థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఓటిటి స్ట్రీమింగ్ కి రావడానికి ఇప్పుడు పెద్దగా సమయం పట్టట్లేదు. ఇదివరకు మినిమమ్ కొన్ని నెలలపాటు గ్యాప్ తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుండేవి. కానీ.. ఇప్పుడా ట్రెండ్ మారిపోయింది. థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయో లేదో.. నెల రోజులలోనే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఎంతో ఎక్సయిట్ మెంట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన కొత్త సినిమా సైలెంట్ గా.. డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. హీరో నిఖిల్ నటించిన థ్రిల్లర్ మూవీ స్పై. జూన్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కావాల్సింది. కానీ.. ఏమైందో గానీ రిలీజ్ దగ్గర తెలుగు తప్ప మిగతా భాషలలో తడబడింది.
కట్ చేస్తే.. స్పై థ్రిల్లర్ గా మినిమమ్ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. వెరసి.. రెగ్యులర్ స్ప్రై థ్రిల్లర్ అనిపించుకుంది. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత.. నిఖిల్ నుండి వచ్చిన సినిమా కావడంతో.. మూవీ టీమ్ చాలా ఎక్స్ పెక్ట్ చేశారని చెప్పాలి. కానీ.. ముఖ్యంగా కథ దగ్గరే దర్శకుడు తడబడుతూ సినిమాని రెగ్యులర్ ఫార్మాట్ లో నడిపించాడని, స్పై క్యారెక్టర్ లో నిఖిల్ కూడా సెట్ కాలేదని విమర్శలు వినిపించాయి. అయితే.. మొత్తానికి స్పై మూవీ డిజిటల్ రిలీజ్ త్వరగానే అవుతుందని అందరు అనుకున్నారు. అనుకున్నట్లుగా స్ట్రీమింగ్ కి వచ్చింది. కానీ.. ఎలాంటి ఊసు లేకుండా రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
నిఖిల్ కి జోడిగా ఈ సినిమాలో తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ నటించింది. తనకు ఇదే ఫస్ట్ తెలుగు మూవీ. ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఇదిలా ఉండగా.. స్పై మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. కాగా.. జులై 27న సైలెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసింది స్పై. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వదిలింది అమెజాన్ ప్రైమ్. ఇక ఈ సినిమా.. ఇప్పుడు ఓటిటిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం హీరో నిఖిల్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి స్పై సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.