iDreamPost
android-app
ios-app

నిఖిల్ భట్ యూనివర్సల్ స్టూడియోస్‌తో హాలీవుడ్‌లో అరంగేట్రం!

  • Published Sep 01, 2025 | 4:26 PM Updated Updated Sep 01, 2025 | 4:26 PM

ఇండియన్ సినిమా డైరెక్టర్ నిఖిల్ భట్ తన టాలెంట్‌ని గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై ప్రదర్శించడానికి సిద్ధమయ్యారు. ఆయన ప్రఖ్యాత యూనివర్సల్ స్టూడియోస్‌తో చేతులు కలిపి తన హాలీవుడ్ డైరెక్టోరియల్ డెబ్యూని ప్రకటించారు. ఇటీవల రిలీజ్ అయిన ఆయన యాక్షన్ థ్రిల్లర్ 'కిల్' గ్లోబల్ ఆడియన్స్‌ని ఆకట్టుకుని, యాక్షన్ సినిమా జానర్‌లో కొత్త బెంచ్‌మార్క్స్ సెట్ చేసింది.

  • Published Sep 01, 2025 | 4:26 PMUpdated Sep 01, 2025 | 4:26 PM
నిఖిల్ భట్ యూనివర్సల్ స్టూడియోస్‌తో హాలీవుడ్‌లో అరంగేట్రం!

గ్లోబల్ యాక్షన్ ఫిల్మ్‌లో టాప్ హాలీవుడ్ స్టార్స్ నటిస్తారు.  సెప్టెంబర్ 1, 2025 – ఇండియన్ సినిమా డైరెక్టర్ నిఖిల్ భట్ తన టాలెంట్‌ని గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై ప్రదర్శించడానికి సిద్ధమయ్యారు. ఆయన ప్రఖ్యాత యూనివర్సల్ స్టూడియోస్‌తో చేతులు కలిపి తన హాలీవుడ్ డైరెక్టోరియల్ డెబ్యూని ప్రకటించారు. ఇటీవల రిలీజ్ అయిన ఆయన యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్’ గ్లోబల్ ఆడియన్స్‌ని ఆకట్టుకుని, యాక్షన్ సినిమా జానర్‌లో కొత్త బెంచ్‌మార్క్స్ సెట్ చేసింది.

ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి ఒక అఫీషియల్ సోర్స్ మాట్లాడుతూ, “నిఖిల్ భట్ మరియు యూనివర్సల్ స్టూడియోస్ మధ్య చర్చలు చాలా కాలంగా జరుగుతున్నాయి, ఇప్పుడు అన్ని డీల్స్ ఫైనల్ అయ్యాయి. ఇది ఒక హై-ఆక్టేన్ యాక్షన్ ఫిల్మ్. ఇది చాలా పెద్ద బడ్జెట్‌తో మరియు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో రూపొందనుంది. ఈ మూవీ నిఖిల్ భట్‌ను గ్లోబల్ డైరెక్టర్స్‌లో ఒకరిగా నిలబెడుతుంది,” అని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో టాప్ హాలీవుడ్ యాక్టర్స్ నటించనున్నారు. స్క్రిప్ట్ డిమాండ్స్ కారణంగా, గ్లోబల్ స్టార్స్‌ని కాస్ట్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. నటీనటుల పేర్లు ప్రస్తుతం డిస్కషన్స్‌లో ఉన్నాయి, త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు.ఈ సినిమా షూటింగ్ 2026లో స్టార్ట్ కానుంది. ప్రస్తుతం నిఖిల్ భట్ మురాద్ ఖేటానీతో కలిసి మరో సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.