iDreamPost
android-app
ios-app

నందమూరి నాలుగో తరం హీరో… సినిమా ప్రారంభం

  • Published May 12, 2025 | 1:01 PM Updated Updated May 12, 2025 | 1:01 PM

సినీ ఇండస్ట్రీలో దర్శకుడు YVS చౌదరి సినిమాలకు ప్రత్యకేమైనా స్తానం ఉంటుంది. అయితే ఈసారి రాబోయే సినిమా అతనికి ఎంతో ప్రత్యేకం అని చెప్పి తీరాల్సిందే. చాలా కాలం తర్వాత YVS నుంచి ఓ మంచి సినిమా రాబోతుంది. దానికి సంబందించిన విషయాలు చూసేద్దాం.

సినీ ఇండస్ట్రీలో దర్శకుడు YVS చౌదరి సినిమాలకు ప్రత్యకేమైనా స్తానం ఉంటుంది. అయితే ఈసారి రాబోయే సినిమా అతనికి ఎంతో ప్రత్యేకం అని చెప్పి తీరాల్సిందే. చాలా కాలం తర్వాత YVS నుంచి ఓ మంచి సినిమా రాబోతుంది. దానికి సంబందించిన విషయాలు చూసేద్దాం.

  • Published May 12, 2025 | 1:01 PMUpdated May 12, 2025 | 1:01 PM
నందమూరి నాలుగో తరం హీరో… సినిమా ప్రారంభం

తెలుగువారికి సినిమాలంటే ఎప్పుడు ప్రత్యేకమే. ఆ సినిమాలను కానీ ఆ దర్శకులను కానీ ప్రేక్షకులు మర్చిపోలేరు. వారిలో YVS చౌదరి ఒకరు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి సీతయ్య , దేవదాసు లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాలను అందించారు. ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత ఈ దర్శకుడి నుంచి ఓ అద్భుతమైన సినిమా రాబోతుంది. ఈసారి రాబోయే మూవీ చాలా ప్రత్యేకం అని చెప్పి తీరాలి. నందమూరి వంశం నుంచి నాలుగో తరం హీరో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సినిమా ద్వారా హరికృష్ణ మనవడు , జానకీ రామ్ కుమారుడు .. నందమూరి తారక రామారావు తెరంగేట్రం చేయనున్నాడు. అలాగే వీణారావు అనే కొత్త హీరోయిన్ కూడా ఈ సినిమా ద్వారా పరిచయం కానుంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన పూజ కార్యక్రమానికి నందమూరి కుటుంబంలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ యువ నటులకు వారి ఆశీస్సులు అందజేశారు. “తాతగారి లెగసీని ఈ తరం కొనసాగించాలని” వారు ఆకాంక్షించారు. వైవీఎస్ మాట్లాడుతూ..ఇది ఒక సినిమా కాదు. ఇది తెలుగు సంస్కృతి, హైందవ ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా రూపొందుతున్న ప్రాజెక్ట్. కీరవాణి సంగీతం, సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ లాంటి అగ్రశ్రేణి టెక్నీషియన్స్ తో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.. అని అన్నారు. అలాగే ఎంతో మంది మీడియా సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా సక్సెస్ కావాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. YVS చౌదరి గారి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అందరికి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.