తిప్పలే.. మంజుమ్మల్ బాయ్స్. కాగా, ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు దర్శకుడు. ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచిన క్లైమాక్స్ సీన్ కోసం ఓరియో బిస్కెట్స్ వినియోగించినట్లు పేర్కొన్నాడు చిదంబరం.
ఈ సినిమాలో సుభాష్ పాత్రను పోషించిన శ్రీనాధ్ భాసి గురించి మాట్లాడుతూ.. ఇందులో అతడు లోయలో పడిపోయినప్పుడు రక్తపు మడుగుల్లో ఉన్నట్లుగా చూపించాలి. అప్పుడు గాయాలు తీవ్రంగా కనిపించేందుకు ఓరియో బిస్కెట్లను ఉపయోగించామన్నారు. ఓరియో బిస్కెట్లలో ఉండే క్రీంతో సుభాష్‌కు మేకప్ వేశామన్నారు.‘ఈ టెక్నిక్ అంతా మేకప్ మ్యాన్ రోనెక్స్ జేవియర్‌ది . ఈ క్రెడిట్ అతనికి చెందుతుంది. ఈ మేకప్ వల్ల శ్రీనాధ్ భాసి చాలా ఇబ్బంది పడ్డాడు. బిస్కెట్ క్రీమ్ వాసనకు ఆయన చుట్టూ చీమలు చేరిపోయాయి. ఈ సీన్ తీస్తున్నప్పుడు అతడ్ని చీమలు కుట్టడం స్టార్ట్ చేశాయి. అయినా కూడా సీన్ కోసం అవేమీ పట్టించుకోకుండా బాగా యాక్ట్ చేశాడు’ అంటూ ప్రశంసించాడు దర్శకుడు చిదరంబరం. ఇక ఇదే క్లైమాక్స్‌లో వచ్చే గుణ సాంగ్ ‘కమ్మని నీ ప్రేమ లేఖలే’ (కన్మణి- తమిళం)లోని కొన్ని లిరిక్స్ వినియోగించినందుకు ఇళయరాజా చిత్ర నిర్మాణ సంస్థకు నోటీసులు పంపిన సంగతి విదితమే.