iDreamPost
android-app
ios-app

ప్రేమ పేరుతో మోసం.. ఆపై దాడి.. నటుడిపై కేసు

సినీ ఇండస్ట్రీ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. ప్రేయసి కోసం ఒకరు హత్య చేసి జైలు పాలైతే. . మరొకరు మోసం చేశాడన్న ఆరోపణలపై విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు భార్యపై దాడి చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఓ నటుడు.

సినీ ఇండస్ట్రీ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. ప్రేయసి కోసం ఒకరు హత్య చేసి జైలు పాలైతే. . మరొకరు మోసం చేశాడన్న ఆరోపణలపై విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు భార్యపై దాడి చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఓ నటుడు.

ప్రేమ పేరుతో మోసం.. ఆపై దాడి.. నటుడిపై కేసు

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. ప్రేయసి పవిత్రగౌడ కోసం రేణుకా స్వామిని అత్యంత ఘోరంగా కొట్టి చంపి జైలు పాలయ్యాడు కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగదీప. అలాగే చందన సీమలోనే రెడ్ మార్క్ లేని కుటుంబం నుండి వచ్చిన యువ రాజ్ కుమార్ ఆయన భార్య శ్రీదేవి.. ఒకరిపై ఒకరు అక్రమ సంబంధాల ఆరోపణలు నిలిచి హాట్ టాపిక్ అయ్యారు. వీళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు. అంతలో తెలుగు స్టార్ హీరో రాజ్ తరుణ్- లావణ్యల గొడవ పోలీస్ స్టేషన్‌కు ఎక్కి రచ్చ రచ్చ అయిన సంగతి విదితమే. ఇప్పుడు మరో సీరియల్ నటుడు వివాదంలో చిక్కుకున్నాడు. అతడు కూడా క న్నడ ఇండస్ట్రీకి చెందిన వాడే కావడం గమనార్హం.

కన్నడలో నేత్రావతి సీరియల్‌లో యాక్ట్ చేసిన సన్నీ మహిపాల్ తనను మోసం చేశాడంటూ వాపోతుంది ప్రియురాలు కమ్ భార్య. తనను చీట్ చేసి మరొకరితో పెళ్లికి రెడీ అయ్యాడని, అడిగినందుకు తనను కొడుతున్నాడని తీవ్రమైన ఆరోపణలు చేసింది. కాగా, సీరియల్ పూర్తికావడంతో అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు సన్నీ. 2024 జనవరిలో యువతికి సన్నీ పరిచయమయ్యాడు. సోషల్ మీడియాలో వీరి స్నేహం మొదలైంది. సన్నీ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. లోబర్చుకున్నాడు. జూన్ 15న ప్రేయసిని సన్నీ మహిపాల్‌ ఆలయంలో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి ఇద్దరు కలిసి కాపురం చేశారు. అయితే మహిళ గర్భం దాల్చింది. భార్య గర్భం దాల్చిందని తెలియగానే.. అతడిలో మార్పులు మొదలయ్యాయి.

అయితే సన్నీ తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. అదేమని ప్రశ్నిస్తే.. ఇక మనద్దిరం స్నేహితులుగా మాత్రమే ఉంటామని చెప్పడంతో షాక్ తింది. అంతలో అతడికి మరో యువతితో నిశ్చితార్థమైంది. ఈ విషయం తెలిసి.. జులై 22వ తేదీ రాత్రి విజ్ఞాన్ నగర్‌లోని మహిపాల్ ఇంటికి వెళ్లింది. దీంతో ఆమెపై చేయి చేసుకోవడంతో పాటు కత్తితో చేతిలో పొడిచాడని చెబుతుంది బాధితురాలు. గొడవ అనంతరం సన్నీ భార్య పోలీసులకు ఫోన్ చేసింది. సన్నీ తనను చీట్ చేసి.. మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడని, అడిగినందుకు కత్తితో దాడి చేశాడని, ఈ క్రమంలో తనకు గర్భస్రావం అయ్యిందని పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetgaranti girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetcasibomGrandpashabet Girişgrandpashabet giriş