యంగ్ హీరో నితిన్ తన అదృష్టాన్ని పరీక్షిచుకోవడానికి సిద్దమైయ్యాడు. 'ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్' గా త్వరలోనే థియేటర్లలోకి రానున్నాడు. మరి తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఎలా ఉందో? ఇప్పుడు చూద్దాం.
యంగ్ హీరో నితిన్ తన అదృష్టాన్ని పరీక్షిచుకోవడానికి సిద్దమైయ్యాడు. 'ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్' గా త్వరలోనే థియేటర్లలోకి రానున్నాడు. మరి తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఎలా ఉందో? ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలు చూసే ధోరణి పూర్తిగా మారింది. కంటెంట్ బాగుంటేనే థియేటర్లకు వస్తున్నారు. అదీకాక మూవీ టీజర్, ట్రైలర్ లను చూసి సినిమాకు వెళ్లాలా? వద్దా? అని డిసైడ్ అవుతున్నారు. దీంతో డైరెక్టర్లు కూడా అదే తరహా కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో నితిన్ తన అదృష్టాన్ని పరీక్షిచుకోవడానికి సిద్దమైయ్యాడు. ‘ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్’ గా త్వరలోనే థియేటర్లలోకి రానున్నాడు. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్టార్ రైటర్ పేరొందిన వక్కంతం వంశీ మరోసారి డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మరి ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
నితిన్.. గతేడాది మాచర్ల నియోజకవర్గంతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అదీకాక ఈ మూవీకి ముందు వచ్చిన చెక్, రంగ్ దే చిత్రాలు కూడా విజయాలను అందుకోలేకపోయాయి. దీంతో నితిన్ కు ఇప్పుడొక సూపర్ హిట్ అవసరం. హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో ‘ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్’తో రాబోతున్నాడు. ఈ మూవీకి స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. హారిస్ జై రాజ్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ విషయానికి వస్తే.. రోజుకోలా భిన్నంగా కనిపించాలని అభి(నితిన్)కు కోరిక. ఇదే విషయాన్ని తన తల్లికి చెబితే.. నీలో యాక్టర్ లక్షణాలు ఉన్నాయని ఇండస్ట్రీకి వెళ్లమని ప్రోత్సహిస్తుంది. తల్లి మాటపై సినిమాల్లోకి వెళ్తాడు.. కానీ తీరా చూస్తే అభి జూనియర్ ఆర్టిస్ట్ అవుతాడు. ఇది చూసిన తండ్రి (రావు రమేష్) కొడుకుపై ఎప్పుడూ కోప్పడుతూనే ఉంటాడు. ఈ క్రమంలోనే తన లైఫ్ లో ఛేంజ్ కావాలని కోరుకుంటాడు. అక్కడి నుంచి కథ మరోవైపు తిరిగి ఓ ఊరిని పట్టిపీడిస్తున్న విలన్ (సుదేవ్ నాయర్) ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అభి విలన్ ఏ విధంగా ఎదుర్కొన్నాడు? అన్నది తెరపైనే చూడాలి. డైరెక్టర్ వక్కంతం వంశీ ట్రెండ్ కు తగ్గ పాయింట్ ను తీసుకోవడమే కాక.. అందుకు తగ్గట్లుగా ఔటండ్ ఔట్.. కామెడీ డైలాగ్స్ రాసుకున్నాడు. షర్మిల ఆడపిల్ల డైలాగ్, బాలయ్య ఫ్యాన్స్ ను కొట్టడం, పొన్నియిన్ సెల్వన్ డైలాగ్స్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతాయి. శ్రీలీలకు క్యారెక్టర్ గురించి పెద్దగా రివీల్ చేయలేదు దర్శకుడు.
అయితే కామెడీ టచ్ ఇచ్చినప్పటికీ.. యాక్షన్ సన్నివేశాలు కూడా బాగానే ప్లాన్ చేశాడు వంశీ. చివర్లో యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ను ఇంట్రడ్యూస్ చేసిన విధానం బాగుంది. ఎప్పటిలాగే నితిన్ పక్కింటి కుర్రాడిలా అద్భుతంగా నటించాడు. హారిస్ జైరాజ్ సంగీతం ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తుంది. మెుత్తానికి ట్రైలర్ మాత్రం యూత్ కు బాగా కనెక్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. డిసెంబర్ 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి హిట్టు కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు సక్సెస్ ట్రాక్ ఎక్కుతారేమో చూడాలి. మరి ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.