iDreamPost
android-app
ios-app

సలార్ సక్సెస్.. పవన్ కళ్యాణ్ పై నెటిజన్ల సెటైర్లు!

  • Published Dec 23, 2023 | 1:05 PM Updated Updated Dec 23, 2023 | 1:16 PM

తెలుగు ఇండస్ట్రీలో మొన్నటి వరకు సలార్ మూవీ గురించి చర్చలు సాగాయి.. నిన్న ప్రపంచ వ్యాప్తంగా సలార్ మూవీ రిలజ్ తర్వాత ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. ఆరేళ్ల తర్వాత తమ ఆకలి తీరిందని సంబరాలు చేసుకుంటున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో మొన్నటి వరకు సలార్ మూవీ గురించి చర్చలు సాగాయి.. నిన్న ప్రపంచ వ్యాప్తంగా సలార్ మూవీ రిలజ్ తర్వాత ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. ఆరేళ్ల తర్వాత తమ ఆకలి తీరిందని సంబరాలు చేసుకుంటున్నారు.

  • Published Dec 23, 2023 | 1:05 PMUpdated Dec 23, 2023 | 1:16 PM
సలార్ సక్సెస్..  పవన్ కళ్యాణ్ పై నెటిజన్ల సెటైర్లు!

తెలుగు ఇండస్ట్రీలో ఈశ్వర్ చిత్రంతో మాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తర్వాత చత్రపతి, డాల్లింగ్, మిర్చి లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక బాహుబలి చిత్రంతో ఏకంగా ప్రపంచ స్థాయిలో ప్రభాస్ ఓ రేంజ్ కి ఎదిగిపోయాడు. పాన్ ఇండియా హీరోగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో కేవలం ప్రభాస్ పేరుతోనే కోట్లు వసూళ్లు అయ్యే పరిస్థితి నెలకొంది. బాహుబలి తర్వాత వరుస డిజాస్టర్స్ ఎదరైనా.. ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందరి ఆకలి తీర్చేందుకు సలార్ మూవీతో ప్రత్యక్షమయ్యాడు. ఆరేళ్ల ఆకలి తిరిపోయిందని డాల్లింగ్ అభిమానులు, ఆడియన్స్ సంతోషంలో ఉన్నారు. తాజాగా సలార్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ ఉన్న క్రేజ్ తో కొంతమంది సెలబ్రెటీలను పోల్చుతూ మీమ్స్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒకటి కాదు రెండు కాదు.. ఆరేళ్లు సూపర్ హిట్ కోసం అటు ప్రభాస్ ఇటు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. అనుకున్నట్లుగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’డిసెంబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై ప్రభంజనం సృష్టించింది. కొన్నిఏరియాల్లో సరికొత్త రికార్డులు కూడా సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ పై పాజిటీవ్ రివ్యూ వచ్చింది. ఇన్నాళ్లకు ప్రభాస్ కి తగ్గ స్టోరీ దొరికిందని.. తెరపై అతని కటౌట్ చూసి ప్రక్షకులు పండగ చేసుకున్నారని అంటున్నారు. తాజాగా ఈ మూవీలో ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని ఎలా ఉపయోగించుకున్నాడనేది నెట్టంట వైరల్ అవుతుంది. యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ బాడీ, ఊరమాస్ లుక్ డైరెక్టర్ అద్భుతంగా ఎలివేట్ చేశారని ప్రశంసలు కురిపిస్తున్నారు.

prabas fans settires on pawan kalyan

ఈ మూవీ ఫస్ట్ టీజర్ లో టీనూ ఆనంద్ అన్నట్టు జురాసిక్ పార్క్ లో డైనోసార్ కి ఎదురు లేదు అన్నట్లు.. ఈ మూవీలో ప్రతీ సీన్ లో ప్రభాస్ ని నిజంగా ఒక వీర యోధుడిగా చూపించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు ఫిదా అవుతున్నారు. బాహుబలిలో ఒక మహరాజు ఎలా ఉంటాడో దానికి తగ్గట్టుగా చూపించారు రాజమౌళి.. యుద్ద రంగంలో ఒక వీరుడు ఎలా ఉంటాడో చూపించాడు ప్రశాంత్ నీల్. ఏది ఏమైనా ప్రభాస్ గాంభీర్యానికి తగ్గ పాత్రలు రావడం నిజంగా ఆయన చేసుకున్న అదృష్టమే అంటున్నారు. ఈ విషయంపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని టాలీవుడ్ కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని సినిమాటిక్ అందులోనూ పవన్ కళ్యాన్ కి తగిలి వచ్చేలా పొలిటికల్ టచ్ ఇవ్వడం గమనార్హం.

ప్రభాస్ కటౌట్ కి తగ్గట్టుగా వాడుకుంది రాజమౌళి, ప్రశాంత్ నీల్,  ఎన్టీఆర్ ని బాగా వాడుకుంది వీవీ నాయక్, రాజమౌళి. అల్లు అర్జున్ ని సూపర్ గా వాడుకుంది త్రివిక్రమ్, సుకుమార్. ప్రిన్స్ మహేష్ బాబు ని బాగా వాడుకుంది పూరి జగన్నాథ్. ఇక పవన్ కళ్యాణ్ ను ఒక రేంజ్ లో వాడుకుంది కేవలం మాజీ సీఎం చంద్రబాబు అని ట్వీట్ చేశారు.  పొలిటికల్ గేమ్ లో పవన్ ని చంద్రబాబు బాగా వాడుకుంటున్నాడని అభిప్రాయపడ్డారు ఆర్జీవి . పవన్ కళ్యాణ్ ని ఉపయోగించుకోవడంలో చంద్రబాబు తో ఏ డైరెక్టర్ పోటీ పడలేరని ఆయన సెటైర్ వేశారు. తాజాగా ఈ ట్వీట్ పై కొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ మీటింగ్ ఎక్కడ జరిగినా సీఎం.. సీఎం అంటూ అభిమానులు, కార్యకర్తలు హూరెత్తిస్తున్నారు. కానీ నిన్న ఓ ఇంటర్వ్యూలో నారా లోకేష్ ఒకేవేళ టీడీపీ, జనసేన కూటమిలో గెలిస్తే సీఎం ఎవరు అన్న ప్రశ్నకి వెంటనే తన తండ్రి చంద్రబాబు సీఎం అవుతారు.. పదవి విషయంలో నో కాంప్రమైజ్ అన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో పవన్ ఫ్యాన్స్ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పటికైనా ఫ్యాన్స్ కి అర్దం అవుతుందా? చంద్రబాబు వాడకం ఏ రేంజ్ లో ఉంటుందో అని అంటూ నటిజన్లు పవన్ పై సెటైర్లు వేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom