Krishna Kowshik
మయోసైటిస్ బారిన పడి, కోలుకున్న సమంత.. తాజాగా ఓ హెల్త్ పాడ్ కాస్ట్ లో పాల్గొని.. పలు విషయాలను పంచుకుంది. ఇదే ఆమెను సమస్యల్లోకి నెడుతోంది. కాలేయ వ్యాధికి ఓ మెడిసన్ మంచిదని చెప్పగా.. ఓ డాక్టర్ ఫైర్ అయిన సంగతి విదితమే.. తాజాగా
మయోసైటిస్ బారిన పడి, కోలుకున్న సమంత.. తాజాగా ఓ హెల్త్ పాడ్ కాస్ట్ లో పాల్గొని.. పలు విషయాలను పంచుకుంది. ఇదే ఆమెను సమస్యల్లోకి నెడుతోంది. కాలేయ వ్యాధికి ఓ మెడిసన్ మంచిదని చెప్పగా.. ఓ డాక్టర్ ఫైర్ అయిన సంగతి విదితమే.. తాజాగా
Krishna Kowshik
టాలీవుడ్ టాప్ హీరోయిన్, టాలెంట్ యాక్ట్రెస్.. సమంత ఇటీవల కాలంలో ట్రోల్స్‌కు గురౌతుంది. ఆమె స్వయంకృతాపరాధమే ట్రోలర్స్‌కు ఛాన్స్ ఇచ్చేలా చేసింది. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత విపరీతంగా పాజిటివిటీని మూటగట్టుకున్న ఈ చిల్ బులీ.. తర్వాత మయో సైటిస్ అనే వ్యాధి బారిన పడి చికిత్స తీసుకుంది. దీంతో షూటింగ్స్‌కు కాస్త దూరంగా ఉంటోంది. అంతకు ముందు సైన్ చేసిన సినిమాలే తప్ప.. కొత్తగా ఏమీ ఒప్పుకోలేదు. తాజాగా కోలుకున్నట్లు వెల్లడించిన ఆమె.. సినిమాలకు రెడీ అంటూ చెప్పుకొచ్చింది . అంతలో ఓ పాడ్ కాస్ట్‌లో ఆరోగ్య విషయాలు పంచుకోగా.. ఓ డాక్టర్ ఏకి పారేసిన సంగతి విదితమే. ఆరోగ్యం గురించి, ఔషధాల గురించి ఏమీ తెలియని సెలబ్రిటీలను తీసుకు వచ్చి హెల్త్ పాడ్ కాస్ట్ చేయిస్తున్నారంటూ మండిపడ్డారు వైద్యుడు.
అక్కడితో సమస్య ముగిసిపోలేదు. మరోసారి నెటిజన్లు సమంతను ఆడేసుకుంటున్నారు. అందుకు కారణమైందీ పాడ్ కాస్ట్‌లో సమంత చేసిన వ్యాఖ్యలే. ఇంతకు ఏం అయ్యిందంటే.? సామ్ పాడ్ కాస్ట్‌లో తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. షుగర్ ఉన్న డ్రింక్స్ తాగడాన్ని ఎవైడ్ చేసినట్లు, అవి తాగొద్దని సూచించింది. అలాగే స్వీట్ చాక్లెట్స్ తినడం లేదని చెప్పింది. అదే క్రమంలో తన వంటలను కొబ్బరి నూనెతో చేసుకుంటున్నట్లు కూడా వెల్లడించింది. ప్రాసెస్ ఫుడ్స్ అంటే టిన్, ప్యాకెట్, ప్లాస్టిక్ బాటిల్స్‌లో నిల్వ చేసే జంక్ ఫుడ్స్ లాంటివి తీసుకోవడం లేదని చెప్పుకొచ్చింది. దీనిపైనే నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
షుగర్ డ్రింక్స్ లాంటివి ఎవైడ్ చేయాలని, చేస్తున్నానని చెప్పిన సామ్.. పెప్పీ, ఫెంటా వంటి స్వీట్స్ డ్రింక్స్ ప్రమోట్ చేసింది. అలాగే.. స్వీట్ చాక్లెట్స్ తినడం లేదన్న ఆమె.. మచ్ వంటి స్వీట్ చాక్లెట్స్ యాడ్స్ చేసింది. కోకోనట్ ఆయిల్‌తో వంట చేసుకుంటున్న ఆమె..ఫార్చూన్ సన్ ప్లవర్ ఆయిల్ ప్రమోట్ చేస్తోంది. ప్రాసెస్ ఫుడ్ కు దూరంగా ఉంటున్నట్లు తెలిపిన సమంత మాత్రం.. కుర్ కురే లాంటి ప్యాక్డ్, జంక్ ఫుడ్ యాడ్స్ చేస్తుంది. దీంతో మీరు చెబుతున్నదీ ఒకటి.. చేస్తోంది మరొకటి అంటూ మండిపడుతున్నారు. ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో చెప్పిన మీరు.. ఇలాంటి ప్రొడక్ట్స్ ఎలా ప్రమోట్ చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. మీరు వినియోగించని ఉత్పత్తులను మీరు ప్రమోట్ చేయకండని సూచిస్తున్నారు. మొత్తానికి తనకు తానే సమస్యలను కొని తెచ్చుకుంది అమ్మడు. ఖుషీ తర్వాత సామ్ తెరపై కనిపించలేదు. కొత్త సినిమాలు ఏవీ అంగీకరించినట్లు కూడా తెలియలేదు. అప్పుడెప్పుడో తెరకెక్కించిన సీటాడెల్ వెబ్ సిరీస్ రావాల్సి ఉంది.