Venkateswarlu
గుంటూరు కారం సినిమా నుంచి నిన్న సాయంత్రం 6.09 గంటలకు ‘ ఓ మై బేబీ ’ అనే సాంగ్ విడుదలైంది. ఈ పాట కారణంగా సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్ చిక్కుల్లో పడ్డారు.
గుంటూరు కారం సినిమా నుంచి నిన్న సాయంత్రం 6.09 గంటలకు ‘ ఓ మై బేబీ ’ అనే సాంగ్ విడుదలైంది. ఈ పాట కారణంగా సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్ చిక్కుల్లో పడ్డారు.
Venkateswarlu
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ఇది. సాధారణంగానే వీరిద్దరి కాంబినేషన్‌పై అంచనాలు ఉండటం పరిపాటి. దీనికి తోడు గుంటూరుకారం నుంచి వస్తున్న అప్‌డేట్లు సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇక, ఈ చిత్రం జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక, నిన్న గుంటూరు కారం సినిమా నుంచి ఓ పాట విడుదలైంది. ‘ ఓ మై బేబీ’ అనే రొమాంటిక్ సాంగ్ యూట్యూబ్‌లోకి వచ్చింది. అయితే, ఈ పాట కారణంగా చిత్ర సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్ చిక్కుల్లో పడ్డారు. మహేష్ బాబు ఫ్యాన్స్ థమన్‌పై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా థమన్‌పై విమర్శలు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకూ మహేష్ బాబు ఫ్యాన్స్ థమన్‌ను ఎందుకు తిడుతున్నారు? ఆ పాట ఎందుకు కారణం అయింది?
గుంటూరు కారం నుంచి రొమాంటిక్ సాంగ్ అని తెలియటంతో ఫ్యాన్స్ పాటపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, పాట ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. ఇదే వారికి కోపాన్ని తెప్పించింది. థమన్ రొమాంటిక్ సాంగ్‌ను సరిగా కంపోజ్ చేయలేదంటూ.. పాట బాలేదంటూ మండిపడుతున్నారు. థమన్‌ను తిట్టిపోస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ పెరగటంతో థమన్ స్వయంగా స్పందించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో .. గుంటూరు కారం నుంచి ఓ అద్భుతమైన పాట రాబోతోందని చెప్పకనే చెప్పారు. ఆ పోస్టుతో మహేష్ బాబు ఫ్యాన్స్ కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత పాటైన బాగుండాలంటూ థమన్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తర్వాతి పాట కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. కాగా, గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు జంటగా శ్రీలీల నటించారు. మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్య కృష్ణ, జయరాం, ప్రకాశ్‌రాజ్, సునీల్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఇక, ఈ చిత్రం విడుదలకు ముందే మహేష్ బాబు ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. ఓవర్‌సీస్‌లో మహేష్ ఖాతాలో కొత్త రికార్డు క్రియేట్ అయింది. ప్రీ బుకింగ్స్ విషయంలో ఆయన నటించిన 8 సినిమాలు 4 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాయి. మరి, గుంటూరు కారం పాట బాలేదంటూ థమన్‌పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.