Venkateswarlu
నయన్‌తార తాజాగా అన్నపూరణి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డిసెంబర్ 1వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్నటి వరకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యేది.
నయన్‌తార తాజాగా అన్నపూరణి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డిసెంబర్ 1వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్నటి వరకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యేది.
Venkateswarlu
పెళ్లి తర్వాత కూడా నయనతార తన సత్తా చాటుతున్నారు. వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతున్నారు. తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా, ఆమె ‘అన్నపూరణి’ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దాదాపు నెల రోజుల తర్వాత అన్నపూరణి ఓటీటీ ప్లాట్ ఫామ్‌లోకి వచ్చేసింది. నిన్నటి వరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఉండింది.
అయితే, ఈ మూవీ తాజాగా లీగల్ సమస్యల్లో చిక్కుకుంది. ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బ తీసేదిలా ఉందంటూ.. నయనతారతో పాటు ఈ చిత్ర నిర్మాతలు, దర్శకుడిపై కేసు నమోదైంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ సినిమా స్ట్రీమింగ్‌ను ఆపేసింది. అభ్యంతరకరంగా ఉన్న సన్ని వేశాలు ఎడిట్ చేసిన తర్వాత చిత్రం మళ్లీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఈ సినిమాను నిర్మించిన జీ స్టూడియోస్ కూడా ఈ వివాదంపై స్పందించింది. బ్రహ్మణులకు బహిరంగ క్షమాపణ చెప్పింది.
ఈ మేరకు ఓ క్షమాపణ లేఖను విడుదల చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీయటం తమ ఉద్దేశ్యం అస్సలు కాదని ఆ లేఖలో పేర్కొంది. కాగా, ఈ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు నిలేశ్ క్రిష్ణ దర్శకత్వం వహించారు. జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కేఎస్ రవికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీ స్డూడియోస్, నాథ్ ఎస్ స్టూడియోస్, టైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందించారు.
ఇంతకీ అన్నపూరణి కథ ఏంటంటే..
రంగరాజన్(అచ్యుత్ కుమార్) అనే వ్యక్తి దేవుడి నైవేద్యం, ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటాడు. అతడి కూతురు అన్నపూరణి(నయనతార) తండ్రి వంటలు చూస్తూ పెరిగి.. వంటలు చేయటంపై ఇష్టాన్ని పెంచుకుంటుంది. ఆమెకు చిన్నప్పటి నుంచే ఒక గొప్ప చెఫ్ కావాలనే కోరిక ఏర్పడుతుంది. ఇదే విషయాన్ని తండ్రికి చెబుతుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మాంసాహారాలు వండే చెఫ్ ఎలా అవుతావ్ అని ఆయన నిలదీస్తాడు. ఎంబీఏ లాంటి కోర్సులు చేసుకోమంటాడు. అయితే అన్నపూరణికి తన స్నేహితుడు ఫర్హాన్(జై) తోడుగా నిలుస్తాడు. ఎంబీఏ, చెఫ్ రెండు కోర్సులు ఉండే కళాశాలలో చెఫ్ కోర్సులో చేరుతుంది. అన్నపూరణి కల నెరవేరుతుందా? లేదా అనేదే మిగితా కథ. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Zee issues apology for Tamil film #Annapoorani. Says they didn’t intend to hurt the sentiments of the Brahmin Community. pic.twitter.com/Pu9wyyhTt1
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) January 11, 2024