టాలీవుడ్‌లో కొత్త భజన స్టార్! హీరోలని కాకపట్టడంలో జబర్దస్త్ టాలెంట్!

Bhajana Star of Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ కొత్త భజన స్టార్‌ తయారండోయ్‌. అతని చేతికి మైక్‌ దొరికితే చాలు ప్రాసలతో తెగ భజన చేసేస్తున్నాడు. ఇంతకీ ఆ కొత్త భజన స్టార్‌ గురించి విశేషాలు తెలుసుకుందాం..

Bhajana Star of Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ కొత్త భజన స్టార్‌ తయారండోయ్‌. అతని చేతికి మైక్‌ దొరికితే చాలు ప్రాసలతో తెగ భజన చేసేస్తున్నాడు. ఇంతకీ ఆ కొత్త భజన స్టార్‌ గురించి విశేషాలు తెలుసుకుందాం..

సినిమా రంగం అంటేనే ఒక మాయా ప్రపంచం. ఇక్కడ ఎదగాలంటే టాలెంట్‌తో పాటు కాస్త మాయ చేయడం కూడా తెలిసి ఉండాలనే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడో ఏమో కానీ.. ఓ నటుడు టాలీవుడ్‌లో కొత్త భజన స్టార్‌ ట్యాగ్‌ను సొంతం చేసుకున్నాడు. ఓ కామెడీ షోలో అప్పటికే అక్కడ స్థిరపడిన ఓ టీమ్‌ లీడర్‌ను సైడ్‌ చేసి అక్కడ స్థిరపడ్డాడు. సరే.. అది అతని టాలెంట్. కానీ.., సినిమా అవకాశాలు మాత్రం ఇంత ఈజీగా రావని మనోడికి అర్థం అయిపోయినట్టు ఉంది. దీంతో.. సినిమా అవకాశాల కోసం.. ‘భజన’ను నమ్ముకున్నాడు. భజన అంటే మామూలు భజన కాదండోయ్. వినే వారి చెవులకు చిల్లులు పడే రేంజ్ భజన.

ఏ ఫంక్షన్స్ లో అయినా.. అవసరం ఉన్నా, లేకపోయినా.. మైకు దొరికితే చాలు ప్రాసతో హీరోలపై మనోడు కురిపించే ప్రశంసలకి హద్దే ఉండదు. ఇక నిన్న మొన్నటి వరకు ఒక కాంపౌండ్‌కి మాత్రమే స్టిక్ అయిన ఈ భజన స్టార్.. ఇప్పుడు ఏ హీరో దొరికితే.. ఆ హీరోను తన భజనతో ఎత్తేస్తున్నాడు. ఏదో ఒక హీరోనో ఇద్దరు హీరోలనో ఇలా ఆకాశానికి ఎత్తేస్తున్నాడంటే అభిమానం అనుకోవచ్చు. కానీ, సందు దొరికితే చాలు.. ఏ హీరో అయినా మనోడిది ఒకటే పని.. ‘భజన’. ఇలాంటి భజనను స్టార్‌ హీరోలు ఎవరూ పెద్దగా ఎంకరేజ్‌ చేయకపోయినా.. ఆ హీరో చుట్టూ ఉండే కోటరీ మాత్రం ఇతను మన కాంపౌడ్‌కు చెందిన వాడే అనుకుని ఆఫర్లు ఇస్తున్నారు. ఈ భజన కారణంగా అతని కెరీర్‌ బాగానే సాగుతున్నా జనం దృష్టిలో మాత్రం పెద్ద భజన స్టార్‌గా మారిపోయాడు.

ముఖ్యంగా మనోడి దెబ్బకి ఆడియో ఫంక్షన్స్, రిలీజ్ ఫంక్షన్స్ కి వెళ్లే అభిమానులకి మాత్రం చిరాకు వచ్చేస్తోంది. ఇక ఆ స్పీచ్‌లు సోషల్ మీడియాలో నిన్న మొన్నటి వరకు వైరల్ అయ్యేవి కూడా. కానీ.. నెటిజన్స్ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశారు. తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో కూడా మనోడి తీరు ఇలానే సాగడంతో మరోసారి నెటిజన్స్ అతని తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. అయితే.., ఇండస్ట్రీలో నెట్టుకుని రావడం అనేది అంత సులభమైన పని కాదు. తనకి సపోర్ట్ కోసం ఆ నటుడు ముందుగా ఈ మార్గాన్ని ఎంచుకోవడంలో పెద్దగా తప్పులేకపోయినా, ఇంకా అదే పంథాని నమ్ముకోవడం ప్రేక్షకుల అసహనానికి కారణం అవుతుంది. మరి .. ఇకనైనా ఆ నటుడు తన భజనతో కాకుండా నటనతో మంచి గుర్తింపు దక్కించుకుంటాడో లేదో చూడాలి.

Show comments