Keerthi
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి అందరికి తెలిసిందే. తన కేరిర్ లో ఆయన ఎన్నో ఆద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. అయితే పూరి నిజ స్వరూపం గురించి ఆయన తల్లి తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి అందరికి తెలిసిందే. తన కేరిర్ లో ఆయన ఎన్నో ఆద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. అయితే పూరి నిజ స్వరూపం గురించి ఆయన తల్లి తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
Keerthi
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన పేరు వినిపిస్తే చాలు యూత్ అందరిలో ఏదో తెలియని వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంతలా తన మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ తో ఎన్నో ఆద్భుతమైన సినిమాలను తెరకెక్కించడు పూరీ. అయితే ఈయన కెరియర్ మొదటిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బద్రి చిత్రంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వతా ఇడియట్, పోకిరి, టెంపర్ వంటి సినిమాలను రూపొందించి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను సృష్టించాడు. ఇలా తన కేరిర్ లో హిట్ ఫ్లాప్ లతో సంబంధం తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకున్నడు దర్శకుడు పూరీ జగన్నాథ్. అలాగే సినిమాలను వేగంగా తెరకెక్కించిన అతికొద్ది మంది డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ కూడా ఒకరు. అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీ జోరు లైగర్ సినిమాతో ఒక్కసారిగా తగ్గిపోయింది. ఆ ఫ్లాప్ మూడ్ నుంచి ఇప్పటికి బయటకు రాలేకపోతున్నా విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలాంటి కష్టలు ఎదుర్కొన్నారు అనే పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన తల్లి ఓ ఇంటర్వ్యూలో కన్నీరుపెట్టుకుంటు తెలిపారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
సాధారణంగా ఒక వ్యక్తి సక్సెస్ ఫుల్ గా ఎదిగాడంటే.. గతంలో ఆయన ఎన్ని కష్టలు, మరెన్ని ఓటములనో చవి చూశాడని అర్ధం. అచ్చం అలాంటి కోవకు చెందినవాడే దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈయన తన కెరిర్ ప్రారంభంలో ఎన్నో కష్టలను ఎదుర్కొన్నాడు. ఆ విషయాలన్నీంటిని పూరీ తల్లి అమ్మాజీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అందులో ఆమె మాట్లాడుతూ.. ”పూరీకి ఏడో తరగతి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. తాను సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలని ప్రయత్నించిన రోజుల్లో ఇంటి నుంచి డబ్బులు పంపించేవాళ్లం. అవి సరిపోక తాను కూడా చాలా కష్టపడేవాడు. ఎన్నో ఆఫీసుల చూట్టూ కాలినడకన తిరిగేవాడు. ఒకసారి నేను పూరి దగ్గరకు వెళ్లినప్పుడు తన పాదాలు వాచిపోయి సాక్సులు వేసుకోవడానికి రాలేదు. అది చూసి నేను చాలా ఏడ్చేశాను. ఇంత కష్టమెందుకు ఊరికి వచ్చి పొలం పని చేసుకొమని అడిగాను. కానీ పూరీ అందుకు ఒప్పుకోలేదు. దేవుడు నా కష్టం చూడకపోతాడా అని ప్రయత్నించేవాడు. అలా పన్నేండు సంవత్సరాలు కష్టపడ్డాడు. అన్నం తినకుండా మంచినీళ్లు మాత్రమే తాగాన రోజులున్నాయి”.
”అలాగే పూరీ దగ్గర ఓ కుర్రవాడు పనిచేసేవాడు. అతను పూరీ సంపాదించిన రూ.80 కోట్ల రూపాయలను కొట్టేశాడు. ఆ డబ్బుతో పూరీ పేరుమీదే స్థలాలు కొనుగోలు చేస్తున్నట్టుగా చెప్పాడు. పూరీ కూడా అతనిపై గల నమ్మకంతో చూసుకోకుండానే కాగితాలపై సంతకం చేశాడు. అలా ఆ వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలకు మోసం చేశాడు. దాంతో ఆ అప్పులు తీర్చడానికి మా అబ్బాయి ఐదారు మేడలు అమ్ముకోవలసి వచ్చింది. అలా పూరీ ఆస్తులు పోగొట్టుకున్నప్పుడు అందరం ఏడ్చాము. మళ్లీ మాకు ధైర్యం చెప్పింది కూడా పూరీనే. మా బంధువులు ఆ వ్యక్తి సంగతి చూస్తామని అంటే కూడా వారించాడు. తనకి ఇంకా సంపాదించే శక్తి ఉందని మమ్మల్ని ఓదార్చాడు. ఇంతా చేసిన ఆ వ్యక్తి ఏమైనా బాగుపడ్డాడా అంటే అదీ లేదు. సినిమాలు తీసి అదంతా పోగొట్టుకున్నాడు అన్నారు. దీంతో పాటు పూరీకి మొదటి నుంచి కూడా జాలి గుణం ఎక్కువ. ఎదుటివారికి సాయం చేసే స్వభావం చిన్నప్పటి నుంచి ఉంది. ఒక కుర్రాడు బావిలో పడిపోతే, అతణ్ణి కాపాడటం కోసం చిన్నప్పుడే బావిలోకి దూకేశాడు. అంతటి గొప్ప మనసున్నోడు నా కొడుకు. వాడిపడిన పడ్డ కష్టలు ఎవరికి రాకుడాదంటూ కన్నీరు పెట్టుకున్నారు”. మరి, దర్శకుడు పూరీ పడిన కష్టల గురించి తన తల్లి చెప్పిన మాటాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.