35-chinna katha kaadu Movie: నివేద థామస్ మూవీ రిలీజ్ వాయిదా.. 'పెద్ద సినిమా అంటే పోస్ట్ పోన్ అవ్వాలి'!

నివేద థామస్ మూవీ రిలీజ్ వాయిదా.. ‘పెద్ద సినిమా అంటే పోస్ట్ పోన్ అవ్వాలి’!

35-chinna katha kaadu Movie: టాలీవుడ్ హీరోయిన్ నివేద థామస్.. ప్రస్తుతం నటిస్తున్న సినిమా '35- చిన్న కథ కాదు'. ముందుగా ఈ సినిమాను ఆగష్టు 15న రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు అలా జరిగేలా లేదు.

35-chinna katha kaadu Movie: టాలీవుడ్ హీరోయిన్ నివేద థామస్.. ప్రస్తుతం నటిస్తున్న సినిమా '35- చిన్న కథ కాదు'. ముందుగా ఈ సినిమాను ఆగష్టు 15న రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు అలా జరిగేలా లేదు.

ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఆగష్టు 15 న రిలీజ్ అయ్యే చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే ఆయా సినిమాలకు విపరీతమైన బజ్ కూడా నెలకొంది. రవి తేజ మిస్టర్ బచ్చన్ , రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా.. అదే రోజున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నివేద థామస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ’35- చిన్న కథ కాదు’ మూవీని కూడా మొదట ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ తాజాగా రిలీజ్ డేట్ ను మార్చినట్లు ఓ పోస్టర్ రూపంలో అనౌన్స్ చేశారు. “టీచర్ చెప్తే వినాలి.. రిలీజ్ తేది మారాలి..’’ అంటూ “పెద్ద సినిమా అంటే పోస్ట్ పోన్ అవ్వాలి అదే ట్రెండ్” అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు మేకర్స్. కాబట్టి ఆగష్టు 15 కైతే ఈ సినిమా రిలీజ్ కావడం లేదు. త్వరలోనే మూవీ న్యూ రిలీజ్ డేట్ పై అప్ డేట్ ఇచ్చే అవకాశం ఉంది.

Show comments