Swetha
భారత్ పాకిస్థాన్ మధ్య పరిస్థితులు రోజు రోజుకి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ పేరు మార్మోగుతుంది. ఇప్పుడు దీని మీద సినిమా కూడా తీయబోతున్నారట మేకర్స్. అదేంటో చూసేద్దాం.
భారత్ పాకిస్థాన్ మధ్య పరిస్థితులు రోజు రోజుకి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ పేరు మార్మోగుతుంది. ఇప్పుడు దీని మీద సినిమా కూడా తీయబోతున్నారట మేకర్స్. అదేంటో చూసేద్దాం.
Swetha
ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ప్రస్తుతం ఇండియా పాకిస్థాన్ మధ్య పరిస్థితులు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో యావత్ భారతీయులు మీడియా సోషల్ మీడియా ద్వారా భారత సైనికులకు తమ మద్దతు తెలుపుతున్నారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా తమ వంతు భాద్యతను కనబరుస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ మీద సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం పలువురు నిర్మాతలు పోటీ పడిన విషయం కూడా తెలిసిందే.
ఏకంగా 15మంది నిర్మాతలు ఈ పేరును రిజిస్టర్ చేసుకున్నారట . ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. జీ స్టూడియోస్, టీ-సిరీస్ లాంటి కొన్ని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు పోటీపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో స్టూడియోస్ దరఖాస్తు చేసుకుని వెనక్కి తగ్గింది. ఇంతలో రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన పవర్ ఫుల్ పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు ఉత్తమ్ నితిన్ దర్శకత్వం వహించగా.. నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే సినిమాలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు, పహల్గాం ఘటన సహ పలు విషయాలను మేకర్స్ చూపించనున్నారని క్లియర్ గా తెలుస్తోంది. త్వరలోనే మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు మేకర్స్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం. పైగా సినిమాలో మెయిన్ క్యాస్టింగ్ ఇప్పటికే ఫిక్స్ అయినట్లు నెట్టింట చర్చలు కూడా జరుగుతున్నాయి. ఓ వైపు దేశ సరిహద్దుల్లో యుద్ధం జరుగుతుంటే మరోవైపు నెట్టింట ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడంతో.. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.