iDreamPost
android-app
ios-app

స్పిరిట్ అప్డేట్ లీక్ చేపించిన బాలయ్య! ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండగే!

  • Published Nov 24, 2023 | 12:06 PM Updated Updated Nov 24, 2023 | 12:06 PM

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. అర్జున్‌ రెడ్డి వంటి సినిమాతో దేశాన్ని ఊపేసిన సందీప్‌ వంగా డైరెక్షన్‌లో స్పిరిట్‌ సినిమా ఉంటుందని ప్రకటించారు. ఆ తర్వాత దాని గురించి ఎలాంటి న్యూస్‌ లేదు. ఈ క్రమంలో తాజాగా స్పిరిట్‌ గురించి అప్డేట్‌ ఇచ్చారు దర్శకుడు సందీప్‌ వంగా. ఆ వివరాలు..

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. అర్జున్‌ రెడ్డి వంటి సినిమాతో దేశాన్ని ఊపేసిన సందీప్‌ వంగా డైరెక్షన్‌లో స్పిరిట్‌ సినిమా ఉంటుందని ప్రకటించారు. ఆ తర్వాత దాని గురించి ఎలాంటి న్యూస్‌ లేదు. ఈ క్రమంలో తాజాగా స్పిరిట్‌ గురించి అప్డేట్‌ ఇచ్చారు దర్శకుడు సందీప్‌ వంగా. ఆ వివరాలు..

  • Published Nov 24, 2023 | 12:06 PMUpdated Nov 24, 2023 | 12:06 PM
స్పిరిట్ అప్డేట్ లీక్ చేపించిన బాలయ్య! ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండగే!

పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సలార్‌, కల్కి ప్రాజెక్ట్స్‌ అన్ని పాన్‌ ఇండియా సినిమాలే. ఇదేకాక మారుతీ డైరెక్షన్‌లో కూడా ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత.. ప్రభాస్‌ నటించబోతున్న మరో క్రేజీ పాన్‌ ఇండియా చిత్రం స్పిరిట్‌. ఈ తొలి సినిమా అర్జున్‌రెడ్డితో దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్న దర్శకుడు సందీప్‌ వంగా డైరక్షన్‌లో స్పిరిట్‌ సినిమా రానుందంటూ గతంలో ఓ ప్రకటన వచ్చింది. ఆ తర్వాత సందీప్‌ వంగా యానిమల్‌ సినిమాతో బిజీగా ఉండగా.. ప్రభాస్‌ కల్కి, సలార్‌ మూవీస్‌తో బిజీగా ఉన్నాడు. దాంతో వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రకటించిన స్పిరిట్‌ అటకెక్కిందనే వార్తుల వచ్చాయి.

అయితే తాజాగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్పాడు సందీప్‌ వంగా. స్పిరిట్‌ చిత్రం షూటింగ్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుందో చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తోన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త చెప్పాడు సందీప్‌ వంగా. స్పిరిట్‌కు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చేశాడు. యానిమల్‌ ప్రమోషన్స్‌ కోసం ఓ షోకి హాజరైన సందీప్‌ వంగా.. స్పిరిట్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు.

సందీప్ వంగా దర్శకత్వంలో.. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన యానిమల్‌ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా యానిమల్‌ డైరెక్టర్‌, హీరో, హీరోయిన్లు.. నందమూరి బాలకృష్ణ యాంకర్‌గా చేస్తోన్న అన్‌స్టాపబుల్‌ షోకి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పిరిట్‌ గురించి సందీప్‌ వంగా ఒక కీలక ప్రకనట చేశారు.

ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే.. స్పిరిట్‌ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది అనగా 2024, సెప్టెంబర్‌ 24న ప్రారంభం కానుంది.  దీంతో ప్రభాస్‌ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా ఆ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారని సమాచారం. ఇక ఈ స్పిరిట్ మూవీ చూడాలంటే 2025 వరకు వేచి చూడాల్సిందే.

యానిమల్‌ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సందీప్ వంగా, రణబీర్, రష్మిక.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు. ఈ ఎపిసోడ్ నేడు అనగా నవంబర్‌ 24న ఆహాలోస్ట్రీమ్‌ అవుతుంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌ ప్రేక్షకులకు అందుబాటలో ఉంది.  అన్‌స్టాపబుల్‌ షోకి వచ్చిన రణ్‌బీర్‌ స్పిరిట్‌ సినిమాలో.. చిన్న పాత్ర ఇచ్చినా సరే యాక్ట్‌ చేస్తానంటూ.. దర్శకుడు సందీప్ వంగాని కోరారు. మరి ఆ మూవీలో ఏమన్నా క్యామియో రోల్స్ ఉంటాయా లేదా చూడాలి.

ఇక ప్రభాస్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం ఈ డిసెంబర్‌లో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయ్యిందా లేదా అన్నది తెలియదు. అలానే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న కల్కి కూడా రెండు భాగాలుగా రాబోతుందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మారుతీ సినిమా కూడా సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేసేసుకుంటుందని సమాచారం.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommarsbahisMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/