iDreamPost
android-app
ios-app

కూతురు సెంటిమెంట్ బాగానే వర్కవుట్ అవుతోంది!

ఇటీవల వస్తున్న సినిమాల్లో కూతురు సెంటిమెంట్ తో నిండినవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. భగవంత్ కేసరి, హాయ్ నాన్న వంటి సినిమాలు కూతురు సెంటిమెంట్ బేస్ మీదనే వచ్చాయి. తాజాగా సైంధవ్ సినిమా కూడా ఆ జోనర్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది.

ఇటీవల వస్తున్న సినిమాల్లో కూతురు సెంటిమెంట్ తో నిండినవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. భగవంత్ కేసరి, హాయ్ నాన్న వంటి సినిమాలు కూతురు సెంటిమెంట్ బేస్ మీదనే వచ్చాయి. తాజాగా సైంధవ్ సినిమా కూడా ఆ జోనర్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది.

కూతురు సెంటిమెంట్ బాగానే వర్కవుట్ అవుతోంది!

ఈ మధ్య వచ్చిన, త్వరలో రాబోతున్న సినిమాలలో బాగా అందరినీ ఆకర్షించిన సెంటిమెంటల్ పాయింట్ కూతురు క్యారెక్టర్ కి సంబంధించిన కంటెంట్. మరీ చిన్న పిల్ల కాకపోయినా ప్రెజెంట్ ట్రెండింగ్ లో మాస్ హీరోయిన్ శ్రీ లీల  ఉన్నారు.  ఈ బ్యూటీ యువరత్న బాలయ్యతో చేసిన భగవంత్ కేసరి సినిమాలో దాదాపు కూతురు క్యారెక్టర్ తో సమానమైన పాత్రను చేసి సినిమా విజయానికి బాగా హెల్ప్ అయింది.

ఇటీవలే నేచురల్ స్టార్ నాని చేసిన ‘హాయ్ నాన్న’ సినిమాలో కియారా అనే న్యూ బేబీ యాక్టర్ చేసింది. ఆ పాత్ర ద్వారా పండింన సెంటిమెంట్ సినిమాని వీరగా ఆదుకున్నాయి. లేకపోతేనా, యానిమల్ క్రియేట్ చేసిన బీభత్సంలో హాయ్ నాన్న లాటి అతి సున్నితమైన సినిమా అడ్రస్ లేకుండా పోయుండేది. కానీ, నాని నమ్మకాన్ని నిజం చేస్తూ, హాయ్ నాన్న రికార్డు బ్రేకింగ్ సక్సెస్ ని సాధించి, ఆయన బ్రాండ్ ని నిలబెట్టింది. నాని మార్కెట్ కి బాగా కలిసొచ్చింది. కియారా పాత్రే గనక లేకపోతే స్టోరీ వేరేగా ఉండేది మరి.

father sentiment movies

ఇప్పుడు రేపు సంక్రాంతి సందర్శంగా జనవరి 13 విడుదల కాబోతూన్న సైంధవ్ సినిమాకి సంబంధించి విడుదల చేసిన సింగిల్  బుజ్జికొండవే చాలా మంచి ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. పైగా సెంటిమెంట్ ని బాగా పండించగలిగే హీరో విక్టరీ వెంకటేష్ మీద సాంగ్ ఇది. తండ్రీ కూతుర్ల సెంటిమెంట్, కూతురి ఆరోగ్యం బాగులేనప్పుడు తండ్రి గుండె ద్రవించి పాడుతున్న ఈ ఆర్ధమైన పాటను సరస్వతీ పుత్రడు రామజోగయ్య శాస్రి రాయగా, సంతోష్ నారాయణ్ కంపోజ్ చేయగా ఎస్పీ చరణ్ అద్భుతంగా ఆలపించారు.

ఏదో ఒక కొత్తదనాన్ని ఎప్పటికప్పుడు కోరుకుంటున్న ప్రేక్షకులను మెప్పించడానికి చేసే లేదా జరుగుతున్న ముమ్మరమైన ప్రయత్నాలలో ఈ సారి ఈ కూతురు సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయినట్టుగా గట్టిగా కనిపిస్తోంది. వెంకటేష్ సెంటిమెంట్ కూడా బాగా పండుతుంది. ఈ సాంగ్ లో వెంకటేష్ ఎమోషన్స్, పాటతో పాటు వెంకటేష్ కళ్ళలోన ఎక్స్ ప్రెషన్స్ చాలా టచ్చింగ్ ఉన్నాయి.

నైట్ ఎపెక్ట్ లో తీసిన షాట్స్, చుట్టూ ఉన్న ఎట్మాస్ఫియర్ అన్నీ పాటని, అందులో ఎమోషన్ని భాగా ఎలివేట్ చేశాయి. బుజ్జికొండవే….అని సాగే ఈ పాటలో ప్రతీ మాటనీ రామజోగయ్య శాస్త్రి గుండెల్లో ముంచి రాసినట్టుంది. చరణ్ అంతకి రెట్టింపు ఫీల్ తో పాడి పాటని బాగా రక్తి కట్టించాడు, కాకపోతే సైంధవుడు అందరినీ ఏడిపిస్తాడు. కానీ, సైంధవుడే ఏడుస్తున్నాడేంటి….ఇదే ఇందులో దాగి ఉన్న ఎక్సైట్ మెంట్. మరి.. ఇండస్ట్రీలో కూతురు సెంటిమంట్ తో సినిమాలు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.