iDreamPost
android-app
ios-app

NETFLIX నెట్ ఫ్లిక్స్ రేట్లు త‌గ్గుతున్నాయ్!

  • Published May 11, 2022 | 3:11 PM Updated Updated May 11, 2022 | 3:11 PM
NETFLIX నెట్ ఫ్లిక్స్ రేట్లు త‌గ్గుతున్నాయ్!

ఈ యేడాది నెట్ ఫ్లిక్స్(Netflix ) కి పెద్ద‌గా క‌ల‌సిరావ‌డంలేదు. మొద‌టి మూడునెల‌ల్లోనే రెండు ల‌క్ష‌ల‌మంది వినియోగ‌దారుల‌ను పోగొట్టుకొంది. వ‌చ్చే మూడు నెల‌ల్లో మ‌రో రెండు ల‌క్ష‌ల మంది నెట్ ఫ్లిక్స్ కు దూరం కావ‌చ్చు. అందుకే వ్యూహాన్ని మార్చింది. రేటు త‌గ్గిస్తే ఉన్న వాళ్ల‌ను నిల‌బెట్టుకోవ‌డంతోపాటు, కొత్త‌వాళ్ల‌ను రాబ‌ట్టుకోవ‌చ్చున‌ని ఆలోచిస్తోంది.

స‌బ్ స్క్రైబ‌ర్స్ త‌గ్గేస‌రికి, షేర్ వాల్యూ కూడా ప‌డిపోయింది. కంపెనీ మార్కెట్ వాల్యూ 70 బిలియ‌న్ డాల‌ర్ల మేర త‌గ్గిపోవ‌డ‌మంటే, ఆందోళ‌న ప‌డాల్సిందే.

స‌బ్ స్క్రిప్ష‌న్ రేట్లు త‌గ్గిస్తే కంపెనీకి న‌ష్టం. మార్కెట్ వాల్యూ మ‌రింత ప‌డిపోతుంది. మ‌రేం చేయాలి? అందుకే సినిమాలు, వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ అవుతున్న‌ప్పుడు యాడ్స్ వేద్దామ‌న్న‌ది కొత్త ప్రపోజ‌ల్. ఈ మేర‌కు నెట్ ఫ్లిక్స్ సీఈఓ రీడ్ హాస్టింగ్స్ (Netflix CEO, Reed Hastings) కంపెనీ స్టాఫ్ కి ఈమెయిల్ చేశారు. వ‌చ్చే రెండేళ్ల‌లో ఎలా యాడ్స్ సంపాదించాలి? ఎలా వేయాల‌న్న‌ది దానిపై ప్లాన్ చేయ‌నున్నారు.

అస‌లు ఈయేడాదిలోగా, స‌బ్ స్క్రిప్ష‌న్ రేట్లు త‌గ్గించి వినియోగ‌దారుల సంఖ్య‌ను పెంచుకోవాల‌న్న‌ది నెట్ ఫ్లిక్స్ త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం.