iDreamPost
android-app
ios-app

రామాయణం.. ఈ కాంబో ఫిక్స్ అయితే రికార్డులు బద్దలే!

  • Author ajaykrishna Updated - 02:00 PM, Wed - 4 October 23
  • Author ajaykrishna Updated - 02:00 PM, Wed - 4 October 23
రామాయణం.. ఈ కాంబో ఫిక్స్ అయితే రికార్డులు బద్దలే!

ఇండస్ట్రీలో ఆదిపురుష్ సినిమా రిలీజ్ తర్వాత చాలామంది విమర్శలు గుప్పించారు. సినిమా అలా ఉంది.. ఇలా ఉంది.. అలా లేదు.. అసలు ఏం లేదు అన్నారు. విజువల్స్ పరంగా నిరుత్సాహపరిచింది.. కానీ, బాగుందని ఇంకొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రామాయణం ఆధారంగా తీశారు కదా.. ఆ మాత్రం ఎనాలిసిస్ చేస్తారు. ఎందుకంటే.. రామాయణం అనగానే అందరికీ గతంలో రామాయణం ఆధారంగా తీసిన సినిమాలు, సీరియల్స్ గుర్తొస్తాయి. వాటిలో లుక్ ఎలా ఉంది.. ఇందులో ఎలా ఉంది? అంటూ పోల్చి చూస్తుంటారు. నిజానికి పూర్వికులు శ్రీరాముడు, సీతమ్మ, రావణాసురుడు.. ఇలాగే ఉండేవారని చెప్పడానికి రుజువులు ఏం లేవు.

పూర్వికులు రాసిన ఇతిహాసాలను ఆధారం చేసుకొని.. విజువల్స్ కి తీసుకురావడమే. ఇప్పుడు రామాయణం ఆధారంగా మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి.. త్వరలో అసలు రామాయణం చూపిస్తానంటూ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన రామాయణం కోసం కాస్టింగ్ పనిలో ఉన్నారట. తాజా సమాచారం ప్రకారం.. నితీష్ తీయబోయే రామాయణంలో.. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడి క్యారెక్టర్ ప్లే చేస్తాడని.. సీత క్యారెక్టర్ కోసం సౌత్ నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఎంపిక అయ్యిందని టాక్ వినిపిస్తుంది. కాగా.. రావణాసురుడు ఎవరినేది ఆసక్తి రేపుతున్న విషయం.

రావణుడిగా ఇందులో కేజీఎఫ్ ఫేమ్ రాఖీభాయ్.. యష్ నటించబోతున్నాడని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ.. నిజమే అయితే ఖచ్చితంగా సూపర్ కాంబినేషన్ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే.. రాముడిగా రణబీర్.. సీతగా సాయిపల్లవి.. రావణ్ గా యష్ ముగ్గురు బాగుంటారు. అలాగే యానిమల్ లాంటి మూవీ తర్వాత రణబీర్ కి రామాయణం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలిగించవచ్చు. సాయిపల్లవికి ఇలాంటి రోల్స్ కొట్టిన పిండి. తన ఎక్సప్రెషన్స్ తో చంపేయగలదు. ఇక యష్.. కేజీఎఫ్ లో వీరోచితంగా కనిపించాడు.. సో.. రావణ్ గా పర్ఫెక్ట్ అనుకోవచ్చు. ఇక ఈ క్రేజీ కాంబోతో సినిమా పట్టాలెక్కేది ఎప్పుడో తెలియాల్సి ఉంది. మరి రామాయణం కాస్ట్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio