షాపింగ్ మాల్ మూవీలో అంజలి ఫ్రెండ్‌గా కనిపించిన ఈ నటి ..ఇప్పుడు ఎలా ఉందంటే..?

అంగడి తెరు (షాపింగ్ మాల్) తమిళ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది తెలుగు నటి అంజలి. 2010లో వసంత బాలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్, అంజలి, వెంకటేష్, పాండి సహా పలువురు నటించారు. విజయ్ ఆంటోనీ, జీవి ప్రకాష్ సంయుక్తంగా మ్యూజిక్ అందించగా.. పాటలు ఎంతటి సూపర్ డూపర్ హిట్ కొట్టాయో అందరికీ తెలుసు..

అంగడి తెరు (షాపింగ్ మాల్) తమిళ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది తెలుగు నటి అంజలి. 2010లో వసంత బాలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్, అంజలి, వెంకటేష్, పాండి సహా పలువురు నటించారు. విజయ్ ఆంటోనీ, జీవి ప్రకాష్ సంయుక్తంగా మ్యూజిక్ అందించగా.. పాటలు ఎంతటి సూపర్ డూపర్ హిట్ కొట్టాయో అందరికీ తెలుసు..

టాలీవుడ్‌లో అడపా దడపా సినిమాలు చేసి ఇక్కడ అంత పేరు రాకపోవడంతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టి క్లిక్ అయిన బ్యూటీ అంజలి. అచ్చ తెలుగు అమ్మాయైన అంజలి.. ఫోటో, ప్రేమ లేఖ రాశా వంటి చిత్రాల్లో చేసినా.. పేరు రాకపోవడంతో.. తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2010లో వచ్చిన అంగడి తెరు (తెలుగులో షాపింగ్ మాల్)తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమా తమిళనాటే కాకుండా.. తెలుగులో కూడా మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తమిళనాడులో వరుసగా ఆమెకు అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి హిట్స్ అందుకుంది.

ఆమెను నటిగా నిలబెట్టిన సినిమా మాత్రం షాపింగ్ మాల్ మూవీనే. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్. ‘ నా ప్రాణం నువ్వైపోతే.. గుండెల్లో కోలాటం’ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్. అయితే ఈ సినిమాలో అంజలి స్నేహితురాలిగా నటించిన అమ్మాయి గుర్తుందా..సోఫియా పాత్రలో యాక్ట్ చేసింది. అందులో తన నటనతో ఏడిపించింది. ఆమె పేరు సుగుణ నాగరాజన్. షాపింగ్ మాల్ షూటింగ్ సమయంలోనే ఆ సినిమా అసోసియేట్ డైరెక్టర్ నాగరాజన్‌తో ప్రేమలో పడి.. వివాహం చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు విషయాలను పంచుకుంది. ‘ఇప్పుడు నేను మేకప్ ఆర్టిస్టుగా చేస్తున్నాను. బ్యూటీ పార్లర్ ఉంది. చిన్నప్పటి నుండి నేను అందంగా లేనని బాధపడుతూ ఉండేదాన్ని. కానీ నాగరాజన్ నా జీవితంలోకి వచ్చాక లైఫ్ పూర్తిగా మారిపోయింది’అని పేర్కొంది.

‘నాగరాజన్ భర్తగా దొరకడం అదృష్టం. ఆయన నా పాలిట దేవుడు. బాగా చూసుకుంటారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో నాగరాజన్ అంటే కోపం వచ్చింది. రోజులు గడిచే కొద్దీ అతని మంచి మనస్సు నాకు అర్థమైంది. అతను నిజాయితీ నచ్చింది. మాకు పెళ్లైంది. నేను గర్భం దాల్చిన ఎనిమిదో నెలలో కడుపులోనే బిడ్డ చనిపోయింది. నాకు తెలియదు. మూడు రోజుల తర్వాత ఆసుపత్రికి వెళితే.. బిడ్డ చనిపోయిందని అబార్షన్ చేశారు. అందరూ బిడ్డను ఆమెకు చూపించొద్దని చెబితే.. భర్త మాత్రం నాకు చూపించాలని పట్టుబట్టాడు. ఆమెకు చూపించకపోతే మరింత బాధపడుతుందని చెప్పి సమస్యను చిన్నది చేశాడు. ఆ తర్వాత మాకు బాబు పుట్టాడు. తర్వాత మేకప్ క్లాసుల్లో చేరాను. ఆ తర్వాత బ్యూటీ పార్లర్ ఏర్పాటుకు నా భర్త తోడ్పాటు అందించాడు’ అని తెలిపింది సుగుణ.

Show comments