iDreamPost
android-app
ios-app

పాము కారు నడపడం ఏంటి? వాటే థాట్.. వాటే విజన్.. పిచ్చోళ్లం అయిపోయాం

Trolls On Trinayani Serial: బుల్లితెరలో త్రినయని సీరియల్ కు హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సీరియల్ తాజాగా మరోసారి ట్రోల్స్ కి గురవుతోంది.

Trolls On Trinayani Serial: బుల్లితెరలో త్రినయని సీరియల్ కు హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సీరియల్ తాజాగా మరోసారి ట్రోల్స్ కి గురవుతోంది.

పాము కారు నడపడం ఏంటి? వాటే థాట్.. వాటే విజన్.. పిచ్చోళ్లం అయిపోయాం

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు త్రినయని సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ కు మంచి ప్రేక్షకాదరణ ఉంది. నాలుగేళ్లుగా ఈ సీరియల్ ఎంతో సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతోంది. అయితే సీరియల్స్ చూడటం అలవాటు లేనివాళ్లకు కూడా ఈ ధారావాహిక బాగా తెలుసు. ఎందుకంటే ఈ సీరియల్ మీద ఎక్కువగా ట్రోల్స్ నడుస్తూ ఉంటాయి. కథ పరంగా ఎంత బాగా ఉన్నా.. కొన్నిసార్లు లాజిక్స్ లేకుండా సీన్స్ చేస్తూ ఉంటారు. అలా గతంలో కూడా ఎన్నో ట్రోల్స్ నడిచాయి. తాజాగా ఇప్పుడు మరోసారి ట్రోల్స్ కి ఆస్కారం కల్పిస్తూ ఒక సీన్ చేశారు. మరి.. ఆ సీన్ ఏంటి? ఎందుకు ట్రోల్ అవుతోందో చూద్దాం.

త్రినయని సీరియల్ కథ పరంగా ఎన్ని మంచి మార్కులు పొందింది. అలాగే ట్రోల్స్ కూడా బాగానే నడిచాయి. గతంలో ఈ సీరియల్ లో త్రినయనికి విషం పెడతారు. అప్పుడు పాము వచ్చి ఆ విషయాన్ని బయటి నుంచి లాగేస్తుంది. ఈ ఒక్క సీన్ తో పెద్దఎత్తున ట్రోల్స్ నడిచాయి. ఆ సీరియల్ యాక్టర్స్ కూడా చూసి నవ్వుకున్నారు. కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటూ దాటేశారు. ఇప్పుడు అంతకు మించిన సీన్ ని ఈ సీరియల్ లో చూపించారు.

బుధవారం త్రినయని సీరియల్ ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ఒక అద్భుతమైన రివేంజ్ సీన్ పెట్టారు. పాము కారులో కూర్చుని.. తిలోత్తమను యాక్సిడెంట్ చేస్తున్నట్లు చూపించారు. కారులో పాము ఉండటం వరకు ఎవరూ తప్పు బట్టడం లేదు. కానీ, ఆ కారును పాము నడుపుతున్నట్లు చిత్రీకరించారు. ఇక్కడే అందరూ ట్రోల్ చేస్తున్నారు. గతంలో చూపించిన సీన్ అయినా కూడా కాస్తో కూస్తో లాజిక్ ఉంది. ఇది మరీ వాస్తవానికి మాత్రమే కాదు.. ఊహాజనిత లోకానికి కూడా సుదూరంగా ఉంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. సినిమా, సీరియల్ అంటే ఎంతో కొంత లిబర్టీ తీసుకోవాలి. కానీ, అసలు ఊహించుకోవడానికి కూడా సాధ్యంకాని రీతిలో ఇలా సీరియల్స్ తీస్తున్నారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

పాము మనిషి రూపంలో ఉండి కారు నడిపినట్లు చూపిస్తే కన్విన్స్ అయ్యేవాళ్లం. కానీ, ఇలాంటి సీన్స్ తీసి సీరియల్ మీదున్న రెస్పెక్ట్ ని కోల్పోవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే మేము మరీ ఒక మాదిరిగా కూడా ఆనడం లేదా అంటూ రియాక్ట్ అవుతున్నారు. అది ఆటోమేటిక్ కారు అనే అనుకుందాం. పుష్ బటన్ స్టార్ట్ అనే అనుకుందాం. కానీ, డ్రైవ్ అని గేర్ ఎవరు మార్చారా? పాము సీట్లో ఉంటే.. ఎక్సలరేటర్ ఎవరు తొక్కుతున్నారు? అంటూ ఫన్నీగా ప్రశ్నిస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం మీ విషన్ కి, మీ థాట్ కి పిచ్చోళ్లం అయిపోతున్నాం అంటూ రియాక్ట్ అవుతున్నారు. మరి.. పాము కారు నడపడంపై మీరే మనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.