iDreamPost
android-app
ios-app

ఎక్కడున్నా వెంట‌నే అరెస్టు చేయండి.. జయప్రదకు కోర్ట్ షాక్!

  • Published Feb 13, 2024 | 10:18 PM Updated Updated Feb 13, 2024 | 10:18 PM

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించిన ప్రముఖ నటి జయప్రద ఇటీవల పలు వివాదాస్పద కేసుల్లో చిక్కుకున్నారు.

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించిన ప్రముఖ నటి జయప్రద ఇటీవల పలు వివాదాస్పద కేసుల్లో చిక్కుకున్నారు.

  • Published Feb 13, 2024 | 10:18 PMUpdated Feb 13, 2024 | 10:18 PM
ఎక్కడున్నా వెంట‌నే అరెస్టు చేయండి.. జయప్రదకు కోర్ట్ షాక్!

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో కోట్ల మంది ప్రేక్షకుల మనసు దోచిన హీరోయిన్ జయప్రద గురంచి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. నటిగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమె ఖాతాలో వేసుకున్నారు. నటిగా కొనసాగున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కనిపించారు. గత కొంతకాలంగా నటి జయప్రద తవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు, కోడ్ ఉల్లంఘన కేసులు ఆమెను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమెను అరెస్ట్ చేయాలని కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.

2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించిన నేరంపై ఆమెపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో జయప్రదను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చాలని ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు మంగళవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. జయప్రద ఎక్కడ ఉన్నా ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేయాలని, ఈ నెల 27వ తేదీన కోర్టులో హాజరు పరచాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ని కోర్టు ఆదేశించింది. టీడీపీలో ప్రారంభించిన ఆమె రాజకీయ జీవితం తర్వాత యూపీకి చేరింది. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన జయప్రద తర్వాత ఉత్తరాదిలో తన సత్తా చాటుకున్నారు. యూపీలోని సమాజ్ వాది పార్టీలో చేరి రాంపూర్ నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. తర్వాత బీజేపీలో చేరారు.. ప్రస్తుతం ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె ఎంపీగా ఉన్న సమయంలో ఈఎస్ఐ కి సంబంధించిన కుంభకోణంలో కేసు నమోదైంది.