iDreamPost
android-app
ios-app

విజయ్, మహేష్, షారుక్ కాంబోలో మూవీ.. జైలర్ డైరెక్టర్ భారీ ప్లాన్

  • Published Apr 26, 2024 | 9:57 PM Updated Updated Apr 26, 2024 | 9:57 PM

కోలీవుడ్ స్టార్ విజయ్ జోసెఫ్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కాంబోలో మూవీ.. ఆహా ఆ ఊహ ఎంత బాగుందో కదా. మనకి ఊహే కానీ జైలర్ దర్శకుడు నెల్సన్ కి మాత్రం డ్రీమ్ అంట. ఈ ముగ్గురితో నెల్సన్ గట్టిగానే ప్లాన్ చేశారు.

కోలీవుడ్ స్టార్ విజయ్ జోసెఫ్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కాంబోలో మూవీ.. ఆహా ఆ ఊహ ఎంత బాగుందో కదా. మనకి ఊహే కానీ జైలర్ దర్శకుడు నెల్సన్ కి మాత్రం డ్రీమ్ అంట. ఈ ముగ్గురితో నెల్సన్ గట్టిగానే ప్లాన్ చేశారు.

  • Published Apr 26, 2024 | 9:57 PMUpdated Apr 26, 2024 | 9:57 PM
విజయ్, మహేష్, షారుక్ కాంబోలో మూవీ.. జైలర్ డైరెక్టర్ భారీ ప్లాన్

రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. దీని కంటే ముందు కోకో కోకిల, వరుణ్ డాక్టర్, బీస్ట్ సినిమాలని తెరకెక్కించారీ దర్శకుడు. ఈయన సినిమాల్లో కామెడీ పిచ్చ పిచ్చగా ఉంటుంది. ముఖ్యంగా శివకార్తికేయన్ నటించిన వరుణ్ డాక్టర్ మూవీలో కామెడీ అయితే బీభత్సంగా ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ ఓ అవార్డు వేడుకలో మాత్రం తన ప్లాన్ గురించి వెల్లడించారు. ముగ్గురు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీ చేయడం తన కల అని అన్నారు. ఆ స్టార్ హీరోల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారని నెల్సన్ వెల్లడించారు. 

ఒకవేళ తాను గనుక కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తో సినిమా చేస్తే ఆ మూవీలో ఖచ్చితంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ని, మలయాళ స్టార్ మమ్ముట్టిని తీసుకుంటానని అన్నారు. వారికి ఈ మూవీలో కీలక పాత్రలు ఇస్తానని అన్నారు. విజయ్ తో చేసే మూవీలో మహేష్, షారుక్, మమ్ముట్టి ముగ్గురు హీరోలు ఉండడం తన కల అని అవార్డు వేడుక వేదిక మీద వెల్లడించారు. ఇక హీరోయిన్ గా నయనతారనే తీసుకుంటానని అన్నారు. జైలర్ మూవీలో కూడా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ లను కీలక పాత్రల్లో తీసుకుని ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేశారు. తాజాగా విజయ్ తో మూవీ చేస్తే కనుక మహేష్, షారుక్, మమ్ముట్టిలను తీసుకుంటానని చెప్పడంతో నెటిజన్స్ వావ్ అమేజింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. వీరి నలుగురి కాంబినేషన్ లో కనుక మూవీ వస్తే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు.

ప్రస్తుతం నెల్సన్-రజినీకాంత్ కాంబోలో జైలర్ పార్ట్ 2 రానుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సీక్వెల్ కి హుకుం అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. రజినీకాంత్ కి ఆల్రెడీ నెల్సన్ కథ చెప్పారని.. రజినీ కూడా ఒప్పుకున్నారని సమాచారం. ఈ ఏడాది చివర్లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే కనుక 2025 చివరిలో తన కల నెరవేరే అవకాశం ఉండచ్చునని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదేనండి.. విజయ్, మహేష్, షారుక్, మమ్ముట్టి కాంబోలో మూవీ. మరి ఈ కాంబోలో మూవీ వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbenjaminsbet girişgrandpashabet