Krishna Kowshik
విశ్వక్ సేన్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా వచ్చిన మూవీ గామి. మార్చి 8న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. అదే సమయంలో నెగిటివిటీని మూటగట్టుకుంటుంది.
విశ్వక్ సేన్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా వచ్చిన మూవీ గామి. మార్చి 8న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. అదే సమయంలో నెగిటివిటీని మూటగట్టుకుంటుంది.
Krishna Kowshik
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అఘోరాగా నటించిన రీసెంట్ చిత్రం గామి. మహా శివరాత్రి పురస్కరించుకుని మార్చి 8 నుండి బిగ్ స్క్రీన్‌పై సందడి చేస్తోంది. సినిమా పోస్టర్, ట్రైలర్ సినిమా అంచనాలు పెంచేశాయి. అలాగే ఈ సినిమా కొత్తగా ఉండబోతుందంటూ.. కచ్చితంగా హిట్ కొడతామంటూ చిత్ర యూనిట్ తొలి నుండి ధీమా వ్యక్తం చేసింది. ఆశించినట్టుగానే మంచి హిట్ టాక్‌తో దూసుకెళుతుంది. డిఫరెంట్ స్టోరీ, విజువల్ వండర్స్‌తో తెరకెక్కిన ఈచిత్రం తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 9.07 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. విశ్వక్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లుగా నిలిచిపోయింది గామి. అమెరికాలో 265K డాలర్స్ రాబట్టుకుంది ఈ చిత్రం. ఈ విజయంతో ఫుల్ జోష్‍లో ఉంది చిత్ర యూనిట్.
ఇదే సమయంలో ఈ సినిమా విపరీతమైన నెగిటివ్ ప్రచారం ప్రచారం జరుగుతుంది. పని గట్టుకుని గామి చిత్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా.. సినిమా బాగోలేదంటూ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. నకిలీ ఖాతాలతో బుక్ మై షోలో ఈ చిత్రానికి 10కి 1 అంటూ రేటింగ్ ఇస్తున్నారు. దీంతో మూవీ రేటింగ్ పడిపోతుంది. ఈ విషయం చిత్ర యూనిట్ దృష్టికి కూడా చేరింది. కావాలని ఇలా చేస్తున్నారని భావించిన మూవీ టీం.. కలెక్షన్లతో ఈ నెగిటివిటీకి చెక్ పెట్టింది. మొత్తానికి హిట్ టాక్ రావడంతో సంతోషంలో ఉన్న చిత్ర యూనిట్.. సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించింది. ఇదే క్రమంలో తక్కువ రేటింగ్ ఇస్తున్న నెటిజన్లపై ఫైర్ అవుతున్నారు విశ్వక్ సేన్ ఫ్యాన్స్. సినిమా చాలా కొత్తగా ఉందని చెబుతున్నారు. చిన్న హీరోను బతకనివ్వరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చిన్న హీరోలు, తక్కువ బడ్జెట్ సినిమాల విషయంలో ఇలాంటి నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. విజయ్ దేవర కొండ ఖుషి సినిమా సమయంలో కాకుండా.. హనుమాన్ రిలీజ్ టైంలో కూడా విపరీతమైన రూమర్స్ స్ప్రెడ్ చేశారు. అయితే వీటి కలెక్షన్లు.. వాళ్ల నోళ్లు మూతలు పడేలా చేశాయి. ఇప్పుడు ఈ సమస్య విశ్వక్ సేన్ చిత్రానికి పాకింది. ఇప్పుడిప్పుడే చిన్న సినిమాలు వచ్చి ఇండస్ట్రీని బతికిస్తున్నాయి అనుకుంటున్న సమయంలో.. వారిని చితికిపోయేలా చేస్తున్నాయి ఇలాంటి ప్రచార అస్త్రాలు.
ఇక సినిమా కథ విషయానికి వస్తే.. అఘోరాగా అయిన శంకర్ (విశ్వక్).. ఓ వింత వ్యాధితో బాధపడుతుంటాడు. దీంతో మిగిలిన అఘోరాలు ఆయన్ను శాపగ్రస్తుడిగా భావిస్తుంటారు. దీనికి పరిష్కారం హిమాలయాల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలి పత్రాల్లో ఉంటుందని ఓ స్వామిజీ ద్వారా తెలుసుకుని.. డాక్టర్ జాహ్నవి (చాందినీ చౌదరి) సాయంతో బయలు దేరుతాడు. ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లేంది. దేవరాసి దుర్గ ఎవరు.. తెరపైన చూడాల్సిందే. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్, వి సెల్యూలయిడ్, విఆర్ గ్లోబర్ మీడియా క్లోన్ పిక్చర్స్ పై కార్తీక్ సబరీష్, శ్వేత నిర్మించారు. విద్యా సాగర్ కాగిత దీనికి దర్శకుడు. పోస్టర్స్, ట్రైలర్లతో హైప్ పెంచుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది.
Official: #Gaami Day1 WW Gross 9.07Cr pic.twitter.com/hbedOD6Ze9
— TollywoodBoxoffice.IN (@TBO_Updates) March 9, 2024
Team #Gaami share their happiness for the love the Telugu audience are showering on the film
Do not miss 𝗧𝗛𝗘 𝗕𝗥𝗘𝗔𝗧𝗛𝗧𝗔𝗞𝗜𝗡𝗚 𝗘𝗣𝗜𝗖 𝗙𝗥𝗢𝗠 𝗧𝗘𝗟𝗨𝗚𝗨 𝗖𝗜𝗡𝗘𝗠𝗔 on the big screens 🤩
Book your tickets now 💥💥
🎟️ https://t.co/eyu1QkKcM7@VishwakSenActor… pic.twitter.com/YUaqcD0YMR— BA Raju’s Team (@baraju_SuperHit) March 9, 2024