Swetha
ప్రేక్షకులలో OG ఫీవర్ విపరీతంగా పెరిగిపోతుంది. అసలు ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా సినిమా మీద విపరీతమైన హైప్ పెరిగిపోతుంది. ఈ మధ్య కాలంలో ఓవర్ హైప్ తో వచ్చిన సినిమాలు.. థియేటర్ కు వెళ్లిన తర్వాత ప్రేక్షకులను నిరాశ పరుస్తూనే ఉన్నాయి.
ప్రేక్షకులలో OG ఫీవర్ విపరీతంగా పెరిగిపోతుంది. అసలు ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా సినిమా మీద విపరీతమైన హైప్ పెరిగిపోతుంది. ఈ మధ్య కాలంలో ఓవర్ హైప్ తో వచ్చిన సినిమాలు.. థియేటర్ కు వెళ్లిన తర్వాత ప్రేక్షకులను నిరాశ పరుస్తూనే ఉన్నాయి.
Swetha
ప్రేక్షకులలో OG ఫీవర్ విపరీతంగా పెరిగిపోతుంది. అసలు ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా సినిమా మీద విపరీతమైన హైప్ పెరిగిపోతుంది. ఈ మధ్య కాలంలో ఓవర్ హైప్ తో వచ్చిన సినిమాలు.. థియేటర్ కు వెళ్లిన తర్వాత ప్రేక్షకులను నిరాశ పరుస్తూనే ఉన్నాయి. ఓజి విషయంలో కూడా ఎక్కడ ఇలా అవుతుందా అని ఓ వరంగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతూనే ఉన్నారు. అయితే సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయంటూ ఆ సీన్స్ కు గూస్బంప్స్ పక్కా అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.
అయితే ఈ విషయంలో కాస్త హైప్ తగ్గించుకుంటే బెటర్ అని స్వయంగా టీం ఏ క్లారిటీ ఇస్తుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన గన్స్ అండ్ రోజెస్ లో కొన్ని క్రేజి విజువల్స్ కనిపించాయి. అవి సినిమాలో కచ్చితంగా ఉంటాయని అంతా అనుకున్నారు. మిలిటరీ షాట్స్ , చిరుతపులి షాట్స్ ఇలాంటివి ఏమి సినిమాలో లేవని క్లారిటీ ఇచ్చేశారు. సో హైప్ ఉండొచ్చు కానీ మరీ ఇంత ఓవర్ హైప్ పెట్టుకుని సినిమాకు వెళ్తే మాత్రం నిరాశ తప్పదని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Nooo… those military shots and cheetah visuals won’t be in the main film.
We already have one cheetah, our OG himself. No need for another 😎
— DVV Entertainment (@DVVMovies) September 16, 2025